సర్టిఫైడ్ యాక్చువరీస్’గా గుర్తింపు పొందేందుకు.. మూడు స్థాయిల్లో పరీక్షలు..
సర్టిఫైడ్ యాక్చువరీస్’గా గుర్తింపు పొందాలంటే.. ముందుగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ)నిర్వహించే ఏసెట్’లో అర్హత సాధించాలి. ఆ తర్వాత అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్ నిర్ణరుుంచిన మూడు స్థాయిల పరీక్షల్లో క్వాలిఫై అవ్వాలి. ఐఏఐ అందించే యాక్చురియల్ సైన్‌స కోర్సుల్లో 1. కోర్ టెక్నిల్ స్టేజ్(సీటీ), 2. స్పెషలిస్ట్ టెక్నికల్ స్టేజ్(ఎస్‌టీ), 3. స్పెషలిస్ట్ అప్లికేషన్ స్టేజ్ (ఎస్‌ఏ) ఉంటాయి. ఒక్కో స్టేజ్‌లో ఆరు నుంచి తొమ్మిది పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంటుంది. "ఏసెట్" లో అర్హత సాధించిన తర్వాత అభ్యర్థులు అడ్మిట్ కార్డు పొంది.. ఆయా కోర్సులు చేయవచ్చు. ప్రతి పరీక్షకు ప్రత్యేకంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో ఫైనాన్షియల్ రిపోర్టింగ్, యాక్చూరియల్ రిస్క్ మేనేజ్‌మెంట్, హెల్త్ అండ్ కేర్ ఇన్సూరెన్‌స, జనరల్ ఇన్సూరెన్స్ అండ్ ప్రైసింగ్ వంటి పరీక్షలు వేటికవే మూడు స్టేజీల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
ముఖ్య సమాచారం..
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేది: 27.02.2021
- ఎంట్రెన్స్ టెస్ట్ తేది: 27.03.2021
- ఫలితాల వెల్లడి: 03.04.2021
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : www.actuariesindia.org
ఇంకా చదవండి: part 1: బీమా రంగంలో ఖచ్చితమైన కొలువుకు ఉపయోగపడే ఏసెట్ మార్చి-2021 నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ ఇలా..