Skip to main content

సెప్టెంబర్‌ 1న ఏపీ పాలిసెట్‌–2021 నిర్వహణ ప్రిపరేషన్‌ సాగించండిలా..!

పదో తరగతి తర్వాత సత్వర ఉపాధి, ఉన్నత విద్యకు చక్కటి మార్గం.. పాలిటెక్నిక్‌ కోర్సులు. మూడు, మూడున్నరేళ్ల ఇంజనీరింగ్‌/నాన్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులు పూర్తికాగానే.. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు.

ఆసక్తి ఉంటే ఉన్నత విద్య కోర్సుల్లోనూ చేరే వీలుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పాలిసెట్‌–2021 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఏపీ పాలిసెట్‌తో ప్రవేశం కల్పించే కోర్సులు, దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్‌ తదితర వివరాలు..

పాలిసెట్‌ అంటే.. పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌! విజయవాడలోని స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్, ఏపీ.. నిర్వహించే పాలిసెట్‌ 2021 ద్వారా.. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్, సెకండ్‌ షిప్ట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలు అందించే డిప్లొమా స్థాయి ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఆటోమొబైల్, మైనింగ్, కెమికల్, మెట్లర్జికల్, రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఎయిర్‌కండిషనింగ్, పెట్రోలియం టెక్నాలజీ వంటి అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
వీటితో పాటు గార్మెంట్‌ టెక్నాలజీ, 3–డీ యానిమేషన్‌ అండ్‌ గ్రాఫిక్స్, వెబ్‌ డిజైనింగ్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీసెస్‌ కోర్సుల్లోనూ చేరే వీలుంది.

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అం డ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ, డి.ఫార్మసీ వంటి డిప్లొమా కోర్సులకు ఇంటర్మీడియట్‌ చేసినవారు మాత్రమే అర్హులు. వీటిలో ప్రవేశాలను పాలిసెట్‌తో సంబంధం లేకుండా ప్రత్యేక నోటిఫికేష¯ŒS ద్వారా నిర్వహిస్తారు.
పాలిటెక్నిక్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు తమ ఆసక్తి మేరకు కొలువులో చేరవచ్చు. లేదా ఉన్నత చదువులకు వెళ్లవచ్చు. డిప్లొమా
తర్వాత ‘ఈసెట్‌’ ద్వారా.. నాలుగేళ్ల బీటెక్‌/బీఈ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశం పొందొచ్చు.

అర్హతలు:
పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులు ఏపీ పాలిసెట్‌కు దరఖాస్తుకు అర్హులు. 2021 ఏప్రిల్‌/మార్చిలో పదో తరగతి/తత్సమాన పరీక్షకు హాజరైన/హాజరయ్యే లేదా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ పాలిసెట్‌–2021 రాసేందుకు అభ్యర్థులకు ఎలాంటి వయోపరివితి నిబంధన లేదు.

పరీక్ష విధానం:
పాలిసెట్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా.. టెస్ట్‌ మాత్రం ఆఫ్‌లైన్ (పేపర్‌ అండ్‌ పెన్)లోనే నిర్వహిస్తారు. ప్రశ్నలు మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో
ఉంటాయి. మొత్తం 120 ప్రశ్నలు–120 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇందులో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటిక్స్‌ 50 ప్రశ్నలు–50 మార్కులకు, ఫిజిక్స్‌ 40 ప్రశ్నలు–40 మార్కులకు, కెమిస్ట్రీ 30 ప్రశ్నలు–30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు.

సిలబస్‌:
గణితం: నంబర్‌ సిస్టం, వాస్తవ సంఖ్యలు, రేఖీయ సమీకరణాలు, బహుపదులు, బీజగణితం, వర్గ సమీకరణాలు, త్రికోణమితి, ప్రోగ్రెసెషన్స్‌, సెట్స్, రేఖాగణితం, జామెట్రీ, ఉపరితల ప్రాంతాలు(సర్ఫేస్‌ ఏరియాస్‌ అండ్‌ వాల్యూమ్‌), ఘనపరిమాణం, క్షేత్రమితి, గణాంకాలు, మ్యాథమెటికల్‌ మోడలింగ్, ప్రాబబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
భౌతిక శాస్త్రం: కొలతలు, పని, పవర్‌ అండ్‌ ఎనర్జీ, వెక్టర్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, కైనమాటిక్స్‌ అండ్‌ ఫ్రిక్షన్, సరళ హార్మోనిక్‌ చలనం, ధ్వనిశాస్త్రం, కాంతి ప్రతిబింబం, ప్లేన్‌ ఉపరితలంపై కాంతి వక్రీభవనం, వక్రతలం వద్ద కాంతి వక్రీభవనం, ఆధునిక భౌతిక శాస్త్రం తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
రసాయన శాస్త్రం: పరమాణు నిర్మాణం, కెమికల్‌ బాండింగ్, వాటర్‌ టెక్నాలజీ సొల్యూష¯Œ్స, ఇంధనాలు, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆమ్లాలు– క్షారాలు, కొరొజిన్, పాలిమర్లు వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

ప్రిపరేషన్‌ టిప్స్‌:

  • పాలిసెట్‌–2021కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సెప్టెంబర్‌ 1న పరీక్ష నిర్వహించనున్నారు. అంటే.. పరీక్షకు ఇంకా నెలరోజుల వ్యవధి మాత్రమే ఉంది.
  • ఈ సమయాన్ని విద్యార్థులు సమర్థవంతంగా వినియోగించుకుంటే మంచి ర్యాంక్‌ సాధించేందుకు అవకాశముంది.
  • అభ్యర్థులు సిలబస్‌ ప్రకారం–మూడు సబ్జెక్టులకు సంబంధించి పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని..ప్రిపరేషన్‌ సాగించాలి.
  • గత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేసి.. ఏఏ అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఒక అంచనాకు రావాలి.
  • పదో తరగతి పాఠ్యపుస్తకాల అధ్యయనం పూర్తయ్యాక.. మోడల్‌ పేపర్లు, ప్రీవియస్‌ పేపర్లు సాధన చేయాలి.
  • ప్రణాళిక ప్రకారం ప్రతి సబ్జెక్ట్, టాపిక్‌ను పరీక్షకు వారం రోజుల ముందే పూర్తిచేసుకోవాలి.
  • పరీక్షకు ముందు పూర్తిగా రివిజన్‌ కోసం కేటాయించాలి. ఇందుకోసం ఇప్పటికే సిద్ధం చేసుకున్న షార్ట్‌ నోట్‌ను ఉపయోగించుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 26.07.2021.
  • దరఖాస్తుకు చివరి తేది: 13.08.2021.
  • పాలిసెట్‌ తేదీ: 01.09.2021.
  • పరీక్ష సమయం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://polycetap.nic.in
Published date : 29 Jul 2021 06:12PM

Photo Stories