సైన్యంలో వైద్య కొలువులు.. ఎస్ఎస్సీ నోటిఫీకేషన్ వివరాలు ఇదిగో..
Sakshi Education
భారత సైన్యంలోని సాయుధ దళాల వైద్య సేవల కోసం ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్.. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ప్రాతిపదికన డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎంబీబీఎస్ మొదటి లేదా రెండో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించిన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వూల ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 16 తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
- మొత్తం పోస్టుల సంఖ్య : 300(పురుషులు –270, మహిళలు–30)
- ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (ఏఎఫ్‌ఎమ్‌ఎస్).. భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది సైన్యానికి సంబంధించిన మిలిటరీ ఆసుపత్రుల్లో వైద్యుల నియామకాలను చేపడుతుంది. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ నిర్దేశించిన బాధ్యతలు, మార్గదర్శకాలకు అనుగుణంగా డైరెక్టర్ జనరల్(డీజీ) పనిచేస్తారు.
- ఎంబీబీఎస్ మొదటి లేదా రెండో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించాలి.
- అభ్యర్థులు ఏదైనా రాష్ట్ర వైద్యమండలి/ఎంసీఐలో తమ పేరును నమోదు(పర్మనెంట్ రిజిస్ట్రేషన్) చేసుకొని ఉండాలి.
- స్టేట్ మెడికల్ కౌన్సిల్/ఎంసీఐ/ఎన్‌బీఈ గుర్తించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా హోల్డర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- జూన్ 30, 2020 లేదా అంతకుముందు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
- వయసు : డిసెంబర్ 31,2020 నాటికి 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.
- దరఖాస్తులను మెరిట్ ప్రాతిపదికన షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వూలకు పిలుస్తారు.
- సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వూ, మెడికల్ టెస్ట్‌ల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
- ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఆర్మీ హాస్పిటల్(ఆర్ అండ్ ఆర్)లో.. ఇంటర్వూ్యలు, మెడికల్ టెస్ట్‌లను నిర్వహించి.. అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఆకర్షణీయమైన వేతనాలతోపాటు ఇతర ప్రోత్సాహకాలు కూడా పొందవచ్చు. డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ 10 లెవల్ ప్రకారం–వేతనాలు, ఇతర ప్రోత్సాహకాలు అందుకుంటారు.
- బేసిక్ పే కింద రూ.61,300+ఎంఎస్‌పీ రూ.15,500+హెచ్‌ఆర్‌ఏ లభిస్తుంది. ఇవే కాకుండా ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సుల కింద రూ.3600–7200, డ్రెస్ అలవెన్సుల కింద రూ.20 వేలు అందుతాయి. అంతేకాకుండా డియర్‌నెస్ అలవెన్సులు, ప్రాంతాన్ని బట్టి వసతి సౌకర్యాలు లభిస్తాయి. అలాగే పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు.. పీజీ అలవెన్స్, స్పెషలిస్ట్ పేకు అర్హులు.
- సంవత్సరంలో 60 రోజుల వార్షిక సెలవులు, 20 రోజుల సాధారణ సెలవులు, ప్రయాణ రాయితీలు, ఉద్యోగి తల్లిదండ్రులకు, అతని కుటుంబానికి ఉచిత వైద్యం, బీమా సౌకర్యాలు వంటివి లభిస్తాయి.
- ఎంపికైన అభ్యర్థులు ఎయిర్‌ఫోర్స్/నేవీ కెప్టెన్ ర్యాంకు హోదాను పొందుతారు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 16.08.2020
- దరఖాస్తు ఫీజు: రూ.200
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.amcsscentry.gov.in
Published date : 07 Aug 2020 07:21PM