వచ్చే అకడమిక్ ఇయర్ నుంచే.. ఈ విధానం అమలుకు అవకాశం..?!
Sakshi Education
యూజీసీ ప్రతిపాదించిన నేషనల్ అకడమిక్ క్రెడిట్ బ్యాంకుకు సంబంధించిన ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తేనున్నారు.
వీలైతే వచ్చే విద్యా సంవత్సరం (2020-21) నుంచే ఈ విధానం అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) వచ్చే విద్యా సంవత్సరం నుంచి అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.
అకడమిక్ క్రెడిట్ బ్యాంక్.. ముఖ్యాంశాలు
- విద్యార్థులకు ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అవకాశాలు కల్పించడం. వారికి ఆసక్తి ఉన్న కోర్సులు అభ్యసించే వీలు కల్పించడం.
- మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ద్వారా అన్ని రంగాల్లో రాణించేలా నైపుణ్యాలు అందించడం.
- కొత్త ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలనుకున్న విద్యార్థుల విషయంలో అప్పటి వరకు చదివిన ఇన్‌స్టిట్యూట్‌లలో కనీసం 50శాతం నుంచి 70శాతం క్రెడిట్లు పొందితేనే కొత్త ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధిలోని డిగ్రీ కోర్సుల్లో కొత్త ఇన్‌స్టిట్యూట్‌లో చేరితే ఒక సెమిస్టర్ నుంచి మినహాయింపు లభిస్తుంది.
- గరిష్టంగా ఏడేళ్ల వ్యవధిలో క్రెడిట్ బ్యాంక్‌లోని క్రెడిట్స్‌ను వినియోగించుకునే అవకాశం.
ఇంకా చదవండి: part 9: ఈ విధానంతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉందా..?
Published date : 17 Feb 2021 02:08PM