రిక్రూట్‌మెంట్ ట్రెండ్స్...2018
Sakshi Education
ఇటీవల జాబ్ మార్కెట్‌లో, కార్పొరేట్ కంపెనీల రిక్రూట్‌మెంట్ విధానంలో గణనీయమైన మార్పులొస్తున్నాయి. కొత్త స్కిల్స్ నేర్చుకున్నవారికి, నేర్చుకోవాలన్న ఉత్సాహం, తపన కలిగిన వారికి మాత్రమే ఆఫర్ లెటర్లు అందుతున్నాయి.
ఇందులో భాగంగా నియామక ప్రక్రియలో టెక్నాలజీని విరివిగా వినియోగిస్తున్నారు. క్లిష్టంగా సాగే తాజా రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో సైకోమెట్రిక్ టెస్ట్‌లు, పర్సనాలిటీ టెస్ట్‌లు, గ్రూప్ డిస్కషన్స్, కేస్ స్టడీస్, రిటెన్ రిపోర్టులు, ప్రజెంటేషన్స్ వంటివి ఉంటున్నాయి. టెక్నికల్ గ్రాడ్యుయేట్‌లు వీటిని సులభంగానే అధిగమించే వీలున్నా... సంప్రదాయ డిగ్రీల అభ్యర్థులు మాత్రం కొంత మేర టెక్నికల్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది.
ఫుల్ స్టాక్ ప్రోగ్రామర్స్ :
హార్డ్‌వేర్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, సర్వర్స్, నెట్ వర్కింగ్, యూజర్ ఇంటర్‌ఫేస్, డేటాబేస్.. ఇలా ప్రతి టెక్నాలజీపైనా ఎంతోకొంత అవగాహన ఉన్న వ్యక్తినే ఫుల్‌స్టాక్ ప్రోగ్రామర్ అంటారు. ప్రస్తుతం చాలా సంస్థలు ఫుల్‌స్టాక్ ప్రోగ్రామర్స్‌ను నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. టెస్టింగ్, బిజినెస్ విభాగాలకు సంబంధించి ఆయా నిపుణులు ఉన్నప్పటికీ.. ఫుల్‌స్టాక్ ప్రోగ్రామర్స్‌ను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఈ రంగంలో ప్రవేశించాలనుకునే వారికి ఉండాల్సిన నైపుణ్యాలు.. హెచ్‌టీఎమ్‌ఎల్, సీఎస్‌ఎస్, వెబ్‌అప్లికేషన్ ఆర్కిటెక్చర్, అల్గారిథమ్స్, డేటాస్ట్రక్చర్, ఎస్‌క్యూఎల్, జావా స్క్రిప్ట్.
డిజైన్ థింకింగ్ :
రాబోయే రోజుల్లో వ్యక్తి కేంద్రంగా ఉత్పత్తులను రూపొందించేందుకు సంస్థలు ‘డిజైన్ థింకింగ్’ విధానాన్ని అవలంబించనున్నాయి. ప్రొడక్ట్ డిజైనర్‌గా రాణించాలనుకునే విద్యార్థులు.. డిజైన్ థింకింగ్ నైపుణ్యాలు నేర్పే కోర్సుల ద్వారా సంబంధిత స్కిల్స్‌ను మెరుగుపరచుకోవచ్చు. దీనికోసం పలు ప్రముఖ యూనివర్సిటీలు, మూక్స్ అందించే ఆన్‌లైన్ కోర్సులను అందిపుచ్చుకోవచ్చు. ఉదాహరణకు కొన్ని ఆన్‌లైన్ కోర్సులు... డిజైన్ థింకింగ్ ఫర్ ఇన్నోవేషన్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ డి జైన్, యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్, హ్యూమన్ సెంటర్డ్ డిజైన్, ఇంజనీరింగ్ డిజైన్.
సాఫ్ట్ స్కిల్స్..!
ఆటోమేషన్ ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయినా అది తాత్కాలికమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఆటోమేషన్‌తో భవిష్యత్తులో ఎన్నో కొత్త ప్రత్యామ్నాయ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. వాటిని అందుకోవాలంటే.. కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, పీపుల్ మేనేజ్‌మెంట్, క్రియేటివిటీ, స్ట్రాటజీ.. వంటి నైపుణ్యాలు అవసరం. ఆ దిశగా ఉద్యోగార్థులు సాధ్యమైనంత ముందుగానే ప్రయత్నాలు ప్రారంభించాలి. నిపుణుల అంచనా ప్రకారం-ఆటోమేషన్ ప్రభావం తక్కువగా ఉండే జాబ్ రోల్స్.. డేటా అనాలసిస్, మార్కెటింగ్, హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్, జనరల్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్.
కార్పొరేట్ ఎబిలిటీస్ :
ప్రైవేటు రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలంటే.. అదనపు సామర్థ్యాలు చాలా అవసరం. కార్పొరేట్ సంస్థలు అభ్యర్థుల ఆత్మవిశ్వాసం, ఒప్పించగల సామర్థ్యం, కలుపుగో లుతనం వంటి నైపుణ్యాలకు ఇటీవల అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. వీటిని పెంపొందించు కోవడానికి లీడర్‌షిప్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, టీంవర్క్ సంబంధిత అంశాల్లో శిక్షణ ఉపయోగపడుతుంది. వ్యాపార ప్రపంచంలో పరిణామాలను నిత్యం గమనించడం, విశ్లేషించడం అలవాటుచేసుకోవాలి. సబ్జెక్ట్ పరిజ్ఞానంతోపాటు పోటీలో మనల్ని ముందుంచేది ఇలాంటి అదనపు సామర్థ్యాలే అని గుర్తుంచుకోవాలంటున్నారు హెచ్‌ఆర్ నిపుణులు.

Published date : 04 Apr 2018 01:28PM