Skip to main content

విదేశాల్లో లా చదవాలనుకునే వారి కోసం ఎల్‌శాట్-ఇండియా..

లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ ఎల్‌శాట్‌ను నిర్వహిస్తోంది. ఇది ప్రధానంగా అమెరికా, కెనడాల్లోని లా స్కూల్స్‌లో ప్రవేశాలకు ఉద్దేశించిన పరీక్ష.


ప్రపంచవ్యాప్తంగా భారత్‌తోపాటు అనేక దేశాల్లో లా స్కూల్స్‌లు ఎల్‌శాట్ స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో 50కిపైగా ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ఎల్‌శాట్ స్కోరు పరిగణలోకి తీసుకుంటున్నాయి. ఎల్‌శాట్-2021 దరఖాస్తుకు జూన్ 4 వరకు గడువు ఉంది. జూన్14 నుంచి ఎల్‌శాట్‌ను నిర్వహించనున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలకు ముందే ఎల్‌శాట్‌కు హాజరవ్వాలనుకొనే అభ్యర్థులు మార్చి 25 నుంచి నిర్వహించే పరీక్షకు హాజరవ్వొచ్చు.

పవేశాలు కల్పించే కోర్సులు..

  1. బీఏ
  2. ఎల్‌ఎల్‌బీ
  3. బీబీఏ ఎల్‌ఎల్‌బీ
  4. బీకాం ఎల్‌ఎల్‌బీ
  5. బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ
  6. ఎల్‌ఎల్‌బీ
  7. l ఎల్‌ఎల్‌ఎం.
అర్హతలు:
మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు డిగ్రీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుకు ఇంటర్మీడియెట్, ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష విధానం..
ఎల్‌శాట్ రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్‌గా ఉంటుంది. ఇందులో రీడింగ్ కాంప్రహెన్షన్, అనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ నుంచి మొత్తం 92 ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు ప్రతి విభాగాన్ని 35 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. కొవిడ్ కారణంగా ఈ పరీక్షను ఎల్‌శాట్-ఫ్లెక్స్ పేరుతో ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. దీంతో అభ్యర్థులకు ఇంటి నుంచే పరీక్షకు హాజరయ్యే వెసులుబాటు ఉంది. రెండో దశయిన ఎల్‌శాట్ రైటింగ్‌ను సైతం ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహిస్తున్నారు. ఇందులో అనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ -1, లాజికల్ రీజనింగ్-2, రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగాలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటల ఇరవై నిమిషాలు. ఔత్సాహికులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.discoverlaw.in
 
Published date : 03 Feb 2021 07:01PM

Photo Stories