Skip to main content

వైద్య విద్యలో సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోండి.. చివ‌రి తేది ఇదే..

వైద్య విద్యలో సూపర్‌ స్పెషాలిటీ కోర్సులైన డీఎం, ఎంసీహెచ్, డీఎన్‌బీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ ఎస్‌ఎస్‌(సూపర్‌ స్పెషాలిటీ) నోటిఫికేషన్‌ వెలువడింది.

 నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(ఎన్‌బీఈ).. పరీక్ష నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. ఈ నేపథ్యంలో.. నీట్‌ ఎస్‌ఎస్‌ దరఖాస్తులు, అర్హతలు, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం..

నీట్‌ ఎస్‌ఎస్‌..

నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ సూపర్‌ స్పెషాలిటీ. దీనినే నీట్‌ఎస్‌ఎస్‌ అంటారు. వైద్య విద్యలో సూపర్‌ స్పెషాలిటీ కోర్సులైన డీఎం, ఎంసీహెచ్, డీఎన్‌బీ ల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఏడాదికి ఒకసారి ఈ పరీక్ష జరుగుతుంది. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌బీఈ)..ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను చూస్తుంది. ఎయిమ్స్‌ న్యూఢిల్లీ, జిప్‌మర్‌ పుదుచ్చేరి, పీజీఐఎంఈఆర్‌ చండీగఢ్, నిమ్‌ హాన్స్‌ బెంగళూర్, శ్రీ చిత్రా తిరునల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ, తిరువనంతపురం మినహా దేశంలోని అన్ని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, యూనివర్సిటీలు, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో నీట్‌ ఎస్‌ఎస్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హతలు..

  1.     నీట్‌ ఎస్‌ఎస్‌కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ/ప్రొవిజనల్‌ పాస్‌ సర్టిఫికెట్‌(ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
  2.     సెప్టెంబర్‌ 25, 2020 కంటే ముందు పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

పరీక్ష విధానం..

    నీట్‌ ఎస్‌ఎస్‌ పరీక్షను సీబీటీ(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ మాధ్యమంలో నిర్వహించే ఈ పరీక్ష ప్రశ్న పత్రం రెండు సెక్షన్‌లుగా (పార్ట్‌–ఏ, పార్ట్‌–బీ) ఉంటుంది. మొత్తం వంద మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రశ్నలు పీజీ స్థాయిలో ఉంటాయి. 

సిలబస్‌..

  1.     వంద మార్కులకు జరిగే పరీక్షలో పార్ట్‌–ఏ 40 శాతం, పార్ట్‌–బీకి 60 శాతం వెయిటేజ్‌ ఉంటుంది.
  2.     నీట్‌ ఎస్‌ఎస్‌ పరీక్షల్లో పార్ట్‌–ఏ, బీలల్లో 40 శాతం ప్రశ్నలు ఫీడర్‌ బోర్డ్‌ సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల నుంచి అడుగుతారు. అలాగే 60 శాతం ప్రశ్నలు దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సూపర్‌ స్పెషాలిట కోర్సుల నుంచి అడుగుతారు. 
  3.     పార్ట్‌–బీకి సంబంధించి పీజీ స్థాయిలో సంబం«ధిత విభాగాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. క్లినికల్‌ ప్రాక్టీస్, బేసిక్‌ సైన్స్‌ల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

నెగిటివ్‌ మార్కులు..

  1. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు కేటాయిస్తారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి ఒక్క మార్కు చొప్పున కోత విధిస్తారు.

పరీక్ష ఫీజు..

  1.     నీట్‌ ఎస్‌ఎస్‌ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు (అన్ని కేటగిరీల వారు ) రూ.4,425( రూ.3,750 ఫీజు+ రూ.675 జీఎస్టీ) పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం..

  1.     దరఖాస్తు: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
  2.     ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.08.202
  3.     అడ్మిట్‌ కార్డ్‌: 07 సెప్టెంబర్‌ 2020
  4.     పరీక్ష తేదీ: 15 సెప్టెంబర్‌ 2020
  5.     ఫలితాలు: 25 సెప్టెంబర్‌ 2020
  6.     కౌన్సెలింగ్‌: అక్టోబర్‌ చివరి వారంలో
  7.     పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: nbe.edu.in
Published date : 18 Aug 2020 07:22PM

Photo Stories