పర్యాటక కోర్సులు చదివిన వారికి ఉపాధి కల్పనలో భారత్ స్థానం ఎంతో తెలుసా?
విభిన్న సంస్కృతులు, చారిత్రక కట్టడాలకు, దర్శనీయ ప్రాంతాలకు నెలవైన భారత్‌ను సందర్శించాలనే తపనే ఇందుకు కారణమని ఈ రంగంలోని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎకో, హెల్త్, అగ్రి టూరిజం..
మన దేశంలో పర్యాటక రంగం విస్తరించడానికి ప్రధానంగా ఎకో టూరిజం, హెల్త్ టూరిజం విధానాలు తోడ్పడుతున్నాయి. ఎకో టూరిజం పేరిట వేల సంఖ్యలో పర్యాటకులు చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి అందాలకు నెలవైన ప్రాంతాల సందర్శనకు వస్తున్నారు. హెల్త్ టూరిజం విధానం ప్రకారం-వివిధ దేశాలకు చెందిన రోగులు చికిత్స కోసం భారత్‌కు వస్తున్నారు.
మానవ వనరుల కొరత..
పర్యాటకులను మెప్పించాలంటే.. ప్రత్యేక నైపుణ్యాలు కావాలి. ఆన్‌లైన్ రిజర్వేషన్‌తో మొదలయ్యే టూర్ ప్రక్రియలో పర్యాటకులు తమ ప్రయాణం పూర్తి చేసుకునే వరకూ.. నిరంతరం వారికి చేదోడు వాదోడుగా ఉండే నిపుణుల అవసరం ఉంటుంది. కాని దేశంలో టూరిజం రంగంలో నిపుణులైన మానవ వనరుల కొరత ఎక్కువగా ఉంది.
ఇంకా చదవండి: part 5: ఈ రంగంలో పెరుగుతున్న జాబ్ సీకర్స్.. వివరాలు తెలుసుకోండిలా..