Skip to main content

టీఎస్ మోడల్‌స్కూల్స్‌లో ప్రవేశాల‌కు దరఖాస్తు విధానం, అర్హతలు, ఎంపిక ప్రక్రియ ఇలా..

తెలంగాణలో వెనుకబడిన మండలాల విద్యార్థుల కోసం ఉత్తమ ఉపాధ్యాయులు, అధునాతన సౌకర్యాలతో పాఠశాల విద్యను అందించేందుకు మోడల్ స్కూల్స్‌కు శ్రీకారం చుట్టారు.
తాజాగా రాష్ట్రంలో 194 వెనుకబడిన మండలాల్లో ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్స్‌లో ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో..బాలబాలికలకు ఉపయోగపడేలా తెలంగాణ మోడల్‌స్కూల్స్ దరఖాస్తు విధానం, అర్హతలు, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం...

సీట్లు:
ప్రతి తరగతిలో 100 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఆరో తరగతిలో రెండు సెక్షన్లు ఉంటాయి. ఏడు నుంచి పదోతరగతి వరకు ఖాళీల ఆధారంగా లేటర్ ఎంట్రీకి అవకాశం ఉంది. ప్రవేశానికి సంబంధించి అన్ని తరగతులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

వయసు:
6వ తరగతి- ఆగస్టు 31 నాటికి పదేళ్లు నిండి ఉండాలి. 7వ తరగతి- ఆగస్టు 31 నాటికి పదకొండేళ్లు నిండి ఉండాలి. 8వ తరగతి- ఆగస్టు 31 నాటికి పన్నెండేళ్లు నిండి ఉండాలి. 9వ తరగతి- ఆగస్టు 31 నాటికి పదమూడేళ్లు నిండి ఉండాలి. 10వ తరగతి- ఆగస్టు 31 నాటికి పద్నాలుగేళ్లు నిండి ఉండాలి.

రిజర్వేషన్లు:
ప్రతి తరగతిలో సీట్లలో 15 శాతాన్ని ఎస్సీలకు, 6 శాతాన్ని ఎస్టీలకు, 29 శాతాన్ని బీసీలకు రిజర్వ్ చేశారు. మొత్తంగా 33.33 శాతం సీట్లను బాలికలకు కేటాయిస్తారు.

పరీక్ష విధానం :
ఆరోతరగతి
:
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
తెలుగు 25 25
మ్యాథ్స్ 25 25
సైన్స్,సోషల్(ఈవీఎస్) 25 25
ఇంగ్లిష్ 25 25
మొత్తం 100 100
  • ప్రశ్నపత్రం ఐదోతరగతి సిలబస్‌పై ఉంటుంది. పేపర్‌ను మల్టిపుల్ చాయిస్ విధానంలో రూపొందిస్తారు. -మ్యాథ్స్, ఈవీఎస్ విభాగాలు తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటాయి.
7-10వ తరగతులు :
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
ఇంగ్లిష్ 25 25
మ్యాథ్స్ 25 25
జనరల్ సైన్స్ 25 25
సోషల్ స్టడీస్ 25 25
మొత్తం 100 100
  • ఇంగ్లిష్ మినహా మిగిలిన అన్ని విభాగాలు తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటాయి.
మోడల్ స్కూల్స్ ప్రత్యేకతలు :
  • విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయరు.
  • ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన.
  • మోడల్ స్కూల్స్‌ను పక్కా భవనాల్లో ఏర్పాటు చేశారు.
  • విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాల పంపిణీ
  • ఆరు నుంచి పదోతరగతి వరకు మధ్యాహ్న భోజనం పథకం వర్తింపు.
  • విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం అందిస్తారు.
  • బాలికలకు హాస్టల్ వసతి(వంద మంది వరకు).
  • సైన్స్, కంప్యూటర్, లైబ్రరీ వసతి.
  • విద్యార్థులకు డిజిటల్ తరగతులు.
  • ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సివిల్స్‌కు ఉచిత కోచింగ్.
ముఖ్య సమాచారం :
దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరితేదీ: 6వ తరగతి: ఫిబ్రవరి 29,
7-10వ తరగతులు: మార్చి 2 .
హాల్‌టిక్కెట్ల జారీ: ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం
పరీక్ష తేదీ: ఏప్రిల్ 12, 2020 (ఆరోతరగతి-ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; 7-10వ తరగతులు- మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
ఫలితాల వెల్లడి: మే 20, 2020
ఎంపిక జాబితా ప్రకటన: మే 27,2020
సర్టిఫికేట్ వెరిఫికేషన్, ప్రవేశాలు: మే 28-31
పరీక్ష ఫీజు: ఎస్సీ,ఎస్టీ, ఎస్టీ విద్యార్థులకు రూ.75, ఇతరులకు రూ.150.

వెనుకబడిన ప్రాంతాలకు వరం..
తెలంగాణ మోడల్ స్కూల్స్‌ను వెనుకబడిన ప్రాంతాలకు వరంగా చెప్పాలి. మోడల్ స్కూల్స్ ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదోతరగతి ఫలితాలు వెలువడిన తర్వాత ఇంటర్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. మోడల్ స్కూల్స్‌లో బోధనంతా ఇంగ్లిష్ మీడియంలోనే సాగుతుంది. ప్రస్తుతం 194 మోడల్ స్కూల్స్‌లో ఆరోతరగతికి సంబంధించి 19,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన తరగతుల్లో ఖాళీల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాము. మోడల్ స్కూల్స్‌లో ఎలాంటి ఫీజు లేకుండా అత్యుత్తమ బోధన అందిస్తున్నాము. పోటీ పరీక్షలకు సైతం శిక్షణ ఇస్తున్నాము. కాబట్టి విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
                                     - ఎ. సత్యనారాయణరెడ్డి, ప్రాజెక్టు డెరైక్టర్, టీఎస్ మోడల్ స్కూల్స్
Published date : 22 Feb 2020 02:19PM

Photo Stories