Skip to main content

సరళీకృతంగా ఉన్న ఎడ్యుకేషన్‌ లోన్‌ తిరిగి చెల్లింపు ఇలా..

విద్యా రుణం తిరిగి చెల్లించే విషయంలో బ్యాంకులు ఇటీవల కొంత సరళీకృత విధానాలు అనుసరిస్తున్నాయి.

రీపేమంట్‌ హాలిడే పేరుతో కోర్సు పూర్తయిన తర్వాత సంవత్సరం నుంచి లేదా కోర్సు పూర్తయి ఉద్యోగం లభించినప్పటి నుంచి వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇలా గరిష్టంగా 15 సంవత్సరాల వ్యవధిలో ఈఎంఐ విధానంలో రుణం మొత్తం చెల్లించొచ్చు.

  • రుణ తిరిగి చెల్లింపు పరంగా స్టార్టప్‌ ఔత్సాహిక విద్యార్థులకు ప్రత్యేక వెసులుబాటు లభిస్తోంది. దీని ప్రకారం–స్టార్టప్‌ ఏర్పాటు చేసిన విద్యార్థులు.. కోర్సు పూర్తయ్యాక రెండేళ్ల తర్వాత నుంచి రుణం తిరిగి చెల్లించొచ్చు.
  • ఉన్నత విద్యనభ్యసించే మహిళా విద్యార్థులను ప్రోత్సహించే దిశగా బ్యాంకులు విద్యారుణాల వడ్డీ రేట్లలో 0.5 శాతం నుంచి ఒక శాతం వరకు రాయితీ ఇస్తున్నాయి.

టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరితే..
ప్రస్తుతం ఐబీఏ మార్గనిర్దేశకాల ప్రకారం–విద్యార్థులు ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందితే.. గరిష్ట రుణ మొత్తాన్ని పెంచే విచక్షణాధికా రాన్ని బ్యాంకులకు కల్పించింది. ఉదాహరణకు ఐఐ ఎంలు, ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో రూ.పది లక్షల కంటే ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన వారికి గరిష్ట రుణ పరిమితి విషయంలో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది.

నిరంతర సమీక్ష..
విద్యా రుణం మంజూరు అయిన విద్యార్థికి సంబం«ధించిన ఫీజులను బ్యాంకులు నేరుగా సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌కే పంపుతాయి. ఒకవేళ తొలి దశలో విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించి ఉంటే.. సంబంధిత రశీదుల ఆధారంగా తొలి దశ ఫీజును విద్యార్థికి ఇస్తాయి. ఆ తర్వాత దశ నుంచి ఇన్‌స్టిట్యూట్‌కు పంపుతాయి. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో నిర్దేశిత గడవు తేదీలోగా ఇన్‌స్టిట్యూట్‌కు చెల్లిస్తాయి. అంతేకాకుండా అంతకుముందు సంవత్సరంలో చదువులో సదరు విద్యార్థి ప్రతిభను సమీక్షిస్తున్నాయి.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు..

  • ప్రవేశ ధ్రువీకరణ పత్రం
  • అకడమిక్‌ అర్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలు
  • తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ
  • తల్లిదండ్రుల ఆదాయ స్థితిగతుల వివరాలు, బ్యాంకు అకౌంట్‌ స్టేట్‌మెంట్స్‌
  • నివాస ధ్రువీకరణ
  • థర్డ్‌పార్టీ ఆదాయ ధ్రువీకరణ
  • కోర్సు వ్యయానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి అధీకృత లెటర్స్‌.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.iba.org.in

ఎడ్యుకేషన్‌ లోన్స్‌.. ముఖ్యాంశాలు

  • స్వదేశీ, విదేశీ విద్యకు బ్యాంకుల రుణాలు.
  • నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో ప్రవేశిస్తేనే రుణ దరఖాస్తుకు అర్హత. ఠి కనిష్టంగా రూ.4 లక్షలు గరిష్టంగా రూ.15 లక్షల వరకు రుణ మొత్తం.
  • విదేశీ విద్య, ఐఐఎంలు, ఐఐటీలు వంటి ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందితే రుణ మొత్తాన్ని పెంచే అవకాశం.
  • మహిళా విద్యార్థులను ప్రోత్సహించేలా ఇంట్రస్ట్‌ సబ్సిడీ స్కీమ్‌.
  • విద్యాలక్ష్మి పోర్టల్‌ పేరిట ఆన్‌లైన్‌లో ఒకేసారి మూడు బ్యాంకులకు రుణ దరఖాస్తు చేసుకునే సదుపాయం.

విద్యా లక్ష్మి పోర్టల్‌.. ఆన్‌లైన్‌ ద్వారా..
విద్యారుణం కోసం కేంద్ర ప్రభుత్వం విద్యా లక్ష్మి పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్‌.. విద్యా రుణాల విషయంలో విద్యార్థులకు, బ్యాంకులకు మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తుంది. విద్యార్థులు విద్యాలక్ష్మి పోర్టల్‌లో లాగిన్‌ అయి.. కామన్‌ ఎడ్యుకేషనల్‌ లోన్‌ అప్లికేషన్‌ ఫామ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్టంగా మూడు బ్యాంకులకే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను.. అభ్యర్థులు ప్రాథమ్యంగా పేర్కొన్న బ్యాంకులకు పంపిస్తారు. తర్వాత దశలో సదరు బ్యాంకులు దరఖాస్తును పరిశీలించి సంతృప్తి చెందితే.. ఏ బ్రాంచ్‌లో సంప్రదించాలి, ఏ ఏ పత్రాలు తీసుకెళ్లాలి అనే వివరాలను విద్యార్థులకు తెలియజేస్తాయి.
పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.vidyalakshmi.co.in

ఇంకా చద‌వండి: part 1: స్వదేశీ, విదేశీ విద్యకు.. విద్యారుణం అందుకునే మార్గం గురించి తెలుసుకోండిలా..!

Published date : 19 Mar 2021 05:29PM

Photo Stories