Skip to main content

టిస్ బాట్-2020కు దరఖాస్తులు

ఆర్ట్స్ కోర్సుల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోంది.. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆప్ సోషల్ సైన్స్(టిస్). ఇలాంటి విద్యా సంస్థల్లో కోర్సులుపూర్తిచేసుకుంటే.. ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుంది. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్.. బ్యాచిలర్స్ అడ్మిషన్ టెస్ట్ (టిస్ బాట్)-20 20 నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో.. సమగ్ర సమాచారం...
టీస్ :
టాటా గ్రాడ్యుయేట్ స్కూల్‌గా 1936లో ప్రారంభమైన ఈ సంస్థ... 1944లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్‌సైన్స్ (టిస్)గా మారింది. అంచెలంచెలుగా ఎదుగుతూ.. 1964 లో డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందింది. ప్రస్తుతం సోషల్‌సైన్స్ కోర్సులను అందించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. ప్రతి ఏటా జాతీయ స్థాయిలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్.. బ్యాచిలర్స్ అడ్మిషన్ టెస్ట్ (టిస్ బాట్) నిర్వహించి.. బీఏ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తోంది.

కోర్సు ఉద్దేశం :
పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కోర్సులను రూపకల్పన చేశారు. సమాజంలోని సమస్యలను అధ్యయనం చేసి.. పరిష్కారాలను చూపేలా శిక్షణ ఇచ్చే కోర్సులు ఇవి. టిస్ ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఈ కోర్సును అందిస్తుంది. అందుకోసమే దేశవ్యాప్తంగా టిస్ అందించే బీఏ కోర్సుకు మంచి ఆదరణ ఉంది.

బీఏ సోషల్ సెన్సైస్ :
  • టిస్ అందిస్తున్న బీఏ సోషల్ సెన్సైస్ ప్రత్యేకంగా రూపొందించిన లిబరల్ ఆర్ట్స్ ప్రోగ్రామ్. ఇందులో ముఖ్యంగా సోషియాలజీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, సైకాలజీ సబ్జెక్టులపై ప్రాథమిక అవగాహన కల్పిస్తుంది. ఎన్విరాన్‌మెంట్, డెవలప్‌మెంట్ వివిధ సమస్యలపై కోర్సులో భాగంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బీఏ సోషల్ సెన్సైస్ పూర్తి చేసిన విద్యార్థులు ఆయా సబ్జెక్టులపై సమగ్ర అవగాహన లభించడం ఖాయం. ఈ కోర్సును టిస్ తుల్జాపూర్ క్యాంపస్, టిస్ గువహతి క్యాంపస్‌ల్లో అందిస్తోంది.

అర్హతలు..
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసుండాలి. చివరి సంవత్సరం చదివే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • 2020 మే నాటికి 23 ఏళ్లు లోపు వారు మాత్రమే అర్హులు.

పరీక్ష విధానం :
టిస్ ముంబై దేశవ్యాప్తంగా టిస్‌బాట్ పరీక్ష నిర్వహిస్తుంది. పరీక్ష విధానం పూర్తిగా ఆన్‌లైన్(సీబీటీ) విధానంలో రెండు పార్టులుగా ఉంటుంది. మొత్తం 90 నిమిషాల సమయం పరీక్షకు కేటాయిస్తారు. పార్ట్-1లో కరెంట్ అఫైర్స్, సోషల్ అవెర్‌నెస్, లాజికల్ అనలిటికల్, రీజనింగ్ సబ్జెక్టుల నుంచి మొత్తం 100 ప్రశ్నలకుగాను 60 మార్కులు, 60 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. అలాగే పార్ట్-2 పరీక్షలో సబ్జెక్ట్ అనుబంధంగా ఉండే ఎస్సే ప్రశ్నలను అడుగుతారు. దీనికి 40 మార్కులకుగాను 30 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు.

ఎంపిక ప్రక్రియ :
టిస్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిచేసి.. ప్రవేశం కల్పిస్తారు.

పరీక్ష ఫీజు :
టిస్ దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ అభ్యర్థుల రూ.1025, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 ఫీజుగా చెల్లించాలి.

ముఖ్యమైన సమాచారం :
దరఖాస్తు:
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుల ప్రారంభ తేదీ: డిసెంబర్ 5, 2019
దరఖాస్తుల ముగింపు తేదీ: మార్చి 23, 2020
అడ్మిట్ కార్డు: 11.04.2020
పరీక్ష తేదీ: 25.04.2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.tiss.edu
Published date : 07 Dec 2019 12:52PM

Photo Stories