Skip to main content

టీఎస్ ఎంసెట్- 2020 దరఖాస్తుకు ఇవి తప్పనిసరి...

తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇంటర్మీడియెట్ తర్వాత అత్యధిక మంది విద్యార్థులు రాసే పరీక్ష కూడా ఇదేకావడం విశేషం.
 టీఎస్ ఎంసెట్-2020 పరీక్షల నిర్వహణకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌తోపాటు మెడికల్ సంబంధిత కోర్సులు, అగ్రికల్చరల్, ఫార్మా కళాశాలల్లో ప్రవేశాలకు సైతం వీలు కల్పించే టీఎస్ ఎంసెట్-2020పై ప్రత్యేక కథనం...

జేఎన్‌టీయూహెచ్ నిర్వహణ:
ఈ ఏడాది టీఎస్ ఎంసెట్-2020 నిర్వహణను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (హైదరాబాద్) చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ అత్యధిక పర్యాయాలు జేఎన్‌టీయూహెచ్ ఆధ్వర్యంలోనే ఎంసెట్ జరిగింది. మరోసారి ఎంసెట్ నిర్వహణ బాధ్యతను జేఎన్‌టీయూహెచ్ చేపట్టనుంది. సెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్ రిజిస్టర్‌ ప్రొఫెసర్ గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు. ఎంసెట్ పరీక్షను 2018 నుంచి ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే విధానం కొనసాగనుంది.

ప్రవేశాలు కల్పించే కోర్సులు :
బీఈ, బీటెక్/బీటెక్ బయోటెక్నాలజీ/బీటెక్ డెయిరీ టెక్నాలజీ/బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్/బీఫార్మసీ/బీటెక్ ఫుడ్ టెక్నాలజీ/బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్/బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్/ బీఎస్సీ ఫారెస్ట్రీ/బీవీఎస్సీ అండ్ ఏహెచ్/బీఎఫ్‌ఎస్సీ.

విద్యార్హతలు :
  • టీఎస్ ఎంసెట్-2020కు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్మీడియెట్/10+2 ఉత్తీర్ణత లేదా రెండో ఏడాది పరీక్షలు రాయనున్న విద్యార్థులు అర్హులు.
  • బీఈ/బీటెక్; బీటెక్ బయోటెక్నాలజీ; బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఫార్మసీలో 50 శాతం సీట్లకు అర్హతలు: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సుల్లో ప్రధానంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయాలజీ సబ్జెక్టులు చదివి ఉండాలి. వీటికి సమానమైన వొకేషనల్ కోర్సులతోపాటు బ్రిడ్జి కోర్సు చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసినవారు, చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
  • బీఫార్మసీ మినహా మిగతా కోర్సులకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్(ఎంపీసీ)లో 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 40 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
  • బీఫార్మసీలో మిగతా 50 శాతం సీట్లకు బైపీసీ అభ్యర్థులు అర్హులు.
  • ఫార్మా డీ కోర్సులో 50 శాతం సీట్లు ఎంపీసీ అభ్యర్థులతో, మరో 50 శాతం సీట్లు బైపీసీ అభ్యర్థులతో భర్తీ చేస్తారు. టీఎస్ ఎంసెట్-2020కు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్మీడియెట్/10+2 ఉత్తీర్ణత లేదా రెండో ఏడాది పరీక్షలు రాయనున్న విద్యార్థులు అర్హులు.
  • బీఈ/బీటెక్; బీటెక్ బయోటెక్నాలజీ; బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఫార్మసీలో 50 శాతం సీట్లకు అర్హతలు: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సుల్లో ప్రధానంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయాలజీ సబ్జెక్టులు చదివి ఉండాలి. వీటికి సమానమైన వొకేషనల్ కోర్సులతోపాటు బ్రిడ్జి కోర్సు చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసినవారు, చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
  • బీఫార్మసీ మినహా మిగతా కోర్సులకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్(ఎంపీసీ)లో 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 40 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
  • బీఫార్మసీలో మిగతా 50 శాతం సీట్లకు బైపీసీ అభ్యర్థులు అర్హులు.
  • ఫార్మా డీ కోర్సులో 50 శాతం సీట్లు ఎంపీసీ అభ్యర్థులతో, మరో 50 శాతం సీట్లు బైపీసీ అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
అగ్రికల్చరల్/మెడికల్ విభాగం అర్హతలు :
బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చరల్, బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చరల్: ఫిజికల్‌సైన్స్‌, బయలాజికల్ సైన్స్‌ /నేచురల్ సైన్స్‌, అగ్రికల్చరల్, వొకేషనల్ ఇన్ అగ్రికల్చరల్ సబ్జెక్టులో ఏవైనా రెండు/మూడు సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాలి.
బీఎస్సీ ఫారెస్ట్రీ: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీల్లో ఏవైనా రెండు/మూడు సబ్జెక్టులు చదవాలి.
బీవీఎస్సీ: ఫిజికల్ సైన్స్‌, బయలాజికల్ సైన్స్ లేదా నేచురల్ సైన్స్‌లో ఏవైనా రెండు/మూడు సబ్జెక్టులు చదవాలి.
బీఎఫ్‌ఎస్సీ: ఫిజికల్ సైన్స్‌, బయలాజికల్ సైన్స్‌/ నేచురల్ సైన్స్‌, ఫిషరీ సైన్స్‌లో ఒకేషనల్ కోర్సు.. వీటిల్లో ఏవైనా రెండు/మూడు సబ్జెక్టులు చదివి ఉండాలి.
బీటెక్ ఫుడ్ టెక్నాలజీ: మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్‌ లేదా బయలాజికల్ సైన్స్/నేచురల్ సైన్స్‌లో ఏవైనా రెండు/మూడు సబ్జెక్టులు చదవాలి.
బీటెక్ బయోటెక్నాలజీ: ఇంటర్‌లో బైపీసీతోపాటు బ్రిడ్జి కోర్సులో మ్యాథ్స్ ఉత్తీర్ణులు అర్హులు.

వయోపరిమితి:
  • ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 2020 డిసెంబర్ 31 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధనలేదు.
  • బీటెక్ డెరుురీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థులకు 2020 డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు పూర్తవ్వాలి. గరిష్టంగా 22 ఏళ్ల వయసు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించరాదు. ఫార్మా-డి కోర్సుకు 17 ఏళ్లు పూర్తరుు ఉండాలి.

పరీక్ష విధానం :
టీఎస్ ఎంసెట్‌ను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే(కంప్యూటర్ బేస్ట్ టెస్ట్) నిర్వహిస్తారు.పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 160 ప్రశ్నలు-160 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష జరుగుతుంది.. ఇందులో 80 ప్రశ్నలు మ్యాథ్స్, 40 ఫిజిక్స్, మరో 40 కెమిస్ట్రీ నుంచి ఇస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్/తెలుగు లేదా ఇంగ్లిష్/ ఉర్దూలో ఉంటుంది.
  • అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో.. మొత్తం 160 ప్రశ్నలు-160 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఇందులో 80 ప్రశ్నలు బయాలజీ (బోటనీ 40, జువాలజీ 40), ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 40 ప్రశ్నల చొప్పున అడుగుతారు.

ర్యాంకు ఇలా..
  • ఎంసెట్ ర్యాంక్‌తోపాటు ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ కేటాయించి తుది ర్యాంక్ ప్రకటిస్తారు. ఇందులో ఎంసెట్‌కు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌లో గ్రూప్ సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెరుుటేజీ లభిస్తుంది.
  • ఎంసెట్ మొత్తం మార్కుల్లో కనీసం 25 శాతం సాధిస్తేనే అర్హులుగా పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కుల నిబంధన లేదు.
 
పరీక్షా జోన్లు ఎక్కడెక్కడ..?
 తెలంగాణ: హైదరాబాద్‌లో ఐదు జోన్లు, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.
 ఆంధ్రప్రదేశ్: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలులో కేంద్రాలు ఉన్నారుు.
 
 పరీక్షల షెడ్యూల్ ఇలా..
 ఇంజనీరింగ్ విభాగం: మే 04, 05, 07 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు; మధ్యాహ్నం 3 నుంచి 6 గంటలకు వరకు.. రెండు షిప్ట్‌ల్లో పరీక్ష నిర్వహిస్తారు.
 అగ్రికల్చరల్, మెడికల్ విభాగం: మే 09, 11 తేదీల్లో ఉదయం 10 నుంచి 1 గంట వరకు; మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటలకు వరకు పరీక్ష జరుగుతుంది.
 
 ముఖ్య సమాచారం :
 దరఖాస్తు విధానం
: ఆన్‌లైన్‌లో 
 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.03.2020  (ఆలస్య రుసుం లేకుండా)
 ఏప్రిల్ 6: ఆలస్య రుసుం రూ.500 తో దరఖాస్తుకు అవకాశం ఉంది,
 ఏప్రిల్ 13 వరకూ: ఆలస్య రుసుం రూ.1000 తో దరఖాస్తు చేసుకోవచ్చు.
 ఏప్రిల్ 20 వరకూ: 5వేల ఆలస్య రుసుంతో దరఖాస్తుకు వీలుంది.
 ఏప్రిల్ 27 వరకూ: పదివేల ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చు.
 హాల్‌టికెట్లు: ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
 దరఖాస్తు ఫీజు :
 ఇంజనీరింగ్: ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.400, ఇతరులకు రూ.800.
 అగ్రికల్చరల్, మెడికల్: ఎస్సీ, ఎస్సీ, పీహెచ్‌సీలకు రూ.400, ఇతరులకు రూ.800.
 గమనిక: రెండు పరీక్షలు రాయాలనుకునే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలు రూ.800, ఇతరులు రూ.1600 చెల్లించాలి.
 ఆన్‌లైన్ దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దుకునే అవకాశం: మార్చి 31 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు
 
 ●  అర్హతగల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజును తెలంగాణలోని టీఎస్ ఆన్‌లైన్ సెంటర్లు, ఏపీలోని ఏపీ ఆన్‌లైన్ సెంటర్లలో క్రెడిట్, డెబిట్ కార్డులతోపాటు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
 
 దరఖాస్తు సమయంలో సిద్ధంగా ఉంచుకోవాల్సినవి..
 ఇంటర్/10+2 పరీక్షల హాల్‌టికెట్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, పదో తరగతి హాల్‌టికెట్ నెంబర్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం తదితర సమాచారం దరఖాస్తు సమయంలో సిద్ధంగా ఉంచుకోవాలి.
 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://eamcet.tsche.ac.in
Published date : 27 Feb 2020 04:03PM

Photo Stories