సీఏ ఇంటర్లో విజయానికి సలహాలు...
Sakshi Education
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సులోని కీలక దశ.. ఇంటర్. ఈ దశ వరకు పూర్తిచేసినా ప్రస్తుతం మంచి ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో సీఏ-ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల్లో మంచి మార్కుల సాధనకు సూచనలు..

సీఏ ఇంటర్‌లోని గ్రూప్-1 సబ్జెక్టులకు మే 28 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు జరుగుతాయి. అదే విధంగా జూన్ 6 నుంచి 12 వరకు గ్రూప్-2 సబ్జెక్టులకు పరీక్షలు ఉంటాయి. గ్రూప్-1లో నాలుగు, గ్రూప్-2లో నాలుగు పేపర్లు రాయాలి.
పేపర్ల వారీ సన్నద్ధత..
పేపర్-1 (అకౌంటింగ్) :
పేపర్-2 (కార్పొరేట్ లాస్ అండ్ అదర్ లాస్) :
పేపర్-3 (కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్) :
పేపర్-4 (ట్యాక్సేషన్) :
పేపర్-5 (అడ్వాన్స్డ్ అకౌంటింగ్) :
పేపర్-6 (ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్) :
పేపర్-7 (ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్) :
పేపర్-8 (ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్) :
సమయస్ఫూర్తి, లాజికల్ థింకింగ్‌తో..
సమయస్ఫూర్తి, లాజికల్ థింకింగ్‌తో ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఇవ్వొచ్చు. సబ్జెక్టును విశ్లేషణాత్మకంగా చదవాలి తప్ప బట్టీపట్టకూడదు. సన్నద్ధత సమయంలో వచ్చే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. అకౌంటెన్సీ, అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ, కాస్టింగ్‌పై పట్టుసాధించాలంటే ప్రాక్టీస్ కీలకం. సమాధానాలను పేజీలకు పేజీలు రాస్తే బాగా మార్కులు వస్తాయని కొందరు విద్యార్థులు భావిస్తుంటారు. ఇది అపోహ మాత్రమే. ఎంత జవాబు రాశాం అనేదానికంటే ఎంత సూటిగా, స్పష్టంగా రాశామనేదే ముఖ్యమని గుర్తించాలి. అకౌంట్స్ వంటి సబ్జెక్టుల్లో కొందరు విద్యార్థులు లెక్కకు ఇచ్చిన ప్రాధాన్యం ఫార్మాట్‌కి ఇవ్వరు. దీనివల్ల కొన్ని మార్కులు కోల్పోయే అవకాశముంది.
- ఎం.ఎస్.ఎస్.ప్రకాశ్, డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్.
పేపర్ల వారీ సన్నద్ధత..
పేపర్-1 (అకౌంటింగ్) :
- అకౌంటింగ్ స్టాండర్డ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. థియరీ చాప్టర్లను తప్పనిసరిగా చదవాలి. అవసరమున్న ప్రతి ప్రశ్నకు బ్యాలెన్స్ షీటు తయారు చేయాలి.
- ఏ అంశాన్ని చదువుతున్నా కాన్సెప్టుకు ప్రాధాన్యమివ్వాలి. RTP's, MTP's లను తప్పనిసరిగా చదవాలి.
- పార్టనర్షిప్ అకౌంట్స్, అకౌంట్స్ ఫ్రమ్ ఇన్‌కంప్లీట్ రికార్డ్స్, బ్రాంచ్ అకౌంట్స్ తదితర చాప్టర్లపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
పేపర్-2 (కార్పొరేట్ లాస్ అండ్ అదర్ లాస్) :
- తప్పు, ఒప్పు; స్టేట్మెంట్స్ తరహా ప్రశ్నలు 8-10 మార్కులకు వచ్చేందుకు అవకాశముంది. కాబట్టి వీటిపై దృష్టిసారించాలి.
- ఇండెమినిటీ అండ్ గ్యారెంటీ, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ తదితర చాప్టర్ల నుంచి ఆబ్జెక్టివ్‌తో పాటు విశ్లేషణాత్మక ప్రశ్నలు కూడా వచ్చేందుకు అవకాశముంది.
- కొత్త సిలబస్ ప్రకారం కంపెనీ లాపై ఎక్కువగా దృష్టిసారించాలి.
పేపర్-3 (కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్) :
- ప్రతి చాప్టర్లో ఇచ్చిన థియరీ ప్రశ్నలను తప్పనిసరిగా చదవాలి. బేసిక్ కాన్సెప్ట్ ఇన్ కాస్టింగ్ చాప్టర్ చాలా ముఖ్యమైంది.
- ప్రతి చాప్టర్లోని ఫార్ములాలపై దృష్టిసారించాలి. మెటీరియల్స్, ఓవర్‌హెడ్స్ వంటి ప్రాథమిక చాప్టర్లపై పట్టుసాధించడం వల్ల ఇతర చాప్టర్ల నుంచి వచ్చే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు రాయొచ్చు.
- పరీక్ష రాసేటప్పుడు థియరీని సరళ భాషలో రాయాలి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ప్రొసీజర్‌ను అర్థవంతంగా రాస్తూ, వర్కింగ్ నోట్స్ తప్పనిసరిగా రాయాలి.
పేపర్-4 (ట్యాక్సేషన్) :
- ఇటీవలి సవరణలను బాగా చదవాలి. కొత్త సవరణల నుంచి 10-15 మార్కులకు ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
- రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ ఇంట్రస్ట్, టీడీఎస్ అండ్ టీసీఎస్ తదితర చిన్న చాప్టర్ల నుంచి కూడా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశమున్నందున వాటిపైనా దృష్టిసారించాలి.
- గ్రాస్ టోటల్ ఇన్‌కమ్‌కు సంబంధించిన లెక్కలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
- పాత, కొత్త సిలబస్ విద్యార్థులందరూ తప్పనిసరిగా జీఎస్టీని చదవాలి.
పేపర్-5 (అడ్వాన్స్డ్ అకౌంటింగ్) :
- అకౌంటింగ్ స్టాండర్డ్స్‌ను తప్పనిసరిగా చదవాలి. ఫార్మాట్స్ ఉన్న చాప్టర్లను బాగా ప్రాక్టీస్ చేయాలి.
- వీలైనన్ని ఎక్కువ సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.
- అమాల్గమేషన్ అండ్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్, కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తదితర చాప్టర్లపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
పేపర్-6 (ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్) :
- ఈ పేపర్లో 30 శాతం మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి.
- ఆడిటింగ్ స్టాండర్డ్ పేరు, నంబరును బాగా గుర్తుంచుకోవాలి.
- ఆడిటింగ్ సబ్జెక్టులోని అన్ని చాప్టర్ల ప్రాక్టికల్ ప్రశ్నలను చదవాల్సిన అవసరం లేదు. ఆడిట్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్ అండ్ అలైడ్ యాస్పెక్ట్స్ చాప్టర్లలోని ప్రాక్టికల్ ప్రశ్నలు చదివితే సరిపోతుంది.
- కొత్త అంశాలైన ఎస్ఏ701, ఆడిట్ ఆఫ్ బ్యాంక్ తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి.
- తొలుత ఆడిట్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్ అండ్ అలైడ్ యాస్పెక్ట్స్లోని ప్రాక్టికల్ ప్రశ్నలను చదవడం ప్రారంభించి, తర్వాత మిగిలిన చాప్టర్లలోని ప్రాక్టికల్ ప్రశ్నలు చదివితే సరిపోతుంది.
పేపర్-7 (ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్) :
- ఈ పేపర్లో 30 శాతం మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి.
- వీలైనన్నిసార్లు రివిజన్ చేయడం ద్వారా ఈ పేపర్లోని ప్రశ్నలకు కచ్చిత సమాధానాలు రాయొచ్చు.
- ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, నిర్వచనాలు, వ్యత్యాసాలు, తప్పు-ఒప్పుల ప్రశ్నలపై దృష్టిసారించాలి.
- స్ర్టాటజిక్ మేనేజ్మెంట్ నుంచి ప్రశ్నలు నేరుగా రావు. చాలా వరకు ప్రశ్నలకు సొంతంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
- 2-5 చాప్టర్ల నుంచి అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు వచ్చేందుకు అవకాశమున్నందున ఈ చాప్టర్లకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
పేపర్-8 (ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్) :
- ప్రతి చాప్టర్లోని థియరీ ప్రశ్నలను తప్పనిసరిగా చదవాలి. 25 నుంచి 30 మార్కుల వరకు థియరీ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ముఖ్యంగా సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్, స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎఫ్ఎం తదితర చాప్టర్లకు సంబంధించిన థియరీ ప్రశ్నలు చదవాలి.
- ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ తదితర చాప్టర్లపై స్పష్టత అవసరం.
- రిస్క్ అనాలిసిస్, లీజింగ్ అండ్ డెషిషన్స్ తదితర కొత్త చాప్టర్లపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
- అన్ని సెక్టార్ మోడల్స్, ఇన్వెస్టిమెంట్ మల్టిప్లయిర్లోని సర్క్యులర్ ఫ్లోస్, గ్రాఫ్‌లను ప్రాక్టీస్ చేయాలి.
- ప్రభుత్వ వ్యయం, పన్నులు, ఆర్థిక విధానాలు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
- మార్కెట్ వైఫల్యం, ప్రభుత్వ పాత్ర; మనీ మార్కెట్, మారకపు రేటు-దాని ఆర్థిక ప్రభావాలు తదితరాలను చదవాలి.
సమయస్ఫూర్తి, లాజికల్ థింకింగ్‌తో..
సమయస్ఫూర్తి, లాజికల్ థింకింగ్‌తో ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఇవ్వొచ్చు. సబ్జెక్టును విశ్లేషణాత్మకంగా చదవాలి తప్ప బట్టీపట్టకూడదు. సన్నద్ధత సమయంలో వచ్చే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. అకౌంటెన్సీ, అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ, కాస్టింగ్‌పై పట్టుసాధించాలంటే ప్రాక్టీస్ కీలకం. సమాధానాలను పేజీలకు పేజీలు రాస్తే బాగా మార్కులు వస్తాయని కొందరు విద్యార్థులు భావిస్తుంటారు. ఇది అపోహ మాత్రమే. ఎంత జవాబు రాశాం అనేదానికంటే ఎంత సూటిగా, స్పష్టంగా రాశామనేదే ముఖ్యమని గుర్తించాలి. అకౌంట్స్ వంటి సబ్జెక్టుల్లో కొందరు విద్యార్థులు లెక్కకు ఇచ్చిన ప్రాధాన్యం ఫార్మాట్‌కి ఇవ్వరు. దీనివల్ల కొన్ని మార్కులు కోల్పోయే అవకాశముంది.
- ఎం.ఎస్.ఎస్.ప్రకాశ్, డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్.
Published date : 17 May 2019 06:44PM