సీఎంఏ-ఇంటర్మీడియెట్ ఫైనల్ పరీక్షలకు వ్యూహాలు..
Sakshi Education
సీఎంఏ (కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ).. ఎంబీఏ పూర్తిచేసిన వారి
కంటే మంచి కొలువులు అందిస్తున్న కోర్సు. చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు పూర్తిచేయడం కష్టమని భావించేవారికి సీఎంఏ అద్భుత ప్రత్యామ్నాయం. సాధారణంగా సీఏ కోర్సు క్లిష్టమైనదిగా భావించేవారు బీకాం లేదా ఎంబీఏ చేస్తారు. అయితే ఇలాంటి వారు సీఎంఏ పూర్తిచేసి, మంచి వేతనాలతో సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో సీఎంఏ ఇంటర్, ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. వీటిలో మంచి మార్కులు సాధించేందుకు వ్యూహాలు...
సీఎంఏ-ఇంటర్మీడియెట్..
ఫైనాన్షియల్ అకౌంటింగ్:
లాస్, ఎథిక్స్ అండ్ గవర్నెన్స్:
డెరైక్ట్ ట్యాక్సేషన్:
హెడ్స్ ఆఫ్ ఇన్‌కమ్, అసెస్‌మెంట్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించడం ద్వారా అధిక మార్కులు సాధించొచ్చు. డిసెంబర్, 2018 పరీక్షలకు ఫైనాన్స్ యాక్ట్-2017 వర్తిస్తుంది.
కాస్ట్ అకౌంటింగ్:
కాస్ట్ అకౌంటింగ్ ప్రమాణాలు, ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్‌కి అధిక ప్రాధాన్యమివ్వాలి. థియరీపై కూడా పట్టుసాధించాలి. ముఖ్య సూత్రాలు, సైడ్ హెడ్డింగ్స్‌ను ముందే రాసి ఉంచుకుంటే పరీక్షకు ముందు పునశ్చరణ తేలికవుతుంది.
ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్:
స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్:
ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నల్లో చాలా వాటికి సొంతంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. గత మూడు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్:
కాస్ట్ రికార్డ్, కాస్ట్ ఆడిట్ అంశాలను నిర్లక్ష్యం చేయకూడదు. వీటినుంచి తేలిగ్గా 20 మార్కులు సాధించొచ్చు. వర్క్‌బుక్‌లోని కాన్సెప్టులకు అధిక ప్రాధాన్యమివ్వాలి.
ఇన్‌డెరైక్ట్ ట్యాక్సేషన్: భావనలు, విధానాలను అర్థం చేసుకోవాలి. జీఎస్‌టీపై దృష్టిసారించాలి. కస్టమ్స్ డ్యూటీస్‌లోని ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.
కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్: అకౌంటింగ్ ప్రమాణాలకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి. ఆడిటింగ్ థియరీ సబ్జెక్టు. దీన్నుంచి వచ్చే ప్రశ్నలను ముందుగానే ఊహించొచ్చు. నిబంధనలు, వర్తించే చట్టాలు, అకౌంటింగ్ ప్రమాణాలు, ఆడిటింగ్ ప్రమాణాలు, విధానాలు, ప్రక్రియలపై దృష్టిసారించాలి.
సీఎంఏ-ఫైనల్..
ఫైనాన్షియల్ అకౌంటింగ్:
- ఇందులో అకౌంటింగ్ ప్రమాణాలకు ప్రాధాన్యమివ్వాలి. స్టడీ మెటీరియల్, స్కానర్‌లోని అన్ని లెక్కలను ప్రాక్టీస్ చేస్తే మంచిది.
- ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్, అకౌంటింగ్ ఫర్ స్పెషల్ ట్రాన్సాక్షన్స్, అకౌంటింగ్ ఫర్ బ్యాంకింగ్ తదితర చాప్టర్ల నుంచి ఎక్కువ మార్కులకు ప్రశ్నలు రావొచ్చు.
లాస్, ఎథిక్స్ అండ్ గవర్నెన్స్:
- చట్టంలో ఉన్న నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవాలి. ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు నిబంధనలు, ఉదాహరణలు, ముఖ్యమైన కేసులను మిళితం చేస్తే మంచి మార్కులు వస్తాయి.
- సెక్షన్ నంబరు రాయడంలో కచ్చితత్వం ఉండాలి. కంపెనీ చట్టాని (2013)కి సంబంధించిన నిబంధనలను జాగ్రత్తగా చదవాలి.
డెరైక్ట్ ట్యాక్సేషన్:
హెడ్స్ ఆఫ్ ఇన్‌కమ్, అసెస్‌మెంట్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించడం ద్వారా అధిక మార్కులు సాధించొచ్చు. డిసెంబర్, 2018 పరీక్షలకు ఫైనాన్స్ యాక్ట్-2017 వర్తిస్తుంది.
కాస్ట్ అకౌంటింగ్:
కాస్ట్ అకౌంటింగ్ ప్రమాణాలు, ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్‌కి అధిక ప్రాధాన్యమివ్వాలి. థియరీపై కూడా పట్టుసాధించాలి. ముఖ్య సూత్రాలు, సైడ్ హెడ్డింగ్స్‌ను ముందే రాసి ఉంచుకుంటే పరీక్షకు ముందు పునశ్చరణ తేలికవుతుంది.
ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్:
- థియరీ, ప్రాబ్లమ్స్‌కు సమాన ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యమైన మోడళ్లను అధ్యయనం చేయాలి. ఆపరేషన్ మేనేజ్‌మెంట్‌లో గణిత ఆధారిత సమస్యలు ఉంటాయి.
- సమస్యలకు సరైన, ఆమోదయోగ్యమైన పద్ధతుల్లో సమాధానం రాయాల్సి ఉంటుంది.
స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్:
ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నల్లో చాలా వాటికి సొంతంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. గత మూడు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్:
కాస్ట్ రికార్డ్, కాస్ట్ ఆడిట్ అంశాలను నిర్లక్ష్యం చేయకూడదు. వీటినుంచి తేలిగ్గా 20 మార్కులు సాధించొచ్చు. వర్క్‌బుక్‌లోని కాన్సెప్టులకు అధిక ప్రాధాన్యమివ్వాలి.
ఇన్‌డెరైక్ట్ ట్యాక్సేషన్: భావనలు, విధానాలను అర్థం చేసుకోవాలి. జీఎస్‌టీపై దృష్టిసారించాలి. కస్టమ్స్ డ్యూటీస్‌లోని ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.
కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్: అకౌంటింగ్ ప్రమాణాలకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి. ఆడిటింగ్ థియరీ సబ్జెక్టు. దీన్నుంచి వచ్చే ప్రశ్నలను ముందుగానే ఊహించొచ్చు. నిబంధనలు, వర్తించే చట్టాలు, అకౌంటింగ్ ప్రమాణాలు, ఆడిటింగ్ ప్రమాణాలు, విధానాలు, ప్రక్రియలపై దృష్టిసారించాలి.
సీఎంఏ-ఫైనల్..
- కార్పొరేట్ లాస్ అండ్ కంప్లయిన్స్‌లో సవరణలపై దృష్టిసారించాలి. పెనాల్టీ ఆధారిత ప్రశ్నలను అధ్యయనం చేయాలి. ప్రాక్టికల్ ప్రశ్నలు ముఖ్యమైనవి. విధానాలు, సమ్మతి సమస్యలు (ప్రొసీజర్ అండ్ కంప్లయిన్స్ ఇష్యూస్); సందర్భ పరిశీలన (కేస్ స్టడీ) ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలంటే ప్రొవిజన్ అనాలిసిస్ చేయాలి.
- స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్; ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ చాలా సులువైన అధ్యాయాలు. వీటినుంచి ఎక్కువ మార్కులకు ప్రశ్నలు రావొచ్చు.
- కార్పొరేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్‌లో బిజినెస్ కాంబినేషన్స్-అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్; గ్రూప్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ నుంచి 10 లేదా 15 మార్కుల ప్రశ్నలను ఆశించొచ్చు.
- ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ప్రాక్టీస్‌లో జీఎస్‌టీపై దృష్టిసారించాలి. కొత్త సవరణలు, కేస్‌స్టడీస్, కస్టమ్స్ డ్యూటీస్‌లోని ప్రాబ్లమ్స్‌కి సంబంధించిన ప్రశ్నలపై ఎక్కువ దృష్టిసారించాలి.
- కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ ఆడిట్‌లో కాస్ట్ అకౌంటింగ్ ప్రమాణాలపై దృష్టిసారించాలి. ఆపరేషనల్ ఆడిట్, మేనేజ్‌మెంట్ ఆడిట్ విషయాలపై అవగాహన అవసరం. వాల్యుయేషన్‌లో థియరీ ప్రశ్నలు తక్కువగా, ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. పర్‌ఫార్మెన్స్ వాల్యుయేషన్ అండ్ ఇంపార్టెంట్ టూల్స్, ఎంటర్‌ప్రైజ్ రిస్క్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై దృష్టిసారించాలి.
ప్రాథమిక అంశాలపై పట్టు తప్పనిసరి... సీఏ, సీఎంఏ వంటి కోర్సులను పూర్తిచేయాలంటే శ్రమించేతత్వంతో పాటు ఓర్పు ఉండాలి. ప్రాథమిక అంశాలపై తప్పనిసరిగా పట్టు సాధించాలి. ప్రిపరేషన్‌కు అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. సీఎంఏ ఇంటర్, ఫైనల్లో కొత్త పరీక్ష విధానం ప్రకారం గ్రూప్-1లో తొలి పరీక్ష రాశాక, మరుసటి రోజు గ్రూప్-2లో మొదటి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పేపర్లు రాయాలి. విద్యార్థులు ఈ మార్పును గుర్తించాలి. -ఎం.ఎస్.ఎస్.ప్రకాశ్, డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్. |
Published date : 06 Dec 2018 02:35PM