‘పీహెచ్‌డీ’లో ప్రవేశానికి మార్గాలు..
Sakshi Education
పీహెచ్‌డీ.. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. డాక్టోరల్ డిగ్రీ అని పిలుస్తారు. వాస్తవానికి అకడెమిక్‌గా అత్యున్నత కోర్సు.. పీహెచ్‌డీ.
సహనంతో శ్రమించి పూర్తిచేస్తే.. పీహెచ్‌డీతో ఉజ్వల కెరీర్ సొంతమవడం ఖాయం. ముఖ్యంగా కొన్ని స్పెషలైజేషన్స్‌తో పీహెచ్‌డీ చేస్తే.. జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అలాంటి పీహెచ్‌డీలో చేరిన స్కాలర్స్‌కు యూజీసీ(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఫెలోషిప్పుల మొత్తాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో రీసెర్చ్ స్కాలర్స్‌కు పెరిగిన ఫెలోషిప్పుల వివరాలతోపాటు పీహెచ్‌డీలో చేరేందుకు అందుబాటులో ఉన్న మార్గాలు.. పీహెచ్‌డీతో కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం...
ఫెలోషిప్పుల పెంపు :
ఐఐటీ, ఏఐఐఎంఎస్, ఐసర్, ఐఐఎస్సీతోపాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇతర యూనివర్సిటీల రీసెర్చ్ స్కాలర్లు ఫెలోషిప్‌లు(జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్) పెంచాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. దాంతో పీహెచ్‌డీ అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఫెలోషిప్‌లు పెంచుతున్నట్లు ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. అలా పెంచిన ఫెలోషిప్పుల అమలు గురించి యూజీసీ తాజాగా(జూన్ 3న జరిగిన సమావేశంలో) నోటిఫై చేసింది. సైన్స్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్‌కు సంబంధించి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్) ప్రస్తుతం నెలకు ఇస్తున్న రూ.25వేల నుంచి రూ.31వేలకు; అలాగే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(ఎస్‌ఆర్‌ఎఫ్) ప్రస్తుతం అందిస్తున్న రూ.28వేల నుంచి రూ.35వేలకు పెంచుతున్నట్లు తెలిపింది. ఫెలోషిప్పుల పెంపు 2019, జనవరి1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. దీనివల్ల దేశవ్యాప్తంగా పీహెచ్‌డీ చదువుతున్న దాదాపు 60వేల మంది రీసెర్చ్ స్కాలర్స్‌కు ప్రయోజనం చేకూరుతుంది. విద్యార్థులు మాత్రం తాము 60 శాతం పెంపు అడిగితే 20 శాతం మాత్రమే పెంచారని పేర్కొంటున్నారు.
ఫెలోషిప్ మొత్తాల పెంపు ఇలా...
పీహెచ్‌డీకి మార్గాలు..
పీహెచ్‌డీలో చేరిన విద్యార్థులకు ఫెలోషిప్ అందుతుంది. సెన్సైస్, సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్, ఇంజనీరింగ్ విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశం పొందేందుకు పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అవి..
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ :
కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సంయుక్తంగా సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్‌ను నిర్వహిస్తున్నాయి. దీనిద్వారా లైఫ్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్; ఎర్త్, అట్మాస్ఫియరిక్ సెన్సైస్, ఓషియన్ అండ్ ప్లానెటరీ సెన్సైస్ తదితర విభాగాల్లో.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రీసెర్చ్ లేబొరేటరీల్లో పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు.
అర్హత: 55 శాతం మార్కులతో ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్, నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్,బీఈ/బీటెక్/బీఫార్మసీ/ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.
వెబ్‌సైట్: www.csirhrdg.res.in
యూజీసీ నెట్:
లాంగ్వేజెస్, ఆర్‌ట్స, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో పీహెచ్‌డీ చేసేందుకు యూజీసీ-నెట్ అవకాశం కల్పిస్తోంది. ఈ పరీక్షలో ప్రతిభ చూపడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సోషల్ సెన్సైస్ కాలేజీలు, మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్, యూనివర్సిటీల్లో పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు. ఏటా రెండుసార్లు నిర్వహించే యూజీసీ నెట్‌కు హాజరయ్యేందుకు సంబంధిత సబ్జెక్ట్‌లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణత సాధించి పీహెచ్‌డీలో ప్రవేశం పొందితే.. తొలుత జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్), ఆ తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(ఎస్‌ఆర్‌ఎఫ్) అందుతాయి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://nta.ac.inwww.ugcnetonline.in
జెస్ట్:
పముఖ పరిశోధనా కేంద్రాల్లోకి అడుగుపెట్టే అవకాశం జెస్ట్(జారుుంట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్) ద్వారా లభిస్తుంది. ఏటా ఈ పరీక్షను ఫిజిక్స్, థియరిటికల్ కంప్యూటర్‌సైన్స్/న్యూరోసైన్స్/కంప్యుటేషనల్ బయాలజీ సబ్జెక్ట్‌ల్లో నిర్వహిస్తున్నారు. జెస్ట్‌లో ప్రతిభ చూపితే ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సెన్సైస్, హోమీ బాబా నేషనల్ ఇన్‌స్టిట్యూట్, హరీశ్ చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఐఐఎస్సీ-బెంగళూరు వంటి 29 రీసెర్చ్ కేంద్రాల్లోని పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో, అదేవిధంగా ఎంఎస్ బై రీసెర్చ్ వంటి ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు పొందొచ్చు. పీహెచ్‌డీ ఇన్ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్‌ను చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్ అందిస్తోంది. అలాగే పీహెచ్‌డీ ఇన్ న్యూరోసైన్స్‌ను గుర్గావ్‌లోని నేషనల్ బ్రైన్ రీసెర్చ్ సెంటర్ అందిస్తోంది.
వెబ్‌సైట్: www.jest.org.in
గేట్:
గాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్) స్కోరు ఆధారంగా రాష్ట్ర స్థాయి వర్సిటీలు, ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్ విభాగాల్లో ఎంటెక్ వంటి పీజీ కోర్సుతోపాటు సంబంధిత సైన్స్, ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీల్లో ప్రవేశం పొందొచ్చు. అలా ప్రవేశం పొందిన వారికి ఆర్థికంగా ప్రోత్సాహం కల్పించేలా.. ఫెలోషిప్/స్కాలర్‌షిప్స్/అసిస్టెంట్‌షిప్స్ వంటివి అందుతాయి. గేట్ రాసేందుకు ప్రధాన అర్హత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్. గేట్ 2020కు నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఈ ఏడాది గేట్‌ను ఐఐటీ ఢిల్లీ నిర్వహించే అవకాశముంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.gate.iitd.ac.in
మేనేజ్‌మెంట్ రీసెర్చ్:
మేనేజ్‌మెంట్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లు(ఐఐఎంలు) సరైన వేదికలుగా నిలుస్తున్నాయి. ఐఐఎంలు ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(ఎఫ్‌పీఎం) పేరుతో పీహెచ్‌డీకి సమానమైన ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. క్యాట్, జీమ్యాట్ స్కోర్ ఆధారంగా వీటిలో అడుగుపెట్టొచ్చు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://iimcat.ac.in
పీహెచ్‌డీ... ప్రోత్సాహకాలు:
పీహెచ్‌డీతో డాక్టరేట్ పట్టా లభించడంతోపాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దృక్పథం కూడా అలవడుతుంది. పరిశోధనల క్రమంలో సమస్యలను పరిష్కరించేటప్పుడు కొత్త ఆవిష్కరణలు సహజం. సదరు ఆవిష్కరణలు మార్కెట్ అవసరాలను తీర్చగలవని భావిస్తే.. సొంతంగా సంస్థలను ఏర్పాటుచేసే వీలుంటుంది. ఇటీవల కాలంలో రీసెర్చ్ ఔత్సాహికులకు ఎన్నో ప్రోత్సాహకాలు లభిస్తున్నారుు. బ్యాచిలర్ డిగ్రీ స్థారుు నుంచే ఈ దిశగా దృష్టిసారిస్తే ఉజ్వల భవిష్యత్తు ఖాయమంటున్నారు నిపుణులు.
కోర్సులు-కాల వ్యవధి:

సంవత్సరం | 2019 | 2014 | 2010 |
జూనియర్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్) | 31000 | 25000 | 16000 |
సీనియర్ ఫెలోషిప్(ఎస్‌ఆర్ ఎఫ్) | 35000 | 28000 | 18000 |
రీసెర్చ్ అసిస్టెంట్‌షిప్-1 | 47000 | 36000 | 22000 |
రీసెర్చ్ అసిస్టెంట్‌షిప్-2 | 49000 | 38000 | 23000 |
రీసెర్చ్ అసిస్టెంట్‌షిప్-3 | 54000 | 40000 | 24000 |

- నెలకు రూ.31వేల జేఆర్‌ఎఫ్; నెలకు రూ.35వేల ఎస్‌ఆర్‌ఎఫ్.
- ఏటా నిర్ణీత మొత్తంలో కాంటింజెన్సీ గ్రాంట్, రీసెర్చ్ చేసేందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు.
- పీఎంఆర్‌ఎఫ్ స్కీమ్ ద్వారా ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో పీహెచ్‌డీకి అవకాశం.
- పీఎంఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే రూ.70వేల ప్రారంభ ఫెలోషిప్.
- సీఎస్‌ఐఆర్, ఇక్రిశాట్, ఐఐసీటీ, ఐసీఏఆర్, ఎన్‌జీఐఆర్‌ఐ తదితర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల్లో జూనియర్ సైంటిస్ట్‌లుగా అవకాశం లభిస్తుంది. అధ్యాపక వృత్తిలో స్థిరపడొచ్చు.
- యూనివర్సిటీల్లో, ఇన్‌స్టిట్యూట్స్‌ల్లో నిర్ణీత నిష్పత్తితో పీహెచ్‌డీ ఫ్యాకల్టీ ఉండాలనే నిబంధన అమలు నేపథ్యంలో పెరుగుతున్న అవకాశాలు.
- ప్రైవేటు సంస్థల ఆర్ అండ్ డీ విభాగాల్లో సైంటిస్ట్‌లుగా ప్రారంభంలోనే నెలకు రూ.లక్షకు పైగా వేతనంతో కెరీర్ ప్రారంభించొచ్చు.
- స్వీయ రీసెర్చ్ ఔత్సాహికులకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు ఆధ్వర్యంలో ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు రీసెర్చ్ గ్రాంట్, నెలకు రూ.55వేల ఫెలోషిప్, ఇతర రీసెర్చ్ ఖర్చుల కోసం ఓవర్‌హెడ్‌స పేరుతో ఏడాదికి రూ.లక్ష తదితర ఆర్థిక ప్రోత్సాహకాలు.
పీహెచ్‌డీతో డాక్టరేట్ పట్టా లభించడంతోపాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దృక్పథం కూడా అలవడుతుంది. పరిశోధనల క్రమంలో సమస్యలను పరిష్కరించేటప్పుడు కొత్త ఆవిష్కరణలు సహజం. సదరు ఆవిష్కరణలు మార్కెట్ అవసరాలను తీర్చగలవని భావిస్తే.. సొంతంగా సంస్థలను ఏర్పాటుచేసే వీలుంటుంది. ఇటీవల కాలంలో రీసెర్చ్ ఔత్సాహికులకు ఎన్నో ప్రోత్సాహకాలు లభిస్తున్నారుు. బ్యాచిలర్ డిగ్రీ స్థారుు నుంచే ఈ దిశగా దృష్టిసారిస్తే ఉజ్వల భవిష్యత్తు ఖాయమంటున్నారు నిపుణులు.
కోర్సులు-కాల వ్యవధి:
- పీహెచ్‌డీ(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ అండ్ సిస్టమ్ సైన్స్, సైన్స్ ఎడ్యుకేషన్)- కోర్సు కాల వ్యవధి అయిదేళ్లు.
- ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ అండ్ సిస్టమ్ సైన్స్). కోర్సు కాల వ్యవధి ఆరేళ్లు.
- సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ ద్వారా సైన్స్ విభాగంలో పీహెచ్‌డీలో ప్రవేశం.
- యూజీసీ-నెట్ ద్వారా ముఖ్యంగా ఆర్‌ట్స, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, లాంగ్వేజెస్‌ల్లో పరిశోధనలకు అవకాశం.
- జెస్ట్ స్కోరు ఆధారంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలోని ప్రతిష్టాత్మక రీసెర్చ్ ల్యాబ్స్‌లో అడుగుపెట్టొచ్చు.
- గేట్ ఉత్తీర్ణతతో ఇంజనీరింగ్ సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు.
Published date : 26 Jun 2019 03:44PM