Skip to main content

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ సెకండియర్ షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో ఇలా..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.

తెలంగాణలో మే 1వ తేదీ నుంచి; ఆంధ్రప్రదేశ్‌లో మే 5వ తేదీ నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో జేఈఈ మెయిన్ సెషన్స్‌కు సైతం విద్యార్థులు సిద్ధం కావాల్సి ఉంటుంది. దాంతో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విద్యార్థుల దృష్టంతా ఇంటర్మీడియెట్ పరీక్షలతోపాటు జేఈఈ మెయిన్‌పైనే ఉండనుంది. ఈ నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియెట్ ఎంపీసీ సెకండియర్ విద్యార్థులకు ఉపయోగపడేలా సమగ్ర ప్రిపరేషన్ ప్లాన్...

పరీక్ష విధానం..
కొవిడ్ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డులు పేపర్ ప్యాట్రన్‌లో మార్పులు చేశాయి. కొత్త పేపర్ విధానం కింది విధంగా ఉండనుంది.

తెలంగాణలో ఇంటర్ ఎంపీసీ రెండో సంవత్సరం పరీక్ష విధానం

సబ్జెక్టు దీర్ఘ సమాధాన స్వల్ప సమాధాన

సబ్జెక్టు

దీర్ఘ సమాధాన

స్వల్ప సమాధాన

       ప్రశ్నలు            ప్రశ్నలు
మ్యాథ్స్-ఐఐఎ 10 ప్రశ్నలకు 12 ప్రశ్నలకు
5 రాయాలి 6 రాయాలి
మ్యాథ్స్-ఐఐబి 10 ప్రశ్నలకు 12 ప్రశ్నలకు
5 రాయాలి 6 రాయాలి
ఫిజిక్స్ 4 ప్రశ్నలకు 12 ప్రశ్నలకు
2 రాయాలి 6 రాయాలి
ఫిజిక్స్ 4 ప్రశ్నలకు 12 ప్రశ్నలకు
2 రాయాలి 6 రాయాలి

  1. ఎప్పట్లానే సెక్షన్ 3లో అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు 10 ఇస్తారు. వీటిలో ఎలాంటి ఛాయిస్ ఉండదు.


మ్యాథ్స్- ఐఐ ఎ..

  1. నూతన సిలబస్ ప్రకారం- ర్యాండమ్ వేరియబుల్స్, కాంప్లెక్స్ నంబర్స్, డీమోర్స్ థీరమ్, స్టాటిస్టిక్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, ప్రాబబిలిటీ, బైనామియల్ థీరమ్ ఛాప్టర్లు 7 మార్కుల పరంగా కీలకంగా నిలవనున్నాయి. బైనామియల్ థీరమ్‌లో (ద్విపద సిద్ధాంతం)లో అధిక భాగం తొలగించడం జరిగింది. వీటితోపాటు సంకలన, గుణకలన సిద్ధాంతాలు, ఇచ్చిన పట్టిక నుంచి కె, మధ్యమం, విస్తృతి కనుగొనుట, ఏపీ, జీపీ హెచ్‌పీలను ముఖ్యమైనవిగా భావించాలి.
  2. పస్తారాలు, సంయోగాల నుంచి 4, 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ర్యాంక్ కనుగొనుట, సమ్ ఆఫ్ నంబర్స్, కమిటీ ప్రాబ్లమ్స్ చాలా కీలకం. వర్గ సమీకరణ మొదటి రెండు సిద్ధాంతాలు, గరిష్ట, కనిష్ట విలువలు, వ్యాప్తి కనుగొనుట కీలకమైనవిగా గుర్తించాలి.

మ్యాథ్స్- ఐఐ బి..
విద్యార్థులు ఈ పేపర్‌ను కఠినంగా భావిస్తారు. కానీ, వీటిలో ప్రామాణిక ప్రశ్నలను మాత్రమే పరీక్షలో ఇస్తున్నారు. పైగా ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి. కాబట్టి విద్యార్థులు గత మూడేళ్ల పేపర్లను బాగా ప్రాక్టీస్ చేయాలి. సర్కిల్స్, ఇంటెగ్రల్, డిఫరెన్షియల్ ఇంటెగ్రల్‌లో ఎక్కువగా 7 మార్కుల ప్రశ్నలు వస్తున్నాయి. ఎక్లిప్స్, హైపర్ బోలా, ఫంక్షన్స్ కనుగొనుటపై తప్పనిసరిగా ప్రశ్నలను అడుగుతారు.

ఫిజిక్స్..
ఆప్టిక్స్, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, వేవ్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇండక్షన్, సెమి కండక్టర్ డివెజైస్ ఛాప్టర్లకు అధిక వెయిటేజీ లభిస్తుంది. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, రోల్ ఆఫ్ సెమికండక్టర్ డివెజైస్, ఎలక్ట్రోస్టాటిక్ వేవ్ మోషన్, ట్రాన్సిస్టర్, ట్రాన్స్‌వెర్స్ లాంగిట్యూడ్ వేవ్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. రెండు మార్కుల పరంగా డైఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, గాల్వనోమెట్రి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ తదితరం ముఖ్యమైనవి.

కెమిస్ట్రీ..
ఇందులో ఎక్కువ ఛాప్టర్లు ఉండటంతో విద్యార్థులు కష్టంగా భావిస్తుంటారు. ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. తెలుగు అకాడెమీ పుస్తకాలను సమగ్రంగా చదివితే.. 2మార్కుల ప్రశ్నలను వంద శాతం సాధించగలరు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో..నేమ్డ్ రియాక్షన్స్, ఆల్డల్ కండెన్షేషన్, విలియంసన్ సింథసిస్, ఆక్సిజన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్, కోబ్స్ రియాక్షన్, అమ్మోనియా ప్రిపరేషన్, హాలెన్ మెథడ్ తదితరాలను కీలకంగా భావించాలి.
 
Published date : 16 Feb 2021 03:10PM

Photo Stories