స్వదేశీ సాంకేతిక ముద్ర.. ఇంప్రింట్
Sakshi Education
- ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో పరిశోధనలకు ప్రోత్సాహం
ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో పరిశోధనల ద్వారా నూతన ఆవిష్కరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంప్రింట్ ఇండియా పథకానికి శ్రీకారం చుట్టింది. ఇది దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల సంయుక్త పరిశోధన ప్రోత్సాహక పాజెక్టుగా చెప్పవచ్చు. 2015లో ప్రారంభమై విజయవంతంగా అమలవుతున్న ఇంప్రింట్ ఇండియా స్కీమ్.. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే క్రమంలో తాజాగా ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ ఏడాది ఇంప్రింట్ 2 పేరుతో ముఖ్యమైన 20 ప్రత్యేక టెక్నాలజీ థీమ్స్‌లకు సంబంధించి ప్రాజెక్టు ప్రతిపాదనలను ఆన్‌లైన్లో స్వీకరిస్తోంది. ఈ ఇంప్రింట్-2ను ఇంప్రింట్-2 సి (సొసైటల్ మిషన్ ప్రాజెక్టు)గా పిలుస్తున్నారు.
ఇంప్రింట్ లక్ష్యం
https://serbonline.in
https://imprintindia.org
- ఎంహెచ్‌ఆర్‌డీ, ఐఐటీలు, ఐఐఎస్సీల సంయుక్త నిర్వహణ
- కీలకమైన పది విభాగాల్లో పరిశోధన ప్రతిపాదనలకు ఆహ్వానం
- ఇంప్రింట్-2కు కొత్త ప్రతిపాదనలు స్వీకరణ
ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో పరిశోధనల ద్వారా నూతన ఆవిష్కరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంప్రింట్ ఇండియా పథకానికి శ్రీకారం చుట్టింది. ఇది దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల సంయుక్త పరిశోధన ప్రోత్సాహక పాజెక్టుగా చెప్పవచ్చు. 2015లో ప్రారంభమై విజయవంతంగా అమలవుతున్న ఇంప్రింట్ ఇండియా స్కీమ్.. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే క్రమంలో తాజాగా ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ ఏడాది ఇంప్రింట్ 2 పేరుతో ముఖ్యమైన 20 ప్రత్యేక టెక్నాలజీ థీమ్స్‌లకు సంబంధించి ప్రాజెక్టు ప్రతిపాదనలను ఆన్‌లైన్లో స్వీకరిస్తోంది. ఈ ఇంప్రింట్-2ను ఇంప్రింట్-2 సి (సొసైటల్ మిషన్ ప్రాజెక్టు)గా పిలుస్తున్నారు.
ఇంప్రింట్ లక్ష్యం
- దేశంలో సామాజికంగా సవాలుగా మారిన, తక్షణ పరిష్కారం అవసరమైన సమస్యలను గుర్తించడం, ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయిలోనే పరిశోధనలు నిర్వహించి పరిష్కార మార్గాలను ఆవిష్కరించడం ఇంప్రింట్- ఇండియా ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం పరిశోధనల పరంగా పేరు గడించిన ఐఐటీలు, ఐఐఎస్సీ ద్వారా ఇంప్రింట్ లక్ష్యాలను అందుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ క్లైమేట్ చేంజ్, హెల్త్‌కేర్, ఐసీటీ(ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ), మాన్యుఫ్యాక్చరింగ్, నానో టెక్నాలజీ, హార్డ్‌వేర్, సెక్యూరిటీ అండ్ డిఫెన్స్, సస్టెయినబుల్ హాబిటెట్స్, వాటర్ రిసోర్సెస్ అండ్ రివర్ సిస్టమ్స్.. అనే పది డొమైన్లల్లో అత్యున్నత పరిశోధనలు చేయడమే లక్ష్యంగా ఇంప్రింట్ పనిచేస్తుంది.
- ప్రస్తుతం ఇంప్రింట్-2లో భాగంగా కొత్త పరిశోధన ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. ఈ పథకం ప్రారంభం అయినప్పటి నుంచి 2612 ప్రతిపాదనలు రాగా... 259 ప్రతిపాదనలకు అత్యున్నత స్థాయి కమిటీ ఆమోదం లభించింది. వీటిలో 142 ప్రాజెక్టులకు ఇప్పటికే నిధులు సైతం విడుదల చేయడం జరిగింది.
- ఎంపికైన ప్రాజెక్టులకు ఆర్థిక వనరులను ప్రభుత్వమే అందజేస్తుంది. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన అత్యున్నత మౌలిక వసతులు కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు ఐఐటీలు, ఐఐఎస్సీలు కోఆర్డినేటింగ్ ఇన్‌స్టిట్యూట్‌లుగా వ్యవహరిస్తున్నాయి. మున్ముందు అన్ని యూనివర్సిటీలకు ఈ పథకాన్ని వర్తింపజేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రాజెక్టుకు అవసరం అయిన మొత్తాన్ని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ సంబంధిత డొమైన్ మంత్రిత్వ శాఖ/డిపార్డ్‌మెంట్/కౌన్సిల్ సహాయంతో సమకూరుస్తుంది. ఇప్పటివరకు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి సుమారు రూ.313 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చించింది.
- రీసెర్చ్ ప్రతిపాదనలను ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ద్వారా అందజేయాలి. ఆయన కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన నిపుణుడై ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో, ఎంహెచ్‌ఆర్‌డీ నిధులిస్తున్న కేంద్రీయ యూనివర్సిటీలు, ఎంహెచ్‌ఆర్‌డీ ఫండ్ చేస్తున్న ఉన్నత విద్యాసంస్థలు, ఇంజనీరింగ్, టెక్నాలజీలో ఆర్ అండ్ డీ కోర్సులు చేస్తున్న రెగ్యులర్ అకడమిక్స్/రీసెర్చ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ మెంబర్, సైంటిస్టులు, సైంటిఫిక్ ఆఫీసర్లు www.serbonline.in వెబ్‌సైట్ ద్వారా ప్రతిపాదనలు పంపించవచ్చు. పదవీ విరమణకు కనీసం నాలుగేళ్ల సమయం ఉండటం తప్పనిసరి.
- అభ్యర్థులు పంపిన ప్రతిపాదనలను వివిధ దశల్లో పరిశీలిస్తారు. అకడమిక్, ఇండస్ట్రీ, పరిశోధన, డెవలప్‌మెంట్ సంస్థలకు చెందిన నిపుణుల బృందంతో నేషనల్ పీర్స్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ స్క్రీనింగ్, రివ్యూయింగ్, మానిటరింగ్ చేస్తుంది. ఎంపికైన ప్రాజెక్టుకు రూ.3 నుంచి రూ.4 కోట్లు ఇస్తారు. ప్రాజెక్ట్ ప్రారంభం అయిన తర్వాత ప్రోగ్రామ్ అడ్వైజరీ కమిటీ, స్టీరింగ్ కమిటీ, అపెక్స్ కమిటీల పర్యవేక్షణ ఉంటుంది. ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు జాతీయ స్థాయి సబ్జెక్టు నిపుణులు సమీక్షిస్తారు. వీరు ప్రాజెక్టు ఏజెన్సీలు, మంత్రిత్వశాఖలకు చెందిన సీనియర్ ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, డొమైన్ ఎక్స్‌పర్ట్స్ కమిటీ (డీఈసీ)లతో సంప్రదిస్తారు.
https://serbonline.in
https://imprintindia.org
Published date : 18 Jan 2019 12:32PM