ప్రతి సమస్యను ఇతర అంశాలతో అనుసంధాన్నిస్తూ ప్రాక్టీస్ చేస్తే.. మ్యాథ్స్‌లో మంచి మార్కులు సాధించడం సులువే..
ఇంతటి కీలకమైన పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి.. ఈ ఏడాది(2021) తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ షెడ్యూల్ ఖరారైంది. కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాస్‌లు, సిలబస్ కుదింపునకు అనుగుణంగా పరీక్షల విధానంలో పలు మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో.. మ్యాథమెటిక్స్లో10/10 జీపీఏ సాధించేందుకు మార్గాలు ఇవే..
ప్రతి చాప్టర్‌ను కుదించిన సిలబస్‌కు అనుగుణంగా పూర్తిగా అధ్యయనం చేయాలి. ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యా వ్యవస్థ; బీజ గణితం; నిరూపక రేఖాగణితం; రేఖాగణితం; క్షేత్రమితి; త్రికోణమితి; సంభావ్యత, సాంఖ్యకశాస్త్రంపై పట్టు సాధించడం ఎంతో మేలు చేస్తుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంతోపాటు కారణాల నిరూపణ, వ్యక్తీకరణ, ఒక సమస్యను ఇతర అంశాలతో అనుసంధానం చేయడం వంటి నైపుణ్యాలు పొందాలి. ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే.. రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది. టెక్స్ట్‌బుక్‌లో ప్రతి చాప్టర్ చివరన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. గ్రాఫ్‌లు, నిర్మా ణాత్మక సమస్యలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవ సంఖ్యలు; సమితులు; బహుపదులు; రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత అధ్యాయాలలోని గ్రాఫ్ ఆధారిత సమస్యలు; సంభావ్యత; సాంఖ్య కశాస్త్రం; త్రికోణమితి; క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలను సాధన చేయాలి.
- వై.వనంరాజు, సబ్జెక్ట్ టీచర్
ఇంకా చదవండి: part 5: పదో తరగతి సైన్స్ పేపర్లు రెండింట్లో.. విజయం సాధించండిలా..