Skip to main content

విదేశాల్లో ఎంబీఏకు ఉపయోగపడే.. ఎన్‌మ్యాట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల..

దేశ విదేశాల్లోని పలు బిజినెస్‌ స్కూల్స్‌లో ఎంబీఏలో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి పరీక్ష.. ఎన్‌మ్యాట్‌. తాజాగా గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ కౌన్సిల్‌ (జీఎంఏసీ).. ఎన్‌మ్యాట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో.. ఎన్‌మ్యాట్‌ దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, ప్రవేశ విధానం, ఎన్‌మ్యాట్‌తో ప్రవేశాలు కల్పించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు...

జీఎంఏసీ... ప్రపంచంలోని ప్రముఖ బిజినెస్‌ స్కూల్స్‌ భాగస్వామ్యంతో ఏర్పాటైన లాభాపేక్షలేని సంస్థ. ఇది జీమ్యాట్, ఎన్‌మ్యాట్‌లను నిర్వహిస్తోంది. ఎన్‌మ్యాట్‌ ద్వారా భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్, నైజీరియా వంటి దేశాల్లో ఎంబీఏ లేదా ఇతర మేనేజ్‌మెంట్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు దక్కించుకోవచ్చు.

ఏటా మూడుసార్లు..
సంవత్సరంలో ఎన్‌మ్యాట్‌కు మూడుసార్లు హాజరవ్వొచ్చు. ప్రతి అటెంప్ట్‌కు కనీసం 15 రోజుల వ్యత్యాసం తప్పనిసరి. తద్వారా అభ్యర్థులు అత్యుత్తమ ప్రదర్శనను కనబరచొచ్చు. పరీక్షకు సంబంధించి విద్యార్థులు తమకు నచ్చిన తేదీ, టెస్టు సెంటర్లను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే పరీక్షలో సమా ధానాలు గుర్తించే క్రమంలో నచ్చిన విభాగాన్ని ఎంచుకునే వెసులుబాటు కూడా ఉంది. పరీక్ష పరంగా నెగిటివ్‌ మార్కుల విధానం లేదు. ఎన్‌మ్యాట్‌ ప్రాక్టీస్‌ మెటీరియల్, గత ప్రశ్నలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు వాటిని సాధన చేయటం లాభిస్తుంది.

స్కోర్‌ కార్డ్‌..
ఎన్‌మ్యాట్‌ పరీక్ష ఫలితాల ఆధారంగా అభ్యర్థులు ఆయా బిజినెస్‌ స్కూల్స్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌మ్యాట్‌కు హాజరైన అభ్యర్థులు తమ స్కోరును అప్పటికప్పుడు వీక్షించొచ్చు. కేవలం 48 గంటల్లోనే స్కోరు కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షలో అన్ని సెక్షన్లకు సమాన వెయిటేజీ ఉంటుంది.

41 ఇన్‌స్టిట్యూట్‌లు..
భారత్‌లో ఎన్‌మ్యాట్‌ స్కోరుకు విస్తృత గుర్తింపు ఉంది. మొత్తం 41పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లు ఎన్‌మ్యాట్‌ స్కోరు ఆధారంగా బిజినెస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వాటిలో కొన్నింటి వివరాలు... 
  1. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ)– బిజినెస్‌ అనలిటిక్స్‌ ప్రోగ్రామ్‌ 
  2. ఎస్‌పీజేఐఎంఆర్‌(పీజీఎం పీడబ్ల్యూ) 
  3. గ్జేవియర్‌ యూనివర్సిటీ
  4. ఎన్‌ఎంఐఎంఎస్‌(డీమ్డ్‌ వర్సిటీ)
  5. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ
  6. బీఎంఎల్‌ ముంజల్‌ యూనివర్సిటీ
  7. విట్‌ యూనివర్సిటీ
  8. జిందాల్‌ గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్‌
  9. అమిటీ యూనివర్సిటీ
  10. కెజె సోమయా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌
  11. ఐఐఎల్‌ఎం యూనివర్సిటీ
  12. మైరా స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌
  13. స్కూల్‌ ఆఫ్‌ పెట్రోలియం మేనేజ్‌మెంట్‌
  14. బెన్నెట్‌ యూనివర్సిటీ
  15. యూనివర్సల్‌ బిజినెస్‌ స్కూల్‌
  16. శివ్‌ నాడర్‌ యూనివర్సిటీ;
  17. ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలు.

    పరీక్ష విధానం..

విభాగం

ప్రశ్నలు

సమయం (నిమిషాలు)

స్కోరు శ్రేణి

లాంగ్వేజ్‌ స్కిల్స్‌

36

28

12–120

క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌

36

52

12–120

లాజికల్‌ రీజనింగ్‌

36

40

12–120

మొత్తం

108

120

36–360


టాపిక్స్‌..
  • లాంగ్వేజ్‌ స్కిల్స్‌లో.. రీడింగ్‌ కాంప్రహెన్షన్, పారా ఫ్రేమింగ్, ఎర్రర్‌ ఐడెంటిఫికేషన్‌ ప్రిపోజిషన్స్, సెంటెన్స్‌ కంప్లీషన్, అనాలజీస్‌ అంశాలుంటాయి.
  • లాజికల్‌ రీజనింగ్‌లో.. క్రిటికల్‌ రీజనింగ్, అనలిటికల్‌ పజిల్స్, డిడక్షన్స్, అదర్‌ రీజనింగ్‌ టాపిక్స్‌ నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.
  • క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌లో.. నంబర్‌ ప్రాపర్టీస్, అర్థమెటిక్, ఆల్‌జీబ్రా అండ్‌ ప్రాబబిలిటీ, డీఐ కేస్‌లెట్స్‌ అండ్‌ టేబుల్స్, డీఐ గ్రాఫిక్స్‌ అండ్‌ ఛార్ట్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యసమాచారం..
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తులకు చివరితేదీ: జూన్‌ 30, 2021
  • 2020 జూలై 1–జూన్‌ 30, 2021 మధ్య 3 అటెంప్ట్‌లను పూర్తి చేయని వారు జూన్‌ 30లోగా ఎన్‌మ్యాట్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nmat.org
 
Published date : 03 Apr 2021 02:01PM

Photo Stories