Skip to main content

విదేశాల్లో ఎంబీఏ ప్రవేశం ఇలా.. టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఇవే...

అమెరికన్‌ బిజినెస్‌ స్కూల్స్‌లో ఎంబీఏలో ప్రవేశించాలంటే.. బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు కనీసం రెండు నుంచి మూడేళ్ల పని అనుభవం, పర్సనల్‌ స్టేట్‌మెంట్, రెండు ప్రొఫెషనల్‌ రికమెండేషన్‌ లెటర్లు, టోఫెల్‌ స్కోరు(పెన్‌ అండ్‌ పేపర్‌ 550–600 స్కోరు, కంప్యూటర్‌ బేస్డ్‌ 213–250 స్కోరు), జీమ్యాట్‌ స్కోరు 600కు పైగా ఉండాలి.

కొన్ని బిజినెస్‌ స్కూల్స్‌ వర్క్‌ ఎక్స్‌పీరియెన్స్‌ స్థానంలో ఇంటర్న్‌షిప్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

ఎంబీఏ–టాప్‌ వర్సిటీలు..

  • స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ; హార్వర్డ్, కొలంబియా యూనివర్సిటీ; లాంగ్‌ ఐలాండ్‌ యూనివర్సిటీ; రైడర్‌ యూనివర్సిటీ; బెర్కలీ యూనివర్సిటీ; యూనివర్సిటీ ఆఫ్‌ డల్లాస్‌ తదితరాలు.
  • యూరోప్‌లోని ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంబీఏ చేయాలనుకుంటే.. బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు మూడేళ్ల పని అనుభవం, జీమ్యాట్‌/జీఆర్‌ఈ, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, కేంబ్రిడ్జి అడ్వాన్స్‌డ్‌ స్కోర్లు తప్పనిసరి.
  • జాతీయస్థాయిలో ఎంబీఏ ప్రవేశాలకు సంబంధించి కామన్‌ అడ్మిషన్‌ టెస్టు(క్యాట్‌); మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు(మ్యాట్‌); కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌); గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(జీమ్యాట్‌); గ్జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు(గ్జాట్‌), ఐఐఎఫ్‌టీ వంటి ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు ద్వారా సంబంధిత బీస్కూల్స్‌లో అడ్మిషన్‌ దక్కించుకోవచ్చు.
  • రాష్ట్ర యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కళాశాలల్లో ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు తెలుగు రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్లు ఐసెట్‌ను నిర్వహిస్తున్నాయి.

ఇంకా చదవండి: part 3: విదేశాల్లో ఎంబీఏ చదివితే కెరీర్‌ స్కోప్‌ ఇలా..

Published date : 03 Mar 2021 03:34PM

Photo Stories