పదో తరగతిలో తెలుగులో మంచి స్కోరు సాధించే మార్గాలివే..
ఇంతటి కీలకమైన పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి.. ఈ ఏడాది(2021) తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ షెడ్యూల్ ఖరారైంది. కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాస్‌లు,సిలబస్ కుదింపునకు అనుగుణంగా పరీక్షల విధానంలో పలు మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో.. తెలుగులో 10/10 జీపీఏ సాధించేందుకు మార్గాలు ఇవే..
తెలుగు.. ఫస్ట్ లాంగ్వేజ్‌గా పిలిచే ఈ పేపర్‌లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు.. ముందుగా పద్యభాగం, గద్యభాగంలోని అన్ని అంశాలను చదువు కోవాలి. వాటిని ఒకటికి నాలుగుసార్లు పునశ్చరణ చేసుకోవాలి. పాఠాన్ని కేవలం చదవడంతో సరిపెట్టకుండా.. సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ప్యాసేజ్ పేరిట ఉండే అపరిచిత గద్యం ఎంతో ముఖ్యం. దీన్ని సొంతంగా ఆలోచిస్తూ చదవాలి. ఉపవాచకానికి సంబంధించి ఇతివృత్తం, ప్రాముఖ్యత, పాత్రలు, వాటి ప్రాధాన్యత, వ్యక్తుల ప్రవర్తనా శైలి తదితర అంశాల ద్వారా ఇచ్చే సందేశాన్ని తెలుసుకోవాలి. వ్యాకరణంలో మంచి ప్రతిభ చూపాలంటే.. సంధులు, సమాసాలు, సంయుక్తార్థాలు, ఉత్పత్యర్థాలు, జాతీయాలపై బాగా అవగాహన పెంచుకోవాలి.
- జి.వెంకట రమణ, ఎస్‌ఏ-తెలుగు
ఇంకా చదవండి: part 3: ఇంగ్లిష్‌లో మంచి మార్కులు సాధించే ప్రిపరేషన్ వ్యూహాలు..