Skip to main content

రూ.60 వేల వరకూ స్టయిపెండ్ అందించే మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్.. విధానం ఇలా..

ఎంజీఎన్‌ఎఫ్ అనేది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లు అందించే పబ్లిక్ పాలసీ మేనేజ్‌మెంట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్.
దీనిని భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రిన్యూర్‌షిప్(ఎంఎస్‌డీఈ) కలిసి రూపొందించాయి. ఐఐఎం బెంగళూర్, కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖతో కలిసి మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపిక విధానం, పరీక్షా విధానం ఇలా..

ఎంపిక విధానం..
ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం..
మల్టిఫుల్ ఛాయిస్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు.

ముఖ్యమైన సమాచారం..
  1. దరఖాస్తు విధానం : ఆన్‌లైన్
  2. దరఖాస్తులకు చివరి తేదీ : 27.03.2021
  3. అడ్మిట్ కార్డ్ : 27.03.2021
  4. పరీక్షా తేదీ : 2021 ఏప్రిల్ 3వ వారం
  5. ఫలితాలు : 2021 ఏప్రిల్ చివరి వారం
  6. పర్సనల్ ఇంటర్వ్యూ : 2021 మే 2 నుంచి నాల్గో వారం వరకు..
  7. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://www.iimb.ac.in/mgnf/


ఇంకా చదవండి: part 1: మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్.. ఎంపికైతే నెలకు రూ.60వేల వరకూ స్టయిపెండ్..

Published date : 24 Feb 2021 12:34PM

Photo Stories