‘పది’లో ఈ మార్పులు గమనిస్తే... 10/10 జి.పి.ఎ.సాధించడం ఈజీనే..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత విద్యా సంవత్సరం (2019-2020) మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల విధానంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.
ముఖ్యంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం (సి.సి.ఇ.)లో భాగంగా పాఠశాల స్థాయిలో అంతర్గతంగా సమగ్ర మూల్యాంకనం ద్వారా ఇచ్చే 20 శాతం మార్కులను ప్రభుత్వం ఈ ఏడాది నుంచి రద్దు చేసింది. దాని స్థానంలో 80 మార్కులకు ప్రశ్నపత్రాల బదులు 100 మార్కులకు ప్రశ్నపత్రాలుండే విధంగా మార్పు చేసింది. ఇక నుంచి ప్రశ్నపత్రంలోనే భాషాంశాలనూ చేర్చి, ఇవ్వాలని నిర్ణయించింది. వీటి కోసం ఈ విద్యాసంవత్సరం నుంచి బిట్ పేపర్ అంటూ ప్రత్యేకించి ఏదీ విద్యార్థులకు ఇవ్వరు. అంతేగాక సమాధానపత్రం కూడా 24 పుటలతో (పేజీలు) ఒక పుస్తక రూపంలో ఇవ్వనున్నారు. విడిగా అదనపు సమాధాన పత్రాలు విద్యార్థులకు ఇచ్చే పద్ధతి ఇక నుంచి ఉండదు. అన్ని సమాధానాలను సమాధానపత్రంలోనే పూర్తి సొంత రాతతోనే విద్యార్థులు రాయాలి. ఈ నేపథ్యంలో ప్రథమ భాష తెలుగు ప్రశ్నపత్రంలో వచ్చిన మార్పులను, మార్కుల కేటాయింపులో జరిగిన తీరును గమనిస్తూ, విశ్లేషణ చేసుకుంటూ విద్యార్థులు చదివితే సులభంగా 10/10 జి.పి.ఎ. సాధించడం పెద్ద కష్టమేమీకాదు.
ప్రథమభాష తెలుగు పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మొదటి పేపర్ 50 మార్కులు, రెండో పేపర్ 50 మార్కులు. ఈ రెండు పేపర్లలో అవగాహన - ప్రతిస్పందన (16మార్కులు), వ్యక్తీకరణ -స్వీయరచన (సృజనాత్మకత) (22 మార్కులు), భాషాంశాలు (12 మార్కులు) అనే మూడు విద్యా ప్రమాణాలు విద్యార్థుల వివిధ సామర్థ్యాలను పరీక్షించేవిగా ఉంటాయి. ఒక్కో పేపరులో మొత్తం 33 ప్రశ్నలుంటాయి. ఒకసారి అడిగిన ప్రశ్న సంఖ్య మరోసారి ఎక్కడా కనిపించదు. కాబట్టి విద్యార్థులు ముందుగా ప్రశ్న సంఖ్యను నమోదుచేసి, తర్వాత దాని సమాధానాన్ని రాస్తే సరిపోతుంది.
ఈ 33 ప్రశ్నలలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, అతి లఘు సమాధాన ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు అని 4 విధాలుగా ఉంటాయి. వ్యాసరూప సమాధానాల ప్రశ్నలకు 4 మార్కులు, లఘు సమాధాన ప్రశ్నలకు 2 మార్కులు, అతి లఘు సమాధాన ప్రశ్నలకు 1 మార్కు, లక్ష్యాత్మక ప్రశ్నలకు ½ మార్కు చొప్పున కేటాయిస్తారు. రెండో పేపర్‌లో సంఘటనలను అనుసరించి సరైన క్రమంలో రాయండి అనే 4 మార్కుల ప్రశ్న మినహా మిగిలిన అన్ని వ్యాసరూప ప్రశ్నలకు అంతర్గత ఎంపిక (ఇంటర్నల్ చాయిస్) ఉంటుంది. రెండేసి ప్రశ్నల్లో విద్యార్థులు ఒకదాన్ని ఎంపిక చేసుకొని సమాధానం రాసేందుకు వీలుంటుంది.
తెలుగు పేపర్ - 1 విశ్లేషణ :
ఇందులో 1వ విద్యా ప్రమాణం b అవగాహన - ప్రతిస్పందనలోulnone భాగంగా పద్య పాఠ్యాంశాలైన మాతృభావన, వెన్నెల, శతక మధురిమ, సముద్ర లంఘనం, భిక్ష పాఠ్యాంశాల్లో నక్షత్రం (*) గుర్తు కలిగిన పద్యాలను ప్రతిపదార్థాలకు (4 మార్కులు), పద్య పూరణ - భావాలకు (4 మార్కులు) అడుగుతారు. ఇవే పాఠాల నుంచి పరిచిత పద్యం (4 మార్కులు) పేరుతో ఏదైనా ఒక చిన్న పద్యాన్నిచ్చి 4 ప్రశ్నలకు జవాబులు రాయాలని అడుగుతారు. తర్వాత గద్య పాఠ్యాంశాలైన అమరావతి, జానుపదుని జాబు, ధన్యుడు, మా ప్రయత్నం, గోరంత దీపాలు, చిత్రగ్రీవం పాఠాల నుంచి ఒక పరిచిత గద్యం (4 మార్కులు) ఇచ్చి 4 ప్రశ్నలకు జవాబులు రాయాలని అడుగుతారు. ఈ పరిచిత పద్య, గద్యాల కింద అడిగే ప్రశ్నల్లో ఒక ప్రశ్న నేరుగా ప్రశ్నించేందుకు, మరో ప్రశ్న విద్యార్థి అవగాహనకు, ఇంకో ప్రశ్న మొత్తం పద్యం, గద్యంపై విద్యార్థి పూర్తి అవగాహనను ప్రశ్నించేలా వివిధ రూపాల్లో ఉంటాయి. చివరగా విద్యార్థి సొంతంగా ఒక ప్రశ్న తయారుచేసేలా మొత్తం 4 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు చొప్పున మొత్తం 4 ప్రశ్నలకు 4 మార్కులు కేటాయిస్తారు.
ఇక 2వ విద్యా ప్రమాణం bవ్యక్తీకరణ - స్వీయరచనulnone కింద మొత్తం 7 లఘు సమాధాన ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 14 మార్కులు వీటికి కేటాయిస్తారు. ప్రశ్న స్వభావాన్ని బట్టి 4 లేక 5 వాక్యాల్లో సమాధానం ఉండే విధంగా విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. ఈ 7 ప్రశ్నల్లో పద్యభాగం నుంచి 3, గద్యభాగం నుంచి 4 ప్రశ్నలుంటాయి. ఇందులో ఒక ప్రశ్న కవి లేదా రచయిత పరిచయం గురించి, మరో ప్రశ్న పాఠ్యాం శాల నేపథ్యంపై, ఇంకో ప్రశ్న సాహితీ ప్రక్రియల గురించి అడుగుతారు. ఈ రకమైన లఘు సమాధాన ప్రశ్నలు కచ్చితంగా ఉండేలా ప్రశ్న పత్రాన్ని రూపొందిస్తారు. మిగతా నాలుగు ప్రశ్నలు పద్య, గద్య పాఠ్యాంశాలకు చెందిన విషయాత్మకమైనవిగా ఉంటాయి. చాయిస్ ఉండవు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో మొత్తం వాచకంలోని పద్య పాఠ్యాంశాల నుంచి 2 ప్రశ్నలను, గద్య పాఠ్యాంశాల నుంచి 2 ప్రశ్నలను అడుగుతారు. అంతర్గత ఎంపిక (ఇంటర్నల్ చాయిస్) ద్వారా పద్య భాగం నుంచి ఒక్క ప్రశ్నకు, గద్యభాగం నుంచి ఒక్క ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 8 మార్కులు కేటాయిస్తారు.
చివరగా 3వ విద్యా ప్రమాణం bభాషాంశాలulnone కింద ఒక లఘు సమాధాన ప్రశ్న ఉంటుంది. దీనికి 2 మార్కులు కేటాయిస్తారు. వాచకంలోని శబ్దాలంకారాలు, అర్థాలంకారాల్లో ఏదో ఒక అలంకారం పేరు ఇచ్చి, దానికి నిర్వచనం, ఉదాహరణ రాయమంటారు. ఇచ్చిన అలంకారానికి నిర్వచనం రాసినందుకు 1 మార్కు, ఉదాహరణ రాసినందుకు 1 మార్కు.
తర్వాత ఒక వ్యాసరూప సమాధాన ప్రశ్న ఉంటుంది. దీనికి 4 మార్కులు కేటాయిస్తారు. ఛందస్సుకు సంబంధించిన పద్య పాఠ్యాంశాల నుంచి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం పద్యాల్లో ఏవైనా 2 పద్య పాదాలనిచ్చి ఒకదానికి గణవిభజన చేయమంటారు. పద్యపాదంలో గురు, లఘువులు గుర్తించినందుకు 1మార్కు, గణవిభజన చేసి పద్యం పేరు రాసినందుకు 1 మార్కు, యతిని గుర్తించినందుకు 1 మార్కు, ప్రాసను పేర్కొన్నందుకు 1 మార్కు. మొత్తం 4 మార్కులుంటాయి.
లక్ష్యాత్మక ప్రశ్నల విషయానికొస్తే... మొత్తం 12 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు 1/2 మార్కు చొప్పున 6 మార్కులు. ఈ ప్రశ్నలు బహుళైచ్ఛిక, జతపరచడం, ఖాళీలను పూరించడం, సరైన జతను ఎంపిక చేయడం, ఏకవాక్య సమాధానం, ఏకపద సమాధానాలను ఆశించేవిగా ఉంటాయి. పేరాలు, ప్రవచనాల ఆధారంగా కూడా ప్రశ్నలు ఇవ్వవచ్చు. ఇందులో అర్థాలకు 2 ప్రశ్నలు, పర్యాయ పదాలకు 2 ప్రశ్నలు, నానార్థాలకు 1ప్రశ్న, వ్యుత్పత్యర్థాలకు 1 ప్రశ్న, ప్రకృతి - వికృతులకు 2 ప్రశ్నలు, సంధులకు 2ప్రశ్నలు, సమాసాలకు 2 ప్రశ్నలుంటాయి. అయితే ప్రశ్నపత్రంలో ఆయా ప్రశ్నలకు సూచించిన విధంగా సమాధానాలను గుర్తించి రాయాలి.
తెలుగు పేపర్ - 2 విశ్లేషణ :
ఇందులో 1వ విద్యా ప్రమాణం b ‘అవగాహన-ప్రతిస్పందనulnone’ కింద ఉపవాచకం రామాయణంలోని ఏదో ఒక కాండ నుంచి నాలుగు సంఘటనలను ఇచ్చి వరుసక్రమంలో రాయాలని అడుగుతారు. రామాయణం చదివిన విద్యార్థులు ఏ సంఘటన మొదట జరిగిందో, ఆ తర్వాత జరిగిన సంఘటన ఏమిటో గుర్తుకు తెచ్చుకోవాలి. ఇలా గుర్తుకు తెచ్చుకున్న తర్వాతే ఆ నాలుగు సంఘటనలను/వాక్యాలను వరుసక్రమంలో రాయడానికి సిద్ధపడాలి. సరైన క్రమంలో రాసిన ప్రతీ సంఘటనకు ఒక్కమార్కు. మొత్తం 4 మార్కులు కేటాయిస్తారు.
అపరిచిత పద్యం కింద ఏవైనా రెండు సరళ పద్యాలను తెలిసిన శతకాల నుంచి అడుగుతారు. అంతర్గత ఎంపిక ద్వారా తేలికగా, స్పష్టంగా, సంపూర్ణంగా, అర్థవంతమైన భావం రాస్తామనే విశ్వాసం కలిగిన తర్వాతే ఒక పద్యానికి భావం రాయడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఇక్కడ చాయిస్ ఉంది కాబట్టి, ఏది తేలికో దానినే ఎంచుకొని రాస్తే 4కు 4 మార్కులు తప్పకుండా వస్తాయి.
అపరిచిత గద్యం కింద పదో తరగతి వాచకం నుంచి గద్యం ఇవ్వరు. సరళమైన భాషలో ఉండే ఏదో ఒక కొత్త అంశాన్ని/విషయాన్ని ఇచ్చి దానికింద 4 ప్రశ్నలడగుతారు. తర్వాత కరపత్రం, లేఖ, సంభాషణ వంటి ఏదో ఒక వ్యవహార రూపాన్ని ఇచ్చి దానికింద 4 ప్రశ్నలడుగుతారు. ఈ అపరిచిత గద్యం, వ్యవహారరూపాలకింద ఇచ్చే వాటిలో ఒక ప్రశ్న నేరుగా ప్రశ్నించేలా, మరో ప్రశ్న విద్యార్థి అవగాహనకు, ఇంకో ప్రశ్న మొత్తం గద్యం, వ్యవహార రూపంపై విద్యార్థి పూర్తి అవగాహనను ప్రశ్నించేలా వివిధ రూపాల్లో ఉంటాయి. చివరగా విద్యార్థి సొంతంగా ఒక ప్రశ్న తయారుచేసే విధంగా మొత్తం 4 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు. మొత్తం 4 మార్కులు కేటాయిస్తారు.
ఇక 2వ విద్యాప్రమాణం bవ్యక్తీకరణ-స్వీయరచన (సృజనాత్మకత)ulnone కింద ఉపవాచకం రామాయణం నుంచి మొత్తం 5 లఘు సమాధాన ప్రశ్నలడుగుతారు. 4 లేదా 5 వాక్యాల్లో వాటికి సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. మొత్తం 10 మార్కులుంటాయి. ఈ 5 ప్రశ్నలు సంఘటనా క్రమం ఇచ్చిన కాండ నుంచి కాకుండా మిగిలిన 5 కాండల నుంచి ఇస్తారు. ఇందులో ఒక లఘు సమాధాన ప్రశ్న ... పాత్ర స్వభావాన్ని, ఇచ్చిన సంఘటన ద్వారా మీరేమి గ్రహించారని, ఇంకో ప్రశ్న... ఇచ్చిన మాటకు / వాక్యానికి / ప్రవచానికి కారణాలు రాయమని అడుగుతారు. ఈ స్వభావం ఉన్న ప్రశ్నలు కచ్చితంగా ఇస్తారు. మిగతా రెండు ప్రశ్నలు (4, 5) రామాయణ విషయాత్మక ప్రశ్నలుంటాయి.
ఉపవాచకం మొత్తం రామాయణం నుంచి రెండు వ్యాసరూప సమాధాన ప్రశ్నలడగుతారు. అంతర్గత ఎంపిక ద్వారా ఒక్కదానికి 10 లేదా 12 వాక్యాల్లో జవాబు రాయాల్సి ఉంటుంది. దీనికి 4 మార్కులు కేటాయిస్తారు.
తర్వాత సృజనాత్మక వ్యాసరూప ప్రశ్నల కింద లేఖ, వ్యాసం, సంభాషణ, కరపత్రం, వర్ణన, ఇంటర్వ్యూ, ప్రశ్నావళి, కవిత వంటి 4 ప్రశ్నలడుగుతారు. ఇందులో పద్యభాగం నుంచి 2, గద్యభాగం నుంచి 2 ప్రశ్నలుంటాయి. అంతర్గత ఎంపిక ద్వారా పద్యభాగం నుంచి ఒకటి, గద్యభాగం నుంచి ఒకటి ఎంపిక చేసుకొని సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు. మొత్తం 8 మార్కులుంటాయి. వాచకంలోని పద్య, గద్య పాఠాల వెనుక సృజనాత్మకంగా రాయండి అనే పేరుతో ఇచ్చిన ప్రశ్నలు ఇక్కడ అడగడానికి అవకాశముంది. ఒకవేళ అవే ప్రశ్నలను నేరుగా అడగకున్నా అటువంటి స్వభావం ఉన్న సృజనాత్మక ప్రశ్నలను అడగుతారు. కాబట్టి విద్యార్థులు తాము సులభంగా, స్పష్టంగా, చక్కటి వ్యక్తీకరణతో రాస్తామనుకునే ప్రశ్నలను ఎంపిక చేసుకొని రాయాలి. అప్పుడే ఎక్కువ మార్కులు సొంతం చేసుకుంటారు.
చివరగా 3వ విద్యాప్రమాణం భాషాంశాల కింద 3 లఘు సమాధాన ప్రశ్నలుంటాయి. ఒక్కోదానికి 2 మార్కుల చొప్పున మొత్తం 6 మార్కులు కేటాయిస్తారు. ఈ మూడు ప్రశ్నలు పదజాలం ప్రధానంగా... జాతీయాలు వివరించడం, ఆ జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? ఇచ్చిన అర్థానికి తగిన జాతీయాన్ని గుర్తించడం, దాన్ని సొంతవాక్యంలో ఉపయోగించటం, ఇచ్చిన వాక్యాల్లో ఉన్న జాతీయాలను గుర్తించడం, వాటిని సొంతవాక్యాల్లో రాయాల్సి ఉంటుంది. ఆయా ప్రశ్నలకు అడిగిన మేరకు జవాబులు రాయాల్సి ఉంటుంది.
లక్ష్యాత్మక ప్రశ్నల విషయానికొస్తే... మొత్తం 12 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు 1/2 మార్కు. మొత్తం 6 మార్కులు. ఈ ప్రశ్నలు బహుళైచ్ఛిక, జతపరచడం, ఖాళీలు పూరించడం, సరైన జతను ఎంపిక చేయడం, ఏకవాక్య సమాధానం, ఏకపద సమాధానాలను ఆశించేవిగా ఉంటాయి. పేరాలు, ప్రవచనాల ఆధారంగా కూడా ప్రశ్నలు ఇవ్వవచ్చు.
ఇందులో ఆధునిక వచనంలో రాయడం, గుర్తించడం, కర్తరి కర్మణి వాక్యాల్లో రాయడం, గుర్తించడం, ప్రత్యక్ష పరోక్ష కథనాల్లోకి మార్చడం, గుర్తించడం, వ్యతిరేకార్థక వాక్యాలను రాయడం, గుర్తించడం, సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు - రకాలను గుర్తించి, రాయాల్సిన ప్రశ్నలు అడుగుతారు.
జాతీయాలు, వాక్యాలపై పూర్తి పట్టున్న విద్యార్థులు తేలికగా గుర్తించగలిగి, రాయగలుగుతారు.
చివరగా... విద్యార్థులూ! మీరు సమాధానాలు రాసేటప్పుడు అక్షర దోషాలు, భాషా దోషాలు, భావ దోషాలు లేకుండా చూసుకున్నట్లయితే భాషాంశాలు పూర్తి మార్కులు తెచ్చిపెడతాయి. కాబట్టి ప్రశ్నపత్రాన్ని నిదానంగా అర్థం చేసుకుంటూ చదివి, ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందుకు సాగితే తెలుగులో మార్కులు సంపాదించడం తేలికే... విజయం మీదే...!
పదో తరగతి సిలబస్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి

Published date : 28 Nov 2019 03:16PM