సీఏ... ప్రాక్టికల్ ట్రైనింగ్
Sakshi Education
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జాబ్ రెడీ స్కిల్స్, క్షేత్ర స్థాయి పని అనుభవం అందించేదే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రస్తుతం చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ), కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ (సీఎంఏ) తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్ ద్వారా ప్రాక్టికల్ శిక్షణ పొందడం తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో సీఏ కోర్సుతో సుస్థిర కెరీర్ దిశగా చేసే ప్రయాణంలో కీలక మలుపుగా నిలుస్తున్న ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఆర్టికల్‌షిప్) గురించి తెలుసుకుందాం...
సీఏ కోర్సులో మూడు దశలు ఉంటాయి. తొలుత సీఏ ఫౌండేషన్ పూర్తిచేసిన వారు 9 నెలలకు రెండో దశ సీఏ ఇంటర్ పూర్తిచేయాలి. ఇంటర్‌లోని రెండు గ్రూపుల్లో ఏదో ఒకటి లేదా రెండు గ్రూపుల్లోనూ ఉత్తీర్ణులైనవారు సీఏ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే నాలుగు వారాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్‌స్కిల్స్ (ఐసీఐటీఎస్‌ఎస్) కంప్యూటర్ కోర్సును పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆపై మూడేళ్లపాటు ప్రాక్టికల్ శిక్షణ పొందాలి. రెండున్నరేళ్ల ప్రాక్టికల్ శిక్షణ తర్వాత నాలుగు వారాల వ్యవధిగల అడ్వాన్స్‌డ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్‌స్కిల్స్ కోర్సును పూర్తిచేశాక, సీఏ ఫైనల్ పరీక్ష రాయొచ్చు.
ప్రాక్టికల్ శిక్షణ లక్ష్యం :
సీఏ చదువుతున్న విద్యార్థులు చదువుతో పాటు భవిష్యత్తులో చేపట్టే విధులకు సంబంధించి వృత్తి నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానాన్ని ముందే పెంపొందించుకునేందుకు ప్రాక్టికల్ శిక్షణ ఉపయోగపడుతుంది. ప్రాక్టీసింగ్ సీఏ దగ్గర లేదా ఏదైనా ఆడిట్ సంస్థలో ప్రాక్టికల్ శిక్షణ పొందాల్సి ఉంటుంది. విద్యార్థులు ప్రాక్టికల్ శిక్షణకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ద్వారా నమోదు చేసుకోవాలి. ఎవరి వద్ద ప్రాక్టికల్ శిక్షణ తీసుకుంటారు? ఎప్పటి నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది? తదితర విషయాలను విద్యార్థులు ఐసీఏఐకు ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది.
ఎన్నో ప్రయోజనాలు..
ఇంటర్వ్యూలో విజయానికి...
కొన్ని పెద్ద ఆడిట్ సంస్థలు.. తమ వద్ద ప్రాక్టికల్ శిక్షణ తీసుకోవాలనుకునే వారికి మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ పరీక్షల్లో విజయం సాధించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఐపీసీసీలోని అన్ని సబ్జెక్టులను ఒకసారి రివైజ్ చేసుకొని, ఇంటర్వ్యూకు వెళ్లాలి. ఏ ఆడిట్ సంస్థ ఇంటర్వ్యూకు వెళ్తున్నారో ఆ సంస్థ ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవాలి. సంస్థ నిబంధనల మేరకు ప్రాక్టికల్స్ చేస్తామనే భరోసా ఇంటర్వ్యూ చేసేవారిలో కల్పించడం ముఖ్యం. ఇంటర్వ్యూలో ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోతే తెలియదని నిజాయితీగా చెప్పాలి. అంతేకానీ ఏదో ఒకటి చెప్పి మభ్యపెట్టకూడదు.
చదువుతూ సంపాదన: ప్రాక్టికల్ సమయంలో విద్యార్థికి సంపాదన కూడా ఉం టుంది. ఆడిట్ సంస్థ.. ఐసీఏఐ నిబంధనల ప్రకారం విద్యార్థులకు స్టైపెండ్ ఇస్తుంది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులపై ఆధారపడకుండా చదువుకునేందుకు అవకాశముంటుంది.
- ఎం.ఎస్.ఎస్. ప్రకాశ్ డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్

- ఎంతో ముందుచూపుతో ఐసీఏఐ.. కోర్సును ప్రారంభించినప్పటి నుంచే ప్రాక్టికల్స్ శిక్షణను అమలు చేస్తోంది.
- విదార్థులు తరగతిగదిలో నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా ఎలా అమలు చేయాలో ఆర్టికల్‌షిప్ ద్వారా నేర్చుకుంటారు.
- సీఏ కోర్సు పూర్తిచేసిన వారు ఉద్యోగంలో చేరొచ్చు. లేదా సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వీటిలో రాణించేందుకు ప్రాక్టికల్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. కెరీర్‌లో విజయవంతంగా దూసుకెళ్లేందుకు ప్రాక్టికల్ నైపుణ్యాలు దోహదం చేస్తాయి.
- సీఏ ఫైనల్ పరీక్షలో విజయం సాధించాలంటే వివిధ అంశాలపై లోతైన అవగాహన అవసరం. ప్రాక్టికల్ శిక్షణను నిబద్ధతతో పూర్తిచేయడం ద్వారా సీఏ ఫైనల్ పరీక్ష బాగా రాయొచ్చు.
- ప్రాక్టికల్స్ సమయంలో విద్యార్థులు.. ఆయా సంస్థల్లోని అధికారులు, సీనియర్లు తదితరులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఈ రకమైన వాతావరణం భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, బృంద స్ఫూర్తిని పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతుంది.
- ప్రాక్టికల్ శిక్షణ ముందుకు సాగుతున్న కొద్దీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని చేరుకునే మార్గాలపై అన్వేషణ మొదలై చివరకు పదిలమైన కెరీర్‌కు గట్టి పునాది ఏర్పడుతుంది.
- ప్రాక్టికల్ శిక్షణ సమయంలో మంచి పనితీరు కనబరిచిన వారికి ఆడిట్ సంస్థలు ఆకర్షణీయ వేతన ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తాయి.
- నైపుణ్యాలు, ప్రతిభను మెరుగుపరచుకునేందుకు ఎక్కువ అవకాశం కల్పించే ఆడిట్ సంస్థను శిక్షణ కోసం ఎంపిక చేసుకోవాలి. సంస్థలో అప్పగించిన విధులను పూర్తిచేసేందుకు వినూత్నంగా ఆలోచించాలి.
- సమస్యను పరిష్కరించే క్రమంలో ఏవైనా సందేహాలు వస్తే ఎలాంటి సంకోచం లేకుండా సీనియర్లను అడిగి తెలుసుకోవాలి. స్టైపెండ్ గురించి ఆలోచించకుండా, మంచి సంస్థలో అవకాశం వస్తే ప్రాక్టికల్స్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి.
- కొందరు ఏదో ఒక సంస్థలో చేరుతున్నారు. తర్వాత అక్కడ బాగోలేదంటూ వేరే సంస్థకు మారుతున్నారు. దీన్ని గమనించిన సీఏ సంస్థ.. ఆడిట్ సంస్థ బదిలీ ప్రక్రియను కఠినతరం చేసింది. అందుకే ముందే అన్ని కోణాల్లోనూ ఆలోచించి, సంస్థను ఎంపిక చేసుకోవాలి.
- సీఏ కోర్సులో కొత్త విధానం ప్రకారం ప్రాక్టికల్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఇకపై సీఏ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే అసెస్‌మెంట్ టెస్టులు రాయాల్సి ఉంటుంది.
- ప్రాక్టికల్స్ సమయంలో ఏ అంశాలు నేర్చుకున్నారు? ఎంత వరకు పని అనుభవం సంపాదించారు? తదితర అంశాలను ఈ అసెస్‌మెంట్ టెస్టుల ద్వారా పరీక్షిస్తారు.
- మొదటి, రెండో సంవత్సరం శిక్షణ పూర్తయ్యాక అసెస్‌మెంట్ టెస్టులు రాయాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ శిక్షణ సమయంలో విద్యార్థి ఏ సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టికల్ పరిజ్ఞానం సంపాదిస్తున్నాడో వాటిపైనే సిలబస్ ఇచ్చారు.
మొదటి సంవత్సరం: అకౌంటింగ్, ఆడిటింగ్ (కార్పొరేట్ లాస్ కలిపి)కు 50 మార్కులు ఉంటాయి. 25 మార్కులకు డెరైక్ట్ ట్యాక్స్, ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్, ఇండస్ట్రియల్ ఆడిట్ నుంచి ఏదో ఒక మాడ్యూల్‌ను ఎంపిక చేసుకోవాలి (ప్రాక్టికల్ శిక్షణ స్పెషలైజేషన్‌బట్టి). సమయం: రెండు గంటలు.
రెండోసంవత్సరం: అకౌంటింగ్, ఆడిటింగ్ (కార్పొరేట్ లాస్‌తో కలిపి)కు 50 మార్కులుంటాయి. డెరైక్ట్ ట్యాక్స్ (ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్‌తో కలిపి), ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్, ఇండస్ట్రియల్ ఆడిట్ నుంచి ఏవైనా రెండు మాడ్యూళ్లను ఎంపిక చేసుకోవాలి (ప్రాక్టికల్ శిక్షణ స్పెషలైజేషన్ బట్టి). ఒక్కో మాడ్యూల్‌కు 25 మార్కులు ఉంటాయి. సమయం: 3 గంటలు, మార్కులు 100.
ఆన్‌లైన్ ద్వారా ఈ టెస్టులకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
వెబ్‌సైట్: www.icai.org
ఇంటర్వ్యూలో విజయానికి...
కొన్ని పెద్ద ఆడిట్ సంస్థలు.. తమ వద్ద ప్రాక్టికల్ శిక్షణ తీసుకోవాలనుకునే వారికి మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ పరీక్షల్లో విజయం సాధించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఐపీసీసీలోని అన్ని సబ్జెక్టులను ఒకసారి రివైజ్ చేసుకొని, ఇంటర్వ్యూకు వెళ్లాలి. ఏ ఆడిట్ సంస్థ ఇంటర్వ్యూకు వెళ్తున్నారో ఆ సంస్థ ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవాలి. సంస్థ నిబంధనల మేరకు ప్రాక్టికల్స్ చేస్తామనే భరోసా ఇంటర్వ్యూ చేసేవారిలో కల్పించడం ముఖ్యం. ఇంటర్వ్యూలో ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోతే తెలియదని నిజాయితీగా చెప్పాలి. అంతేకానీ ఏదో ఒకటి చెప్పి మభ్యపెట్టకూడదు.
చదువుతూ సంపాదన: ప్రాక్టికల్ సమయంలో విద్యార్థికి సంపాదన కూడా ఉం టుంది. ఆడిట్ సంస్థ.. ఐసీఏఐ నిబంధనల ప్రకారం విద్యార్థులకు స్టైపెండ్ ఇస్తుంది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులపై ఆధారపడకుండా చదువుకునేందుకు అవకాశముంటుంది.
- ఎం.ఎస్.ఎస్. ప్రకాశ్ డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్
Published date : 01 Aug 2018 06:25PM