Skip to main content

పల్లె విద్యార్థులకు గుడ్‌న్యూస్..నవోదయల్లో ప్రవేశాలు..దరఖాస్తు చేసుకోండిలా

గ్రామీణ విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటయ్యాయి.
వీటిలో ఇంటర్మీడియట్(10+2) వరకు ఉచిత విద్యతో పాటు, వసతి, భోజనం సైతం ఉచితంగా అందిస్తారు. బోధనలో ప్రమాణాల పరంగా నవోదయ విద్యాలయాలకు మంచి పేరుంది. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరం (2021-22)లో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఇటీవల నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో.. నవోదయ విద్యాలయాల్లో ప్రవేశ విధి విధానాలను తెలుసుకుందాం..

ప్రవేశం ఇలా..
నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లో మొత్తం 661 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో(ఏపీ 15, తెలంగాణ 9) 24 విద్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం(2020-21)లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ‘జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్- (జేఎన్‌వీఎస్‌టీ)’ రాయవచ్చు. వీరిలో ప్రతిభ చూపినవారికి ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు. ఏ జిల్లాలో ప్రవేశం పొందాలనుకుంటున్నారో.. వారు ప్రస్తుతం అదే జిల్లాలో చదువుతూ ఉండాలి. ఒక్కో నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో 80 మందికి ప్రవేశం కల్పిస్తారు. వీరిలో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతంలో మూడు నుంచి ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలు, లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు కేటారుుస్తారు. మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయించారు. కాగా ఆయా సామాజిక వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తారు.

విద్య, వసతి ఉచితం :
  • నవోదయ విద్యాలయ సమితి ఆధ్వరంలోని అన్ని స్కూళ్లల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌లో బోధన ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బాలికలకు ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియెట్(10+2) వరకు ఉచిత విద్యతోపాటు, వసతి, భోజనం, యూనిఫారం, పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందిస్తారు.
  • అన్ రిజర్వుడు విద్యార్థులు మాత్రం తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు నెలకు రూ.600 ఫీజుగా చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది.
  • విద్యార్థులు ఎనిమిదో తరగతి వరకు మాతృ భాషలో చదువుకోవచ్చు. తొమ్మిదో తరగతి నుంచి ఇంగ్లిష్ మాధ్యమంలోనే చదువు కొనసాగుతుంది.
  • ఇక్కడ విద్యార్థులకు నీట్, జేఈఈ వంటి జాతీయ స్థారుు పరీక్షల్లో రాణించేలా శిక్షణ అందిస్తున్నారు.
పరీక్ష విధానం ఇలా..
  • నవోదయ ప్రవేశ పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మాతృభాష(తెలుగు)లోను రాసే వీలుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్(ఆబ్జెక్టివ్) విధానంలో అంటే ప్రతి ప్రశ్నకు నాలుగు జవాబులు ఇచ్చి, వాటిలో సరైంది ఏదో గుర్తించమంటారు. ప్రశ్న పత్రం మూడు సెక్షన్లలో 80 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు-100 మార్కులకు ఉంటాయి. అంటే ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు కేటాచారు. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్షను రెండు గంటల్లో పూర్తి చేయాలి.
  • సెక్షన్-1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌లో.. 40 ప్రశ్నలు- 50 మార్కులకు అడుగుతారు. వీటిని ఒక గంటలో పూర్తి చేయాలి.
  • సెక్షన్-2 అర్థమెటిక్ టెస్ట్‌లో.. 20 ప్రశ్నలు- 25 మార్కులకు ఉంటారుు. వీటిని 30 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.
  • సెక్షన్-3 లాంగ్వేజ్ టెస్ట్.. 20 ప్రశ్నలు- 25 మార్కులకు ఉంటుంది. వీటికి 30 నిమిషాల సమయం కేటారుుంచారు.
  • సమాధానాలను ఓఎంఆర్ షీట్‌పై బ్లాక్ లేదా బ్లూ బాల్‌పారుుంట్ పెన్నుతో ఆప్షన్ బాక్సులో మార్కింగ్ చేయాలి.
  • పరీక్షలో అర్హత పొందాలంటే.. ప్రతి సెక్షన్‌లోనూ కనీస మార్కులు సాధించాలి.
మెంటల్ ఎబిలిటీ :
ఇందులో చిత్రాలు, రేఖలు, బొమ్మలపై ప్రశ్నలు ఉంటారుు. ఈ సెక్షన్‌లో 10 భాగాలుంటారుు. ఒక్కో భాగంలో నాలుగు ప్రశ్నలు చొప్పున అడుగుతారు. ప్రశ్నల్లో కొన్ని చిత్రాలు ఇచ్చి.. వాటిలో భిన్నమైనది ఏదో గుర్తించమంటారు. ఒక అసంపూర్ణ చిత్రం లేదా గ్రాఫ్ ఇచ్చి.. అది సంపూర్ణం కావడానికి ఇచ్చిన ఆప్షన్లలో ఏది సరిపోతుందో గుర్తించాల్సి ఉంటుంది. చిత్రాలు/బొమ్మల క్రమాన్ని ఇచ్చి.. తర్వాత వచ్చే దాన్ని గుర్తించడం వంటి రీతిలో ప్రశ్నలు ఉంటారుు.

అర్థమెటిక్ :
ఈ విభాగం ముఖ్య ఉద్దేశం.. అభ్యర్థి ప్రాథమిక సామర్థ్యాలను గుర్తించడం. ఇందులో అడిగే 20 ప్రశ్నలు.. సంఖ్య-సంఖ్యా వ్యవస్థ, భిన్న సంఖ్యలు, గుణకారాలు, భాగాహారాలు, కూడికలు, తీసివేతలు, దత్తాంశాలు, పొడవు, ద్రవ్యరాశి, సామర్థ్యం, కాలం, డబ్బు-వడ్డీ, లాభనష్టాలు, చుట్టుకొలతలు, ప్రాంతం, వాల్యూమ్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటారుు.

లాంగ్వేజ్ టెస్ట్ :
విద్యార్థి పఠన శక్తిని అంచనా వేసే రీతిలో ఈ విభాగం ఉంటుంది. ఇందులో మొత్తం నాలుగు ప్యాసేజీలు ఉంటారుు. ప్రతి ప్యాసేజీ తరువాత 5 ప్రశ్నలు అడుగుతారు. విద్యార్థి ప్రతి భాగాన్ని జాగ్రత్తగా చదివి.. ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అన్ని ప్రశ్నలు మల్టిపుల్ చారుుస్ విధానంలోనే ఉంటారుు.

ముఖ్య సమాచారం ఇలా..
అర్హత: 2020-21 విద్యాసంవత్సరానికి 5వ తరగతి చదువుతుండాలి.
వయసు: 01.05.2008 నుంచి 30.04.2012 మధ్య జన్మించినవారు అర్హులు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.12.2020
పరీక్ష తేదీ: 10 ఏప్రిల్ 2021(ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు)
వివరాలు, రిజిస్ట్రేషన్‌కు: www.navodaya.gov.in
(లేదా)
www.navodaya.gov.in/nvs/en/Admission-JNVST/JNVST-class
Published date : 03 Nov 2020 03:51PM

Photo Stories