పదోతరగతి పరీక్షల ప్రశ్నపత్రాల కొత్త విధానం ఇలా..
Sakshi Education
పదోతరగతి విద్యార్థుల జీవితంలో ఓ కీలకఘట్టం..!! ఇందులో సాధించిన
మార్కులు భవిష్యత్తును నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019-20 విద్యా సంవత్సరం నుంచి పదోతరగతి పరీక్షా విధానంలో పలు సంస్కరణలు చేపట్టింది. ప్రధానంగా గతంలో ఉన్నట్లు అంతర్గత మూల్యాంకన(20 మార్కులు) ఉండదు. ఈ మార్పులు విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేవిగా, సమాన అవకాశాలు కల్పించేవిగా.. వందకు వంద మార్కులు సాధించుకునే అవకాశం విద్యార్థి చేతికే ఇవ్వడంతో.. సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రశ్న పత్రంలో మార్పులపై ఇప్పటి నుంచే అవగాహన పెంచుకుంటే... గరిష్ట మార్కులు సాధించొచ్చని సబ్జెక్ట్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పదోతరగతి పరీక్షల ప్రశ్నపత్రాలనూతన స్వరూపం, ప్రశ్నల స్వభావం తదితరాలపై సమగ్ర కథనం...
ప్రశ్నపత్రం నమూనా..
హిందీ మినహా మిగిలిన అన్ని పేపర్లు కింది నమూనాలో ఉంటాయి.
నాలుగు రకాల ప్రశ్నలు :
ప్రతి ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలు, నాలుగు రకాల ప్రశ్నలు అడుగుతారు. మొదటి విభాగంలో 4 మార్కుల వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. వీటికి 8 నుంచి 10 వాక్యాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. రెండో భాగంలో రెండు మార్కుల లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటికి నాలుగు నుంచి ఐదు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. మూడో భాగంలో అతి లఘు (ఒక మార్కు) సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఒకటి నుంచి రెండు వాక్యాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. నాలుగో భాగంలో లక్ష్యాత్మక ప్రశ్నలు (అర మార్కు) ఉంటాయి. వీటికి ఒక పదంలో సమాధానాలు రాయాలి.
ఒక్కో పేపర్ 50 మార్కులకు :
ప్రశ్నపత్రంలో మార్పులు జరిగినా..మార్కుల్లో మాత్రం మార్పు లేదు. ప్రతి సబ్జెక్టులోనూ ఒక్కో పేపరు 50 మార్కులకు చొప్పున రెండు పేపర్లు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. హిందీ మాత్రం 100 మార్కులకు ఒకే పేపర్‌గా ఉంటుంది. మిగిలిన అన్ని సబ్జెక్టులు రెండు పేపర్లుగా ఉంటాయి. మొత్తం ఆరు సబ్జెక్టులకు కలిపి 600 మార్కులకు పదోతరగతి పరీక్షలు జరుగుతాయి.
అందరికీ సమానంగా..
గతంలో 20 శాతం అంతర్గత మూల్యాంకన మార్కుల వల్ల ప్రైవేటు, కార్పొరేట్ సూళ్లలో చదివే విద్యార్థులకు అదనపు ప్రయోజనం చేకూరుతోందనే ఆరోపణ ఉండేది. తాజాగా అంతర్గత మార్కులు తొలగించడంతో విద్యార్థులందరికీ సమాన అవకాశం కల్పించినట్లయింది. అదేవిధంగా బిట్ పేపర్‌ను ప్రధాన ప్రశ్నపత్రంతో కలపడం, సమాధానాలు రాసేందుకు 24 పేజీల బుక్‌లెట్‌ను అందుబాటులోకి తెస్తుండటంతో మాల్‌ప్రాక్టీస్ తగ్గనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
15 నిమిషాలు పెంపు :
పరీక్షా సమయం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు. ఇందులో మొదటి 10 పది నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకోవడానికి, రెండున్నర గంటలు పరీక్ష రాయడానికి, 5 నిమిషాలు సమాధానాలు సరిచూసుకోవడానికి కేటాయించారు.
కీలక సబ్జెక్టులు..
పదోతరగతిలో ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు కీలకమైనవిగా చెప్పొచ్చు. కాబట్టి నూతన పరీక్ష విధానానికి అనుగుణంగా ఆయా సబ్జెక్టుల గురించి క్షుణ్నంగా తెలుసుకున్నప్పుడే అత్యధిక మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది.
ఇంగ్లిష్ :
పేపర్ 1 :
రీడింగ్ కాంప్రహెన్షన్‌కు 30 శాతం వెయిటేజీ ఉంటుంది. దీన్నుంచి 15 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. గ్రామర్‌కు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. గ్రామర్‌పై 20మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ (ఫ్రేమింగ్ క్వశ్చన్స్, కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్)కు 30 శాతం వెయిటేజీ ఉంటుంది. దీన్నుంచి 15 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.
పేపర్ 2 :
రీడింగ్ కాంప్రహెన్షన్ (స్టడీ స్కిల్స్, జంబుల్డ్ సెంటెన్సెస్‌తో కలిపి) కు 30 శాతం వెయిటేజీ(15 మార్కులు) ఉంటుంది. వొకాబ్యులరీకి (డిక్షనరీ రిఫరెన్స్‌తో కలిపి) 40శాతం(20 మార్కులు) వెయిటేజీ లభిస్తుంది. క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ (కన్వర్జేషన్స్ రైటింగ్, ఇన్‌ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్) కు ఉన్న వెయిటేజీ(15 మార్కులు) 30 శాతం.
గణితశాస్త్రం :
ఇందులో పేపర్-1, 2 లోని ప్రతి పేపర్‌లో 13 ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రశ్నలు వస్తాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రశ్నలకు గరిష్టంగా 40 శాతం వెయిటేజీ(20 మార్కులు) ఉంటుంది. అలాగే 10 మార్కులకు 5 రీజనింగ్ అండ్ ప్రూఫ్ ప్రశ్నలు ఇస్తారు. దీంతోపాటు 5 మార్కులకు 5 కమ్యూనికేషన్ ప్రశ్నలు, కనెక్షన్‌పై 5 ప్రశ్నలు(7.5 మార్కులు), విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ శైలిలో 5 ప్రశ్నలు(7.5 మార్కులు) వస్తాయి. మొత్తంగా క్లిష్టత పరంగా 20 శాతం సులభమైన, 60 శాతం మధ్యస్థ, 20 శాతం కఠిన ప్రశ్నలు అడిగే అవకాశముంది.
జనరల్ సైన్స్ :
భౌతిక రసాయన శాస్త్రం (పేపర్ 1) :
జీవశాస్త్రం (పేపర్ 2) :
హిందీ మినహా మిగిలిన అన్ని పేపర్లు కింది నమూనాలో ఉంటాయి.
ప్రశ్నల రకం | ప్రశ్నల సంఖ్య×మార్కులు | మార్కులు మొత్తం |
వ్యాసరూప | 5 × 4 | 20 |
లఘు సమాధాన | 8 × 2 | 16 |
అతి లఘు | 8 × 1 | 8 |
లక్ష్యాత్మక | 2 × 1/2 | 6 |
మొత్తం | 33 | 50 |
నాలుగు రకాల ప్రశ్నలు :
ప్రతి ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలు, నాలుగు రకాల ప్రశ్నలు అడుగుతారు. మొదటి విభాగంలో 4 మార్కుల వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. వీటికి 8 నుంచి 10 వాక్యాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. రెండో భాగంలో రెండు మార్కుల లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటికి నాలుగు నుంచి ఐదు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. మూడో భాగంలో అతి లఘు (ఒక మార్కు) సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఒకటి నుంచి రెండు వాక్యాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. నాలుగో భాగంలో లక్ష్యాత్మక ప్రశ్నలు (అర మార్కు) ఉంటాయి. వీటికి ఒక పదంలో సమాధానాలు రాయాలి.
ఒక్కో పేపర్ 50 మార్కులకు :
ప్రశ్నపత్రంలో మార్పులు జరిగినా..మార్కుల్లో మాత్రం మార్పు లేదు. ప్రతి సబ్జెక్టులోనూ ఒక్కో పేపరు 50 మార్కులకు చొప్పున రెండు పేపర్లు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. హిందీ మాత్రం 100 మార్కులకు ఒకే పేపర్‌గా ఉంటుంది. మిగిలిన అన్ని సబ్జెక్టులు రెండు పేపర్లుగా ఉంటాయి. మొత్తం ఆరు సబ్జెక్టులకు కలిపి 600 మార్కులకు పదోతరగతి పరీక్షలు జరుగుతాయి.
అందరికీ సమానంగా..
గతంలో 20 శాతం అంతర్గత మూల్యాంకన మార్కుల వల్ల ప్రైవేటు, కార్పొరేట్ సూళ్లలో చదివే విద్యార్థులకు అదనపు ప్రయోజనం చేకూరుతోందనే ఆరోపణ ఉండేది. తాజాగా అంతర్గత మార్కులు తొలగించడంతో విద్యార్థులందరికీ సమాన అవకాశం కల్పించినట్లయింది. అదేవిధంగా బిట్ పేపర్‌ను ప్రధాన ప్రశ్నపత్రంతో కలపడం, సమాధానాలు రాసేందుకు 24 పేజీల బుక్‌లెట్‌ను అందుబాటులోకి తెస్తుండటంతో మాల్‌ప్రాక్టీస్ తగ్గనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
15 నిమిషాలు పెంపు :
పరీక్షా సమయం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు. ఇందులో మొదటి 10 పది నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకోవడానికి, రెండున్నర గంటలు పరీక్ష రాయడానికి, 5 నిమిషాలు సమాధానాలు సరిచూసుకోవడానికి కేటాయించారు.
కీలక సబ్జెక్టులు..
పదోతరగతిలో ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు కీలకమైనవిగా చెప్పొచ్చు. కాబట్టి నూతన పరీక్ష విధానానికి అనుగుణంగా ఆయా సబ్జెక్టుల గురించి క్షుణ్నంగా తెలుసుకున్నప్పుడే అత్యధిక మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది.
ఇంగ్లిష్ :
పేపర్ 1 :
రీడింగ్ కాంప్రహెన్షన్‌కు 30 శాతం వెయిటేజీ ఉంటుంది. దీన్నుంచి 15 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. గ్రామర్‌కు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. గ్రామర్‌పై 20మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ (ఫ్రేమింగ్ క్వశ్చన్స్, కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్)కు 30 శాతం వెయిటేజీ ఉంటుంది. దీన్నుంచి 15 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.
- ఇందులో మంచి గ్రేడ్ సాధించేందుకు కాంప్రహెన్షన్ ప్యాసేజ్‌పై పూర్తి అవగాహన అవసరం. ముఖ్యమైన వ్యాక్యాలను, ఎక్స్‌ప్రెషన్స్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలి.
- గ్రామర్‌కు సంబంధించి టెన్సెస్, ఆర్టికల్స్, డెరైక్ట్, ఇన్‌డెరైక్ట్ స్పీచ్ తదితరాలపై దృష్టిపెట్టడం ముఖ్యం.
పేపర్ 2 :
రీడింగ్ కాంప్రహెన్షన్ (స్టడీ స్కిల్స్, జంబుల్డ్ సెంటెన్సెస్‌తో కలిపి) కు 30 శాతం వెయిటేజీ(15 మార్కులు) ఉంటుంది. వొకాబ్యులరీకి (డిక్షనరీ రిఫరెన్స్‌తో కలిపి) 40శాతం(20 మార్కులు) వెయిటేజీ లభిస్తుంది. క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ (కన్వర్జేషన్స్ రైటింగ్, ఇన్‌ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్) కు ఉన్న వెయిటేజీ(15 మార్కులు) 30 శాతం.
- ఇందులో మంచి మార్కులు పొందేందుకు కాంప్రహెన్షన్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే క్రియేటివ్ రైటింగ్‌పైనా దృష్టిపెట్టాలి.
గణితశాస్త్రం :
ఇందులో పేపర్-1, 2 లోని ప్రతి పేపర్‌లో 13 ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రశ్నలు వస్తాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రశ్నలకు గరిష్టంగా 40 శాతం వెయిటేజీ(20 మార్కులు) ఉంటుంది. అలాగే 10 మార్కులకు 5 రీజనింగ్ అండ్ ప్రూఫ్ ప్రశ్నలు ఇస్తారు. దీంతోపాటు 5 మార్కులకు 5 కమ్యూనికేషన్ ప్రశ్నలు, కనెక్షన్‌పై 5 ప్రశ్నలు(7.5 మార్కులు), విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ శైలిలో 5 ప్రశ్నలు(7.5 మార్కులు) వస్తాయి. మొత్తంగా క్లిష్టత పరంగా 20 శాతం సులభమైన, 60 శాతం మధ్యస్థ, 20 శాతం కఠిన ప్రశ్నలు అడిగే అవకాశముంది.
- పేపర్ 1లో.. క్షేత్రమితి, శ్రేఢులు, వర్గసమీకరణాలు, వాస్తవ సంఖ్యలు, బహుపదులు, సమితులు, రెండు చలరాశులలో రేఖీయ సమీకరణాల జత పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం ఏడు చాప్టర్లు 50 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
- పేపర్ 2లో త్రికోణమితి, నిరూపక జ్యామితి, సాంఖ్యక శాస్త్రం, త్రికోణమితి అనువర్తనాలు, సరూప త్రిభుజాలు, సంభావ్యత, టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం ఏడు చాప్టర్లు 50 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
- గణిత శాస్త్రంలో మంచి మార్కులు సాధించేందుకు ఇప్పటి నుంచి రోజూ కనీసం రెండు గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ప్రతి ఛాప్టర్‌ను అధ్యయనం చేస్తూ ముఖ్యమైన సూత్రాలను, పటాలను, పట్టికలను, నిర్వచనాలను షార్ట్‌నోట్స్‌లా రాసుకోవాలి. ఇది పరీక్ష సమయంలో వేగంగా రివిజన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రశ్నలను పూర్తిగా రాసేలా సాధన చేయాలి. పటాలను, సిద్ధాంతాలను ఒక చోట రాసి... బాగా ప్రాక్టీస్ చేయాలి. చాప్టర్ల చివర్లో ఇచ్చిన ముఖ్యాంశాలను ఒకటికి నాలుగుసార్లు చదువుకోవాలి.
జనరల్ సైన్స్ :
భౌతిక రసాయన శాస్త్రం (పేపర్ 1) :
- జనరల్ సైన్స్‌లో భౌతిక రసాయన శాస్త్రాలు పేపర్-1గా ఉంటాయి. 50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇందులో వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం పాఠ్యాంశం నుంచి అత్యధికంగా 7 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఆమ్లాలు, క్షారాలు, లవణాలు పాఠ్యాంశం నుంచి ఆరున్నర మార్కులకు, పరమాణు నిర్మాణం, విద్యుత్ ప్రవాహం, కార్బన్, దాని సమ్మేళనాలు పాఠ్యాంశాల నుంచి 6 మార్కుల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఉష్ణం, సమతల తలాల వద్ద కాంతి వక్రీభవనం, మానవుడి కన్ను-రంగుల ప్రపంచం, మూలకాల వర్గీకరణ-ఆవర్తన పట్టిక, రసాయన బంధం, విద్యుత్, అయస్కాంతత్వం, లోహసంగ్రహణ శాస్త్రం పాఠ్యాంశాల నుంచి ఐదున్నర మార్కుల చొప్పున ప్రశ్నలు వస్తాయి.
- ఫిజికల్ సైన్స్‌లో 40 శాతం ప్రశ్నలు విషయావగాహనను పరీక్షించేవిగా ఉంటాయి. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడంపై 10 శాతం, ప్రయోగాలు క్షేత్ర పరిశీలనల నుంచి 16 శాతం, సమాచార నైపుణ్యాలపై 14 శాతం, పట ైనె పుణ్యాలపై 10 శాతం, ప్రశంస-సున్నితత్వంపై 10 శాతం ప్రశ్నలు వస్తాయి.
జీవశాస్త్రం (పేపర్ 2) :
- జీవశాస్త్రం పేపర్2గా 50 మార్కులకు జరుగుతుంది. ఇందులో రెండు గ్రూపుల మధ్య తేడాను గుర్తించడం, వర్గీకరణ/ఫ్లోచార్టు/గ్రాఫ్‌లు/ కాన్సెప్ట్ మ్యాపింగ్, ఉదాహరణలు ఇవ్వడం, వాక్యాన్ని సరిచేసి తిరిగి రాయడం, సందర్భాన్ని గుర్తించడం, ఇచ్చిన పేరాలో ఖాళీని గుర్తించడం, చిత్రం గురించి ప్రశ్నించడం, నేనెవరిని, విశదీకరించి రాయడం, శాస్త్రవేత్తలు-పరిశోధనలు, జతపరచడంపై లక్ష్యాత్మక ప్రశ్నలు వస్తాయి.
- డార్విన్ సిద్ధాంతం, కిరణజన్య సంయోగక్రియ-కాంతి, నిష్కాంతి దశలు, మూత్రం ఏర్పడే విధానం, పిండిపై లాలాజలం చర్య(ప్రయోగం), రక్తస్కంధనం,ఆకు అంతర నిర్మాణాల పటం-భాగాలు తదితరాలపై వ్యాసరూప ప్రశ్నలు వస్తాయి.
Published date : 04 Dec 2019 11:39AM