ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం... నిబంధనలు
Sakshi Education
‘ఇంటికొక్కరైనా ఉన్నత చదువులు చదవాలి. ఇంజనీరింగ్, డాక్టర్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివి.. వృత్తి నిపుణులుగా ఎదగాలి.. అప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది.. సమాజం ప్రగతి సాధిస్తుంది.. అని నమ్మిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకానికి 2008లో శ్రీకారం చుట్టారు.
ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, పీజీ .. ఇలా ఆయా కోర్సులకు వేలకువేలు ఫీజులు చెల్లించి చదివే స్థోమతలేని ప్రతిభావంతులకు చేయూత ఇవ్వాలనే సమున్నత ఆశయంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి వైఎస్ నాంది పలికారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పథకం ద్వారా విద్యార్థులు ఫీజుల గురించి ఆందోళన చెందకుండా చదువుకునే భరోసా ఇవ్వాలని సంకల్పించారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రీయింబర్స్ పథకం కొనసాగుతున్నప్పటికీ.. అనేక నిబంధనల కారణంగా పూర్తిగా ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదంటున్నారు విద్యార్థులు. ఒకవైపు వృత్తి విద్యా కోర్సుల్లో ఫీజులు ఏటేటా పెరుగుతూ చదువు భారంగా మారుతుంటే... మరోవైపు ప్రభుత్వాలు అరకొర మాత్రమే ఫీజు రీయింబర్స్ చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై, తాజాగా ఇంజనీరింగ్, మెడికల్ తదితర కోర్సులకు కౌన్సెలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం, నిబంధనలు, అమలు తీరుతెన్నులు తెలుసుకుందాం..
రీయింబర్స్‌మెంట్ కోర్సులివే..
డిగ్రీ కోర్సులు, ఇతర డిగ్రీ స్థాయి కోర్సులు(అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఫైన్‌ఆర్‌ట్స, హార్టికల్చర్, లా, మేనేజ్‌మెంట్, మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మసీ), పలు డిప్లొమా కోర్సులు, డిప్లొమా ఎడ్యుకేషన్, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాములు, ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్ పీజీ, ఇంటర్మీడియెట్, ఐటీఐ, ఎంఫిల్, పారామెడికల్, పీజీ, పీజీ అగ్రికల్చర్, పీజీ డిప్లొమా, పీజీ ఎడ్యుకేషన్, పీజీ ఇంజనీరింగ్, పీజీ ఫైన్‌ఆర్‌ట్స, పీజీ లా, పీజీ మేనేజ్‌మెంట్, ఎంసీఏ, పీజీ మెడికల్, పీజీ నర్సింగ్, పీజీ పారామెడికల్, పీజీ ఫార్మసీ, పీహెచ్‌డీ, పాలిటెక్నిక్, వెటర్నరీ సైన్‌స తదితర కోర్సుల్లో చేరిన విద్యార్థులు.. నిబంధనల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే అవకాశముంది.
గరిష్ట ఆదాయ పరిమితి :
ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపులో విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
ఫీజు ఎంతున్నా.. ఇచ్చేది కొంతే !
ప్రస్తుతం ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రయివేటు కాలేజీల్లో ఫీజులు లక్షల్లోనే ఉంటున్నాయి. ఎంసెట్, ఐసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో పది వేలలోపు ర్యాంకు వచ్చిన వారికి పూర్తిగా ఫీజురీయింబర్స్‌మెంట్ ఇస్తామని ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే ఈబీసీ, బీసీ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌లో పలు నిబంధనలు విధించారు. అవి.. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదివిన ఈబీసీ, బీసీ విద్యార్థులకు మాత్రమే.. ప్రొఫెషనల్ కోర్సుల్లో పూర్తి ఫీజు రీయింబర్‌్నమెంట్ అందుతుంది. ఇక ఎంసెట్‌లో, ఐసెట్‌లో పదివేల లోపు ర్యాంకు, ఈసెట్‌లో వెయి్యలోపు ర్యాంకు పొందిన ఈబీసీ, బీసీ విద్యార్థులకు పూర్తి రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తున్నారు. పదివేల ర్యాంకు దాటితే.. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంత ఫీజు ఉన్నా.. జనరల్ విద్యార్థులకు (ఎస్సీ, ఎస్టీలు మినహాయించి) రూ.35వేల ఫీజురీయింబర్స్‌మెంట్ మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆయా కాలేజీల్లో రూ.35వేల కంటే ఎక్కువున్న ఫీజులను విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. రూ.1.60 లక్షల ఫీజున్న కాలేజీలో చేరితే ప్రభుత్వం కేవలం రూ.35వేలు చెల్లిస్తుంది. మిగిలిన రూ.1.25 లక్షల ఫీజు విద్యార్థులే భరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏల్లోనూ పదివేల లోపు ర్యాంకు దాటితే రూ.27వేలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని విద్యార్థులే సమకూర్చుకోవాలి. ఈసెట్‌లో (నేరుగా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్‌లో ఎంట్రీకి) వెయి్యలోపు ర్యాంకు వారికి మాత్రమే ఫీజు మొత్తం లభిస్తుంది. అంతకంటే ఎక్కువ ర్యాంకు వస్తే రూ.35 వేలు మాత్రమే అందుతుంది. మిగతా మొత్తాన్ని విద్యార్థులు సొంతంగా భరించాలి. కన్వీనర్ కోటా వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుతుంది.
వీరికి నో రీయింబర్స్‌మెంట్ :
ఆన్‌లైన్ కోర్సులు, పార్ట్‌టైం కోర్సులు చదివే వారికి; స్పాన్సర్డ్ కోటా, మేనేజ్‌మెంట్ కోటాలో చేరే విద్యార్థులకు; ఇతర పథకాల ద్వారా రీయింబర్స్‌మెంట్ కంటే ఎక్కువ స్టయిఫండ్ పొందుతున్న విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయరు. అలానే ఇంటర్, తత్సమాన కోర్సులు చదివే ఈబీసీ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ అందదు.
భరోసా లేదు.. సందేహాలెన్నో!
వాస్తవానికి ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకం లక్ష్యం.. విద్యార్థులకు భరోసాగా నిలవడం.. విద్యార్థులు పై చదువుల వైపు అడుగులు వేయడానికి ధైర్యం ఇవ్వడం. ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ వరకూ.. ఆర్థిక చేయూ తనిస్తూ అండగా నిలవడం ఈ పథకం ప్రధాన ఆశయం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని కాలేజీల్లో విద్యార్థులందరికీ రీయింబర్స్‌మెంట్ అందించే వారు. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల్లో ఒక్కో కళాశాలలో ఒక్కోరకంగా భారీగా ఫీజులు ఏటేటా పెరుగుతున్నాయి. ఉదాహరణకు ఇంజనీరింగ్ ఫీజు..రూ.35వేల నుంచి రూ.1.60 లక్షల వరకు ఉంది. మరోవైపు రకరకాల నిబంధనల కారణంగా పూర్తిస్థాయిలో సకాలంలో ఫీజురీయింబర్స్‌మెంట్ అందే పరిస్థితి కనిపించడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. రీయింబర్స్‌మెంట్ అందుతుందో లేదో, ఒక వేళ అందితే ఎంతమేరకు అందుతుంది.. సకాలంలో అందుతుందా..? ఇలా అనేక సందేహాలు ఇప్పుడు కొత్త విద్యాసంవత్సరంలో వివిధ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల్లో నెలకొన్నాయి.
చెల్లింపులు చేయక...అవకాశాలు చేజారి..
ఫీజురీయింబర్స్‌మెంట్ అందుతుందో లేదో అనే ఆందోళన ఒకవైపు ఉంటే... మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ లభిస్తుందున్న ఆశతో కోర్సులో చేరిన విద్యార్థులు... సరైన సమయంలో ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కోర్సు పూర్తయ్యాక కూడా ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు అందకపోవడంతో కాలేజీలు విద్యార్థులకు టీసీలు, సర్టిఫికెట్‌లు ఇవ్వడంలేదు. ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని ఒత్తిడి చేస్తుండటంతో చాలామంది విద్యార్థులు ఉన్నత విద్య కోర్సుల్లో చేరలేకపోతున్నారు. తద్వారా ప్రతిభ ఉండి కూడా ..ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సవ్యంగా అమలుకాని కారణంగా అమూల్యమైన అవకాశాలను చేజార్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత (2017-18) విద్యా సంవత్సరంలో చెల్లించాల్సిన ఫీజురీయింబర్స్‌మెంట్ రుసుముల మొత్తం రూ.2035.11 కోట్లు. అయితే ఇప్పుటివరకు పలు దఫాలుగా విడుదలైనది రూ.1456.14 కోట్లు. ఇంకా రూ.578.97 కోట్లు విడుదల కావాల్సి ఉంది. అయితే పేరుకు నిధులు విడుదలైనట్లు చెబుతున్నప్పటికీ చెల్లింపులు చేయడం లేదని.. దాంతో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని పేర్కొంటున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గత (2017-18) విద్యా సంవత్సరంలో రూ.1529 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. విడుదలైంది రూ.760 కోట్లు. ఫీజు రీయింబర్‌సమెంట్ నిధులు విడుదల ఆలస్యం కావడంతో చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దాంతో ఫీజురీయింబర్స్‌మెంట్ అర్హత పొందిన విద్యార్థులు.. కోర్సు పూర్తయిన తర్వాత ఉన్నత విద్యావకాశాలను వదులుకోవాల్సి వస్తోంది.
గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి :
ఫీజురీయింబర్స్ కోరుకునే విద్యార్థులు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా కోర్సులో అడ్మిషన్ పొందిన నెల రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ విద్యార్థులు ఈ పాస్ వెబ్‌సైట్ ద్వారా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు జ్ఞానభూమి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ విద్యార్థులు ఫీజురీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్ https://telanganaepass.cgg.gov.in అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఫీజురీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్: https://jnanabhumi.ap.gov.in
ఈ పాస్‌తో అనుసంధానం:
విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ వివరాలతో కూడిన డేటాబేస్ ఉండే ఈ పాస్ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాది నుంచి పలుమార్లు ఆన్‌లైన్లో వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇంటర్మీడియట్ హాల్‌టికెట్ నంబర్‌తో విద్యార్థుల పూర్తి డేటా డెరైక్ట్‌గా వచ్చేస్తుంది. అలాగే, దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ), ఇతర సైట్స్‌ను ఈ పాస్‌తో అనుసంధానం చేయబోతున్నాం. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లో చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు
కల్పించనున్నాం.
- పి.కరుణాకర్, డెరైక్టర్ ఆఫ్ ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, తెలంగాణ.

- ఏపీలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. అలాగే బీసీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష కంటే తక్కువగా ఉండాలి.
- తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఆదాయ పరిమితి రూ.1.50 లక్షలు; పట్టణ ప్రాంతాల్లో ఉండే అభ్యర్థులకు రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఈబీసీ, దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షలోపు ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.
ఫీజు ఎంతున్నా.. ఇచ్చేది కొంతే !
ప్రస్తుతం ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రయివేటు కాలేజీల్లో ఫీజులు లక్షల్లోనే ఉంటున్నాయి. ఎంసెట్, ఐసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో పది వేలలోపు ర్యాంకు వచ్చిన వారికి పూర్తిగా ఫీజురీయింబర్స్‌మెంట్ ఇస్తామని ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే ఈబీసీ, బీసీ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌లో పలు నిబంధనలు విధించారు. అవి.. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదివిన ఈబీసీ, బీసీ విద్యార్థులకు మాత్రమే.. ప్రొఫెషనల్ కోర్సుల్లో పూర్తి ఫీజు రీయింబర్‌్నమెంట్ అందుతుంది. ఇక ఎంసెట్‌లో, ఐసెట్‌లో పదివేల లోపు ర్యాంకు, ఈసెట్‌లో వెయి్యలోపు ర్యాంకు పొందిన ఈబీసీ, బీసీ విద్యార్థులకు పూర్తి రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తున్నారు. పదివేల ర్యాంకు దాటితే.. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంత ఫీజు ఉన్నా.. జనరల్ విద్యార్థులకు (ఎస్సీ, ఎస్టీలు మినహాయించి) రూ.35వేల ఫీజురీయింబర్స్‌మెంట్ మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆయా కాలేజీల్లో రూ.35వేల కంటే ఎక్కువున్న ఫీజులను విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. రూ.1.60 లక్షల ఫీజున్న కాలేజీలో చేరితే ప్రభుత్వం కేవలం రూ.35వేలు చెల్లిస్తుంది. మిగిలిన రూ.1.25 లక్షల ఫీజు విద్యార్థులే భరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏల్లోనూ పదివేల లోపు ర్యాంకు దాటితే రూ.27వేలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని విద్యార్థులే సమకూర్చుకోవాలి. ఈసెట్‌లో (నేరుగా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్‌లో ఎంట్రీకి) వెయి్యలోపు ర్యాంకు వారికి మాత్రమే ఫీజు మొత్తం లభిస్తుంది. అంతకంటే ఎక్కువ ర్యాంకు వస్తే రూ.35 వేలు మాత్రమే అందుతుంది. మిగతా మొత్తాన్ని విద్యార్థులు సొంతంగా భరించాలి. కన్వీనర్ కోటా వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుతుంది.
వీరికి నో రీయింబర్స్‌మెంట్ :
ఆన్‌లైన్ కోర్సులు, పార్ట్‌టైం కోర్సులు చదివే వారికి; స్పాన్సర్డ్ కోటా, మేనేజ్‌మెంట్ కోటాలో చేరే విద్యార్థులకు; ఇతర పథకాల ద్వారా రీయింబర్స్‌మెంట్ కంటే ఎక్కువ స్టయిఫండ్ పొందుతున్న విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయరు. అలానే ఇంటర్, తత్సమాన కోర్సులు చదివే ఈబీసీ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ అందదు.
భరోసా లేదు.. సందేహాలెన్నో!
వాస్తవానికి ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకం లక్ష్యం.. విద్యార్థులకు భరోసాగా నిలవడం.. విద్యార్థులు పై చదువుల వైపు అడుగులు వేయడానికి ధైర్యం ఇవ్వడం. ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ వరకూ.. ఆర్థిక చేయూ తనిస్తూ అండగా నిలవడం ఈ పథకం ప్రధాన ఆశయం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని కాలేజీల్లో విద్యార్థులందరికీ రీయింబర్స్‌మెంట్ అందించే వారు. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల్లో ఒక్కో కళాశాలలో ఒక్కోరకంగా భారీగా ఫీజులు ఏటేటా పెరుగుతున్నాయి. ఉదాహరణకు ఇంజనీరింగ్ ఫీజు..రూ.35వేల నుంచి రూ.1.60 లక్షల వరకు ఉంది. మరోవైపు రకరకాల నిబంధనల కారణంగా పూర్తిస్థాయిలో సకాలంలో ఫీజురీయింబర్స్‌మెంట్ అందే పరిస్థితి కనిపించడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. రీయింబర్స్‌మెంట్ అందుతుందో లేదో, ఒక వేళ అందితే ఎంతమేరకు అందుతుంది.. సకాలంలో అందుతుందా..? ఇలా అనేక సందేహాలు ఇప్పుడు కొత్త విద్యాసంవత్సరంలో వివిధ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల్లో నెలకొన్నాయి.
చెల్లింపులు చేయక...అవకాశాలు చేజారి..
ఫీజురీయింబర్స్‌మెంట్ అందుతుందో లేదో అనే ఆందోళన ఒకవైపు ఉంటే... మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ లభిస్తుందున్న ఆశతో కోర్సులో చేరిన విద్యార్థులు... సరైన సమయంలో ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కోర్సు పూర్తయ్యాక కూడా ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు అందకపోవడంతో కాలేజీలు విద్యార్థులకు టీసీలు, సర్టిఫికెట్‌లు ఇవ్వడంలేదు. ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని ఒత్తిడి చేస్తుండటంతో చాలామంది విద్యార్థులు ఉన్నత విద్య కోర్సుల్లో చేరలేకపోతున్నారు. తద్వారా ప్రతిభ ఉండి కూడా ..ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సవ్యంగా అమలుకాని కారణంగా అమూల్యమైన అవకాశాలను చేజార్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత (2017-18) విద్యా సంవత్సరంలో చెల్లించాల్సిన ఫీజురీయింబర్స్‌మెంట్ రుసుముల మొత్తం రూ.2035.11 కోట్లు. అయితే ఇప్పుటివరకు పలు దఫాలుగా విడుదలైనది రూ.1456.14 కోట్లు. ఇంకా రూ.578.97 కోట్లు విడుదల కావాల్సి ఉంది. అయితే పేరుకు నిధులు విడుదలైనట్లు చెబుతున్నప్పటికీ చెల్లింపులు చేయడం లేదని.. దాంతో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని పేర్కొంటున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గత (2017-18) విద్యా సంవత్సరంలో రూ.1529 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. విడుదలైంది రూ.760 కోట్లు. ఫీజు రీయింబర్‌సమెంట్ నిధులు విడుదల ఆలస్యం కావడంతో చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దాంతో ఫీజురీయింబర్స్‌మెంట్ అర్హత పొందిన విద్యార్థులు.. కోర్సు పూర్తయిన తర్వాత ఉన్నత విద్యావకాశాలను వదులుకోవాల్సి వస్తోంది.
గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి :
ఫీజురీయింబర్స్ కోరుకునే విద్యార్థులు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా కోర్సులో అడ్మిషన్ పొందిన నెల రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ విద్యార్థులు ఈ పాస్ వెబ్‌సైట్ ద్వారా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు జ్ఞానభూమి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ విద్యార్థులు ఫీజురీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్ https://telanganaepass.cgg.gov.in అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఫీజురీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్: https://jnanabhumi.ap.gov.in
ఈ పాస్‌తో అనుసంధానం:
విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ వివరాలతో కూడిన డేటాబేస్ ఉండే ఈ పాస్ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాది నుంచి పలుమార్లు ఆన్‌లైన్లో వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇంటర్మీడియట్ హాల్‌టికెట్ నంబర్‌తో విద్యార్థుల పూర్తి డేటా డెరైక్ట్‌గా వచ్చేస్తుంది. అలాగే, దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ), ఇతర సైట్స్‌ను ఈ పాస్‌తో అనుసంధానం చేయబోతున్నాం. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లో చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు
కల్పించనున్నాం.
- పి.కరుణాకర్, డెరైక్టర్ ఆఫ్ ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, తెలంగాణ.
Published date : 26 Jun 2018 06:34PM