పిల్లల్లో నైపుణ్యాలు వెలికితిసే టీసీఎస్ ‘ఇంటెలిజెమ్’ నోటిఫికేషన్ విడుదల.. అర్హత వివరాలు ఇవిగో..
Sakshi Education
నేటి తరం పిల్లలకు టెక్నాలజీపై మక్కువ ఎక్కువ. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే.. గేమ్స్ నుంచి యాప్స్ దాకా ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. పదేళ్లు కూడా నిండకుండానే కోడింగ్ నేర్చుకుంటున్నారు.
సరికొత్త యాప్స్‌ను ఎలా వినియోగించాలో పెద్దవాళ్లకే పాఠాలు చెబుతున్నారు. ఇలాంటి చిచ్చర పిడుగుల్లోని ప్రతిభను ప్రోత్సహించి.. వారిలో సాంకేతిక నైపుణ్యాలను మరింతగా తీర్చిదిద్దేందుకు ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్).. ‘ఇంటెలిజెమ్’ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. తాజాగా 2020-21 విద్యాసంవత్సరానికి ఇంటెలిజెమ్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులకు ప్రకటన వెలువడిన నేపథ్యంలో పూర్తి సమాచారం..
ప్రతిభకు ప్రోత్సాహం..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్).. టీసీఎస్ అయాన్ నిర్వహించే ‘‘ఇంటెలిజెమ్’’ జాతీయ స్థాయి పోటీల కోసం రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. ఇందులో ముందుగా రూపొందించిన ప్రక్రియ ప్రకారం పిల్లల్లో నైపుణ్యాలు పెంపొందిస్తారు. పాఠశాల స్థాయి నుంచే టెక్నాలజీపై పట్టు సాధించేలా ప్రోత్సహించనున్నట్లు నిర్వాహక సంస్థ చెబుతోంది. పోటీలో భాగంగా విద్యార్థులకు 21వ శతాబ్దం నైపుణ్యాలైన ‘క్రియేటివిటీ, ఇన్నోవేషన్, కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ లిటరసీ, యూనివర్సల్ వాల్యూస్, గ్లోబల్ సిటిజన్‌షిప్’పై శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పిస్తారు.
అర్హతలు..
ఈ పోటీల్లో 5 నుంచి 9 తరగతులు చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చు. టీసీఎస్ అయాన్ ఇంటెలిజెమ్ పోటీల్లో పేర్లు నమోదు చేసుకోసుకునేందుకు ప్రతి విద్యార్థికి ఈమెయిల్ ఐడీ ఉండాలి. దానితోనే సంస్థ డిజిటల్ లెర్నింగ్ హబ్ ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయగలరు. పాఠశాల నమోదు లేకుండా విద్యార్థుల వివరాలు నమోదు చేయలేరు. స్కూల్ రిజిస్ట్రేషన్ తరువాత, ఒక ప్రత్యేకమైన ఐడీ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ నంబర్‌తో మాత్రమే విద్యార్థులు తమ పేర్లను పోటీకీ నమోదు చేసుకోగలరు.
ఇంకా చదవండి: part 2: టీసీఎస్ ‘ఇంటెలిజెమ్’ పోటీ వివరాలు తెలుసుకోండి.. మీ పిల్లలను ప్రోత్సాహించండి..

Published date : 21 Nov 2020 04:45PM