తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకంగా లా ఎంట్రన్స్ టెస్ట్.. వివరాలు ఇవే..
మూడేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సుల్లో లాసెట్ ర్యాంక్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. అదేవిధంగా ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన అభ్యర్థులు పీజీ చేయడానికి పీజీ లాసెట్ నిర్వహిస్తారు. లాసెట్ ద్వారా ఇంటర్ అర్హతతో ఐదేళ్ల లా కోర్సుకు, డిగ్రీ అర్హతతో మూడేళ్ల లా కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు..
ఐదేళ్ల లా కోర్సుకు 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్(10+2 విధానం) (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40 శాతం మార్కులు సరిపోతారుు) ఉత్తీర్ణులై ఉండాలి. మూడేళ్ల లా కోర్సుకు ఏదైనా డిగ్రీని(10+2+3 విధానం) 45 శాతం మార్కులతో పూర్తి చేయాలి. ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన వారు పీజీ లాసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం..
లాసెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. గంటన్నర వ్యవధిలో జరిగే పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటారుు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. మూడు విభాగాలుండే ప్రశ్నపత్రంలో.. పార్ట్-ఎలో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీపై 30 ప్రశ్నలు.. పార్ట్-బిలో కరెంట్ అఫైర్స్‌పై 30 ప్రశ్నలు, పార్ట్-సిలో ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లాపై 60 ప్రశ్నలుంటారుు. పీజీ లాసెట్‌ను 120 ప్రశ్నలతో నిర్వహిస్తారు. ఇందులో పూర్తిగా లా సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు అడుగుతారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.tsche.ac.in , http://apsche.org/new/
ఇంకా చదవండి: part 4: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ లా ఎంట్రన్స్ కోసం ఏఎంయూ బీఏ ఎల్‌ఎల్‌బీ..