Skip to main content

సాయుధ బలగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది ఇదే..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ ఎగ్జామినేషన్‌(అసిస్టెంట్‌ కమాండెంట్స్‌(గ్రూప్‌ ఏ) 2020కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దీనిద్వారా బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌),ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ), శస్త్రసీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ)ల్లో పోస్టులను భర్తీ చేయనుంది. సీఏపీఎఫ్‌ రాత పరీక్ష డిసెంబర్‌ 20, 2020న జరుగనుంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 209
  • పోస్టుల వివరాలు: బీఎస్‌ఎఫ్‌ 78, సీఆర్‌పీఎఫ్‌ 13, సీఐఎస్‌ఎఫ్‌ 69, ఐటీబీపీ 27, ఎస్‌ఎస్‌బీ 22.
  • అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేయాలి. ఫైనల్‌ పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులకు మహిళలు, పురుషులు ఇద్దరూ అర్హులే.
  • వయసు: ఆగస్టు1, 2020 నాటికి 20–25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయో సడలింపు లభిస్తుంది.
  • ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వూ/పర్సనాలిటీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌/ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్‌ స్టాండర్డ్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
  • రాత పరీక్ష: రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌ 1 జనరల్‌ ఎబిలిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌పై 250 మార్కులకు జరుగుతుంది. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. అలాగే పేపర్‌ 2లో జనరల్‌ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్సన్‌ ఉంటాయి. దీనికి 200 మార్కులకు కేటాయించారు. పేపర్‌2లో పార్ట్‌ఏ వ్యాస రూప తరహా ప్రశ్నలు 80 మార్కులకు, పార్ట్‌ బీ కాంప్రెహెన్షన్, ప్రిసైజ్‌ రైటింగ్, కమ్యూనికేషన్‌/లాంగ్వేజ్‌ స్కిల్స్‌పై 120 మార్కులకు నిర్వహిస్తారు.

ముఖ్య సమాచారం..
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేది: 07.09.2020
  • దరఖాస్తు ఫీజు: రూ.200(మహిళలు/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది).
  • దరఖాస్తుల ఉపసంహరణ: 14.09.2020 నుంచి 20.09.2020 వరకు
  • పరీక్ష తేది: 20.12.2020
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
  • పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/, https://www.upsconline.nic.in
Published date : 19 Aug 2020 05:45PM

Photo Stories