Skip to main content

సీటెట్-2020 పరీక్ష విధానం...ప్రయోజనాలు

ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించేందుకు కావల్సిన అర్హతలను అందించే పరీక్ష... సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (సీటెట్). దీన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది.
 తాజాగా సీబీఎస్‌ఈ సీటెట్ 2020 జూలై సెషన్‌కు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ఉపయోగపడేలా సీటెట్  పరీక్ష విధానం, ప్రయోజనాలపై ప్రత్యేక‌ కథనం...

ప్రయోజనాలు..
  • కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లతో పాటు రాష్ట్రస్థాయి పాఠశాలలో టీచర్ ఉద్యోగాల దరఖాస్తుకు అవసరమైన అర్హత లభిస్తుంది.
  • సీటెట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. ఉత్తీర్ణులకు ఏడేళ్ల గుర్తింపుతో సర్టిఫికెట్ జారీ చేస్తారు.
  • సీటెట్ హాజరుకు సంబంధించి ఎలాంటి పరిమితిలేదు.
అభ్యర్థులు ఎన్నిసార్లయినా సీటెట్‌కు హాజరవ్వొచ్చు. తద్వారా ఎక్కువ స్కోర్ వచ్చిన సీటెట్‌ను ఉపయోగించుకొనే వీలుంటుంది.

ప్రైమరీ స్టేజ్(1-5 తరగతులు) :
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్, రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన/చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు లేదా కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్, రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన/చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు(ఎన్‌సీటీఈ రెగ్యులేషన్స్ 2002 ప్రకారం) లేదా కనీసం 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ, నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈఎల్‌ఈడీ) పూర్తి చేసిన/చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు లేదా కనీసం 50 శాతం మార్కులతో సీనియర్ సెంకడరీ, రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన/చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు లేదా కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. అయితే బీఈడీ ఉత్తీర్ణులు అదనంగా ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు చేసుండాలి.

ఎలిమెంటరీ స్టేజ్ (6-8 తరగతులు) :
అర్హతలు: డిగ్రీ, రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులు/చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు లేదా కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, ఏడాది వ్యవధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) పూర్తి చేసిన/చివరి సంవత్సరం చదువుతున్న లేదా కనీసం ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం 45 శాతం మార్కులతో డిగ్రీ, ఏడాది వ్యవధిగల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) పూర్తి చేసిన/చివరి సంవత్సరం చదువుతున్న లేదా కనీసం 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ, నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన/చివరి సంవత్సరం చదువుతున్న లేదా కనీసం 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ, నాలుగేళ్ల బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సు పూర్తి చేసిన/చివరి సంవత్సరం చదువుతున్న లేదా కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, ఏడాది వ్యవధిగల బీఈడీ (స్పెషలెడ్యుకేషన్) పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కనీస విద్యార్హతలో 5 శాతం ఉత్తీర్ణతా సడలింపు ఉంటుంది.

రెండు పేపర్లు :
సీటెట్‌ను ఆన్‌లైన్ విధానంలో రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ఒకటి నుంచి ఐదు తరగతుల బోధనకు సంబంధించి పేపర్ 1 నిర్వహిస్తారు. 6-8 తరగతుల బోధనకు సంబంధించి పేపర్ 2 నిర్వహిస్తారు.
పేపర్ 1: ఉదయం 9.30-మధ్యాహ్నం 12 గంటల వరకు.
పేపర్ 2: మధ్యాహ్నం 2-4.30 గంటల వరకు.

పేపర్ 1.. 150 మార్కులకు :
ఇది ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు చదువుతున్న పిల్లల బోధనకు సంబంధించిన పేపర్. ప్రశ్నపత్రం మల్టిపుల్ చాయిస్ విధానంలో ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
విభాగం ప్రశ్నలు మార్కులు
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ 30 30
లాంగ్వేజ్ 1 (తప్పనిసరి) 30 30
లాంగ్వేజ్ 2 (తప్పనిసరి) 30 30
మ్యాథమెటిక్స్ 30 30
ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ 30 30
మొత్తం 150 150
  • లాంగ్వేజ్ 1: బోధనా భాషపై పట్టును పరీక్షిస్తారు.
  • లాంగ్వేజ్ 2: భాషాంశాలతోపాటు కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్షన్ సామర్థ్యాలను పరీక్షిస్తారు. అభ్యర్థులు లాంగ్వేజ్ 1, 2లను వేర్వేరుగా ఎంచుకోవాల్సి ఉంటుంది.
పేపర్ 2.. 6-8 తరగతులు :
6-8 తరగతులకు బోధించాలనుకొనే అభ్యర్థులు పేపర్ 2కు హాజరవ్వాల్సి ఉంటుంది.
విభాగం ప్రశ్నలు మార్కులు
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ 30 30
లాంగ్వేజ్ 1(తప్పనిసరి) 30 30
లాంగ్వేజ్ 2(తప్పనిసరి) 30 30
మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్ 60 60
మొత్తం 150 150

ముఖ్యసమాచారం:
 

 హాల్ టిక్కెట్ల జారీ: జూన్ మూడో వారం నుంచి
 పరీక్ష తేదీ: జూలై 5, 2020
 ఫలితాల వెల్లడి: పరీక్ష జరిగిన ఆరు వారాల్లోగా..
 పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్
 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ctet.nic.in
Published date : 05 Feb 2020 01:25PM

Photo Stories