పదిలమైన కెరీర్‌కు ఫిజిక్స్ పరిశోధనలు..!
Sakshi Education
కంటి చికిత్సకు ఉపకరించే.. సూక్ష్మ పరికరాల రూపకల్పన దిశగా లేజర్ ఫిజిక్స్‌పై పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2018కు గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. ఈ ముగ్గురు ఫిజిక్స్‌లో చేసిన పరిశోధనలు మనిషి కంటి చికిత్సలో కీలక మలుపు. ఈ ముగ్గురేకాదు.. మోడ్రన్ ఫిజిక్స్‌కు ఆద్యుడైన ఐన్‌స్టీన్ నుంచి విశ్వాంతరాళంలోని బ్లాక్‌హోల్స్ గుట్టు విప్పిన స్టీఫెన్ హాకింగ్ దాకా.. ఎందరో తమ పరిశోధనల ద్వారానవ ఆవిష్కరణలకు నాందిపలికారు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో పరిశోధనలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఫిజిక్స్‌లో పరిశోధనలు.. అందుబాటులో ఉన్న మార్గాలు.. కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికశాతం టెక్నాలజీలు... ఫిజిక్స్ పరిశోధనల ఫలితమే! ఎలక్ట్రోమ్యాగ్నటిజం, న్యూక్లియర్ ఫిజిక్స్‌లో జరిగిన పరిశోధనల కారణంగా.. టీవీలు, కంప్యూటర్లు, అత్యాధునిక గృహోపకరణాలు, ఆటోమొబైల్స్, అణ్వాయుధాలు తయారయ్యాయి. ఫిజిక్స్ పరిశోధనలను కెరీర్‌గా ఎంచుకోవడం ద్వారా సమాజ అభివృద్ధిలో పరోక్షంగా పాలుపంచుకునే అవకాశం దక్కుతుంది. అయితే ఇది ఇతర కెరీర్ మార్గాలతో పోల్చితే కొంత కష్టమైంది. సుదీర్ఘ ప్రయాణం సాగించాల్సి ఉంటుంది.
ఇంటర్‌తోనే అడుగులు...
జేఈఈ అడ్వాన్స్ డ్ :
జేఈఈ అడ్వాన్స్ డ్ ద్వారా ఐఐటీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్సుల్లో చేరొచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ చూపడం ద్వారా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ), బెంగళూరు అందిస్తున్న నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(ఫిజిక్స్); ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం ఆఫర్‌చేస్తున్న బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్; ఐఐటీ కాన్పూర్ అందిస్తున్న బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(ఫిజిక్స్); ఐఐటీ మద్రాస్ ప్రవేశం కల్పిస్తున్న బీఎస్-ఎంఎస్ ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ; ఐఐటీ ఖరగ్‌పూర్ అందిస్తున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్సుల్లో ప్రవేశాలను ఖరారు చేసుకోవచ్చు.
జామ్ :
జామ్ ద్వారా ఐఐఎస్సీ, ఐఐటీల్లో ఎంఎస్సీ ఫిజిక్స్‌తోపాటు ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. జాయింట్ అడ్మిషన్ టెస్ట్(జామ్) ద్వారా ఐఐటీ ఢిల్లీ, గాంధీనగర్, గువహటి, హైదరాబాద్, ఇండోర్, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్ తదితర ఐఐటీల్లో రెండేళ్ల ఎంఎస్సీ, జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ, ఎంఎస్సీ-పీహెచ్‌డీ, డ్యూయల్ డిగ్రీ, ఇతర పోస్ట్-బ్యాచిలర్ కోర్సులో ప్రవేశాలు పొందొచ్చు.
జెస్ట్ :
జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్(జెస్ట్) ద్వారా ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్- ముంబై, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్- బెంగళూరు, ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ-అహ్మదాబాద్ తదితర సంస్థల్లో జెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
నెస్ట్ :
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ(డీఏఈ) ఆధ్వర్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యు కేషన్ అండ్ రీసెర్చ్(నైసర్), భువనేశ్వర్; యూని వర్సిటీ ఆఫ్ ముంబై-డీఏఈ సీఈబీఎస్ ఐదేళ్ల ఇంటి గ్రేటెడ్ ఎంఎస్సీ ఫిజికల్ సైన్స్ కోర్సు అందిస్తున్నా యి. ఈ సంస్థల్లో ప్రవేశానికి నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) రాయాలి. అర్హత: 10+2.
సీఎస్‌ఐఆర్-జేఆర్‌ఎఫ్ :
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్) ఫెలోషిప్‌లు.. యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్లు, జాతీయస్థాయి విద్యాసంస్థలు, జాతీయ లేబొరేటరీల్లోని అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, సైంటిస్ట్‌ల పర్యవేక్షణలో యువతను పరిశోధనల వైపు ఆకర్షించేందుకు ఉద్దేశించినవి. ఏటా రెండుసార్లు నిర్వహించే సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌లో ప్రతిభ చూపడం ద్వారా ఫెలోషిప్‌లను అందుకోవచ్చు. జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.25,000 స్టైపెండ్ లభిస్తుంది. దీంతోపాటు సంవత్సరానికి రూ.20,000 కాంటింజెంట్ గ్రాంట్ అందిస్తారు.
గేట్ :
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) స్కోరుతో దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), బెంగళూరులో కూడా చేరే అవకాశం లభిస్తుంది. ఐఐఎస్సీ తర్వాత విద్యార్థులు ఐఐటీలు, ఎన్‌ఐటీలకు ప్రాధాన్యమిస్తున్నారు.
ప్రోత్సాహకాలు.. ఇవిగో!
కేవీపీవై :
ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులను సైన్స్ పరిశోధనల దిశగా ప్రోత్సహించేలా కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం మూడు స్ట్రీముల్లో కేవీపీవై ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి.. ఫెలోషిప్‌లను ఖరారు చేస్తారు. అవి.. ఎస్‌ఏ స్ట్రీమ్: ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు; ఎస్‌ఎక్స్ స్ట్రీమ్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు; ఎస్‌బీ స్ట్రీమ్: బీఎస్సీ మొదటి సంవత్సరం విద్యార్థులు అర్హులు.
ప్రయోజనాలు: కేవీపీవై ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన విద్యార్థులకు సైన్స్ కోర్సులు అభ్యసించేందుకు ఐదేళ్లపాటు ఫెలోషిప్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఏడాదికోసారి కాంటింజెన్సీ గ్రాంట్ కూడా లభిస్తుంది.
ఇన్‌స్పైర్ :
విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే సైన్స్‌పై ఆసక్తి పెంచేందుకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం.. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యూట్ ఫర్ ఇన్‌స్పైర్డ్ రీసెర్చ్ (ఇన్‌స్పైర్)ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతిభావంతులను గుర్తించి.. పాఠశాల నుంచి పీహెచ్‌డీ స్థాయి వరకు ప్రోత్సహిస్తోంది. ఇన్‌స్పైర్ ప్రోగ్రామ్‌ను ఆరోతరగతి నుంచి పోస్ట్ డాక్టోరల్ డిగ్రీ వరకు మూడు విభాగాలుగా విభజించారు. అవి.. 1. స్కీమ్ ఫర్ ఎర్లీ అట్రాక్షన్ ఆఫ్ ట్యాలెంట్స్ ఫర్ సైన్స్ (ఎస్‌ఈఏటీఎస్); 2. స్కాలర్‌షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎస్‌హెచ్‌ఈ); 3. అస్యూర్డ్ ఆపర్చ్యునిటీ ఫర్ రీసెర్చ్ కెరీర్స్ (ఏవోఆర్‌సీ). వీటిని ఐదు సబ్ స్కీమ్‌లుగా వర్గీకరించారు. అవి.. 1. ఇన్‌స్పైర్ అవార్డ్ మనక్; 2. ఇన్‌స్పైర్ ఇంటర్న్‌షిప్; 3. ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్; 4. ఇన్‌స్పైర్ ఫెలోషిప్; 5. ఇన్‌స్పైర్ ఫ్యాకల్టీ అవార్డ్స్.
ఇన్‌స్పైర్ అవార్డు మనక్: ఈ స్కీమ్ స్కూల్ స్థాయిలోని ప్రతిభావంతులను సైన్స్ వైపు మళ్లించేందుకు ఉద్దేశించినది. ఆరు నుంచి పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్‌ను వర్తింపజేస్తున్నారు. దీనికింద 10-15 ఏళ్ల వయసు ఉన్నవారికి ‘ఇన్‌స్పైర్ అవార్డు-మనక్’ అందజేస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, సెమీ ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు దీనికి అర్హులు.
ఇంటర్‌తోనే అడుగులు...
- విద్యార్థులకు హైస్కూల్ స్థాయిలోనే ఫిజిక్స్ పరిచయవుతుంది. కానీ, ఫిజిక్స్‌ను లోతుగా చదవడం 10+2/ఇంటర్‌లో మాత్రమే ప్రారంభమవుతుంది. ఇంటర్‌లో ల్యాబ్ వర్క్ ఉంటుంది. ల్యాబ్‌లో ప్రయోగాలు, రికార్డులతో సబ్జెక్టును అర్థంచేసుకోవడం మొదలవుతుంది.
- ఫిజిక్స్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటర్‌లో ఎంీపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూప్‌ను ఎంచుకోవచ్చు. ఆ తర్వాత బీఎస్సీలో ఫిజిక్స్‌ను చదివే వీలుంది. అదేవిధంగా బీటెక్ ఫిజికల్ సెన్సైస్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ లేదా ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ చేయొచ్చు.
- ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటడం ద్వారా ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్ అందిస్తున్న ఫిజిక్స్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
జేఈఈ అడ్వాన్స్ డ్ :
జేఈఈ అడ్వాన్స్ డ్ ద్వారా ఐఐటీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్సుల్లో చేరొచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ చూపడం ద్వారా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ), బెంగళూరు అందిస్తున్న నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(ఫిజిక్స్); ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం ఆఫర్‌చేస్తున్న బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్; ఐఐటీ కాన్పూర్ అందిస్తున్న బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(ఫిజిక్స్); ఐఐటీ మద్రాస్ ప్రవేశం కల్పిస్తున్న బీఎస్-ఎంఎస్ ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ; ఐఐటీ ఖరగ్‌పూర్ అందిస్తున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఫిజిక్స్ కోర్సుల్లో ప్రవేశాలను ఖరారు చేసుకోవచ్చు.
జామ్ :
జామ్ ద్వారా ఐఐఎస్సీ, ఐఐటీల్లో ఎంఎస్సీ ఫిజిక్స్‌తోపాటు ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. జాయింట్ అడ్మిషన్ టెస్ట్(జామ్) ద్వారా ఐఐటీ ఢిల్లీ, గాంధీనగర్, గువహటి, హైదరాబాద్, ఇండోర్, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్ తదితర ఐఐటీల్లో రెండేళ్ల ఎంఎస్సీ, జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ, ఎంఎస్సీ-పీహెచ్‌డీ, డ్యూయల్ డిగ్రీ, ఇతర పోస్ట్-బ్యాచిలర్ కోర్సులో ప్రవేశాలు పొందొచ్చు.
జెస్ట్ :
జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్(జెస్ట్) ద్వారా ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్- ముంబై, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్- బెంగళూరు, ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ-అహ్మదాబాద్ తదితర సంస్థల్లో జెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
నెస్ట్ :
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ(డీఏఈ) ఆధ్వర్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యు కేషన్ అండ్ రీసెర్చ్(నైసర్), భువనేశ్వర్; యూని వర్సిటీ ఆఫ్ ముంబై-డీఏఈ సీఈబీఎస్ ఐదేళ్ల ఇంటి గ్రేటెడ్ ఎంఎస్సీ ఫిజికల్ సైన్స్ కోర్సు అందిస్తున్నా యి. ఈ సంస్థల్లో ప్రవేశానికి నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) రాయాలి. అర్హత: 10+2.
సీఎస్‌ఐఆర్-జేఆర్‌ఎఫ్ :
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్) ఫెలోషిప్‌లు.. యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్లు, జాతీయస్థాయి విద్యాసంస్థలు, జాతీయ లేబొరేటరీల్లోని అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, సైంటిస్ట్‌ల పర్యవేక్షణలో యువతను పరిశోధనల వైపు ఆకర్షించేందుకు ఉద్దేశించినవి. ఏటా రెండుసార్లు నిర్వహించే సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌లో ప్రతిభ చూపడం ద్వారా ఫెలోషిప్‌లను అందుకోవచ్చు. జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.25,000 స్టైపెండ్ లభిస్తుంది. దీంతోపాటు సంవత్సరానికి రూ.20,000 కాంటింజెంట్ గ్రాంట్ అందిస్తారు.
గేట్ :
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) స్కోరుతో దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), బెంగళూరులో కూడా చేరే అవకాశం లభిస్తుంది. ఐఐఎస్సీ తర్వాత విద్యార్థులు ఐఐటీలు, ఎన్‌ఐటీలకు ప్రాధాన్యమిస్తున్నారు.
ప్రోత్సాహకాలు.. ఇవిగో!
కేవీపీవై :
ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులను సైన్స్ పరిశోధనల దిశగా ప్రోత్సహించేలా కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం మూడు స్ట్రీముల్లో కేవీపీవై ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి.. ఫెలోషిప్‌లను ఖరారు చేస్తారు. అవి.. ఎస్‌ఏ స్ట్రీమ్: ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు; ఎస్‌ఎక్స్ స్ట్రీమ్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు; ఎస్‌బీ స్ట్రీమ్: బీఎస్సీ మొదటి సంవత్సరం విద్యార్థులు అర్హులు.
ప్రయోజనాలు: కేవీపీవై ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన విద్యార్థులకు సైన్స్ కోర్సులు అభ్యసించేందుకు ఐదేళ్లపాటు ఫెలోషిప్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఏడాదికోసారి కాంటింజెన్సీ గ్రాంట్ కూడా లభిస్తుంది.
- ఎస్‌ఏ, ఎస్‌ఎక్స్, ఎస్‌బీ స్ట్రీమ్స్‌లో.. బీఎస్సీ, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశించిన విద్యార్థులకు మొదటి మూడేళ్లు నెలకు రూ.5 వేలు చొప్పున ఫెలోషిప్ అందుతుంది. దీంతోపాటు ఏటా రూ.20 వేల కాంటింజెన్సీ గ్రాంట్ లభిస్తుంది.
- మూడు స్ట్రీమ్స్‌లోని చివరి రెండేళు ్ల(పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ స్థాయిలో) నెలకు రూ.7వేల ఫెలోషిప్‌తోపాటు రూ.28వేల వార్షిక కాంటింజెన్సీ గ్రాంట్ అందుతుంది.
ఇన్‌స్పైర్ :
విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే సైన్స్‌పై ఆసక్తి పెంచేందుకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం.. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యూట్ ఫర్ ఇన్‌స్పైర్డ్ రీసెర్చ్ (ఇన్‌స్పైర్)ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతిభావంతులను గుర్తించి.. పాఠశాల నుంచి పీహెచ్‌డీ స్థాయి వరకు ప్రోత్సహిస్తోంది. ఇన్‌స్పైర్ ప్రోగ్రామ్‌ను ఆరోతరగతి నుంచి పోస్ట్ డాక్టోరల్ డిగ్రీ వరకు మూడు విభాగాలుగా విభజించారు. అవి.. 1. స్కీమ్ ఫర్ ఎర్లీ అట్రాక్షన్ ఆఫ్ ట్యాలెంట్స్ ఫర్ సైన్స్ (ఎస్‌ఈఏటీఎస్); 2. స్కాలర్‌షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎస్‌హెచ్‌ఈ); 3. అస్యూర్డ్ ఆపర్చ్యునిటీ ఫర్ రీసెర్చ్ కెరీర్స్ (ఏవోఆర్‌సీ). వీటిని ఐదు సబ్ స్కీమ్‌లుగా వర్గీకరించారు. అవి.. 1. ఇన్‌స్పైర్ అవార్డ్ మనక్; 2. ఇన్‌స్పైర్ ఇంటర్న్‌షిప్; 3. ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్; 4. ఇన్‌స్పైర్ ఫెలోషిప్; 5. ఇన్‌స్పైర్ ఫ్యాకల్టీ అవార్డ్స్.
ఇన్‌స్పైర్ అవార్డు మనక్: ఈ స్కీమ్ స్కూల్ స్థాయిలోని ప్రతిభావంతులను సైన్స్ వైపు మళ్లించేందుకు ఉద్దేశించినది. ఆరు నుంచి పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్‌ను వర్తింపజేస్తున్నారు. దీనికింద 10-15 ఏళ్ల వయసు ఉన్నవారికి ‘ఇన్‌స్పైర్ అవార్డు-మనక్’ అందజేస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, సెమీ ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు దీనికి అర్హులు.
- దేశవ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థుల నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో లక్ష మందిని ఎంపిక చేస్తారు. ఎంపికై న వారికి.. తమ ఆలోచనలకు సంబంధించిన ప్రాజెక్టు/మోడల్‌ను తయారు చేసేందుకు రూ.10,000 అందిస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికయ్యే విద్యార్థులు.. స్టేట్ లెవల్ ఎగ్జిబిషన్‌లో పాల్గొనడానికి అర్హత లభిస్తుంది. ఇక్కడ కూడా విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయిలో నిర్వహించే ఎగ్జిబిషన్లకు పంపిస్తారు. వీరికి దేశంలోని ప్రముఖ సైన్స్ అండ్ టెక్నలాజికల్ సంస్థల సహకారంతో నమూనా అభివృద్ధికి సూచనలు, సలహాలు అందిస్తారు.
- ఇన్‌స్పైర్ ఇంటర్న్‌షిప్; ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్; ఇన్‌స్పైర్ ఫెలోషిప్; ఇన్‌స్పైర్ ఫ్యాకల్టీ అవార్డ్స్‌కు అర్హతలు, ఎంపిక విధానం, ప్రయోజనాలు తదితర వివరాలను www.inspireawards-dst.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
సహనం ఉండాలి.. రీసెర్చ్‌ను కెరీర్‌గా ఎంచుకునేవారు ఓపిగ్గా ముందుకు సాగాలి. సీఎస్‌ఐఆర్-జేఆర్‌ఎఫ్ ద్వా రా ఫెలోషిప్ పొందిన వారు కెరీర్‌లో స్థిరపడేం దుకు ఇతరులతో పోల్చితే కొద్ధిగా ఆలస్యమవు తుంది. కానీ, కొంచె ఓపికతో ముందుకెళ్తే ఉజ్వల భవిష్యత్ లభించడం ఖాయం. జేఆర్‌ఎఫ్ సమయంలో రెండేళ్ల పాటు నెలకు రూ.25 వేల చొప్పున అందిస్తారు. జేఆర్‌ఎఫ్ తర్వాత తగిన అర్హతలతో ఎస్‌ఆర్‌ఎఫ్ కూడా అందుకోవచ్చు. ఫిజిక్స్ రీసెర్చ్ పరంగా అవకాశాలకు కొదవలేదు. టెలికమ్స్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ ఇలా అనేక రంగాల్లో ఫిజిక్స్ అప్లికేషన్స్ అవసరం. కాబట్టి సబ్జెక్టుపై పట్టు పెంచుకుంటూ ముందుకుసాగితే స్థిరమైన కెరీర్‌ను సాకారం చేసుకోవచ్చు. -ఐ.సత్యనారాయణ, రీసెర్చ్ స్కాలర్, హెచ్‌సీయూ. |
Published date : 24 Oct 2018 11:52AM