సీయూ సెట్–2019
అయితే ఒకే పరీక్ష.. 14 సెంట్రల్ యూనివర్సిటీలు, మరో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశాలకు దారిచూపుతోంది. అదే సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూ సెట్)! తాజాగా దీనికి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ సమాచారంతోపాటు ప్రవేశాలు కల్పించే కోర్సుల వివరాలు...
ఆన్‌లైన్ దరఖాస్తు :
సీయూ సెట్–2019 ఔత్సాహికులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలోనే కోర్సులకు సంబంధించిన ప్రాధాన్యతలను పేర్కొనాలి. దీని ఆధారంగా ప్రవేశ పరీక్ష ఉంటుంది.
వెబ్‌సైట్ల ఆధారంగా..
- సీయూసెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్న వర్సిటీలు సొంతంగా అర్హత ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తుకు ముందే ఆయా వర్సిటీలు అందిస్తున్న కోర్సులు–వాటి అర్హతల గురించి తెలుసుకోవాలి. దీనికోసం ఆయా వర్సిటీల వెబ్‌సైట్లను ఉపయోగించుకోవాలి.
- అర్హత పరీక్షలకు హాజరవుతున్నవారు కూడా సీయూసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు ప్రవేశాల సమయంలో అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.
- సీయూ సెట్ ఫలితాల వెల్లడి అనంతరం మెరిట్ ప్రకారం ప్రోగ్రామ్‌లు/యూనివర్సిటీలు/సంస్థ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈ ప్రక్రియకు విద్యా సంస్థలు విడివిడిగా ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి. దీనికి సంబంధించి ఆయా సంస్థలు వెబ్‌సైట్లో ప్రకటనలను అందుబాటులో ఉంచుతాయి.
సెంట్రల్ వర్సిటీలు..
1. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా.
2. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ.
3. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్.
4. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక.
5. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్.
6. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ.
7. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్.
8. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్.
9. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బిహార్.
10. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు.
11. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
12. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్.
13. అసోం యూనివర్సిటీ.
14. మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ (బిహార్).
15. బెంగళూరు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్.
ఈ ఏడాది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ సీయూసెట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టింది.
కోర్సులు..
సీయూసెట్ ద్వారా ఆయా యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్/అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, రీసెర్చ్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశం పొందొచ్చు. వీటిలో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ–ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎంఏ, బీఈడీ, ఎంఈడీ, ఎంకామ్, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్, ఎం.ఫిల్, పీహెచ్‌డీ వంటి ఇంటిగ్రేటెడ్/యూజీ, పీజీ, రీసెర్చ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష విధానం :
- సీయూసెట్.. అన్ని ప్రశ్నపత్రాల్లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి.
- రెండు విభాగాలు (పార్ట్–ఎ, పార్ట్–బి)గా 100 ప్రశ్నలతో పరీక్ష జరుగుతుంది.
- పార్ట్–ఎ: ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్, అనలిటికల్ స్కిల్స్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి.
- పార్ట్–బి: ఈ విభాగంలో 75 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఇవి స్వీయ డొమైన్లలో అభ్యర్థికి ఉన్న పరిజ్ఞానాన్ని పరీక్షించేవిగా ఉంటాయి.
- కొన్ని ఇంటిగ్రేటెడ్ పోగ్రామ్‌లు/ఎంబీఏ/బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్/ఎల్‌ఎల్‌బీ/ ఎంసీఏ లేదా ఇతర జనరల్ కోర్సులకు సంబంధించి ఒకే పేపర్‌తో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్,డేటా ఇంటర్‌ప్రిటేషన్/న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ అండ్ అనలిటికల్ స్కిల్స్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి.
- ఇంటిగ్రేటెడ్/అండర్ గ్రాడ్యుయేట్‌కు సంబంధించి ప్రవేశ పరీక్షలో నెగెటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. రీసెర్చ్ ప్రోగ్రామ్ (ఆర్‌పీ)లకు సంబంధించి నెగిటివ్ మార్కులుండవు.
సిలబస్‌పై పట్టుతో..
ఎంట్రన్స్ టెస్ట్‌లో ఉమ్మడి విభాగాన్ని (పార్ట్–ఎ) మినహాయిస్తే.. పార్ట్–బిలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న ప్రోగ్రామ్‌కు అర్హతగా పేర్కొన్న కోర్సుకు సంబంధించిన సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు ఇంటర్మీడియెట్ అర్హతగా నిర్వహించే పరీక్షలో ఇంటర్ సిలబస్‌పై పట్టుతో సీయూసెట్‌లో విజయం సాధించొచ్చు. ఇదే తరహాలో పీజీ అభ్యర్థులకు బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన సిలబస్ నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.
ముఖ్య సమాచారం :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 18, 2019.
అడ్మిట్ కార్డుల జారీ ప్రారంభం: మే 10, 2019.
ప్రవేశ పరీక్ష తేదీలు: మే 25, 26, 2019.
ప్రాథమిక కీ విడుదల: మే 27, 2019.
ఫలితాల వెల్లడి: జూన్ 21, 2019.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.350. పీడబ్ల్యూడీ అభ్యర్థులను దరఖాస్తు
రుసుం నుంచి మినహాయించారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.cucetexam.in