Skip to main content

పాపులేషన్‌ స్టడీస్‌ కోసం భారత ప్రభుత్వ, ఐక్యరాజ్యసమితి అనుబంధంగా ఏర్పాటు చేసిన.. ఐఐపీఎస్‌ 2021–22 అడ్మిషన్స్‌ నోటిఫికేషన్‌ విడుదల..

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని జనాభా అధ్యయనం కోసం 1956లో ముంబైలో టాటా ట్రస్ట్, భారత ప్రభుత్వంతోపాటు ఐక్యరాజ్యసమితి కలిసి ‘ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌(ఐఐపీఎస్‌)’ ఏర్పాటు చేశాయి.
ఇది ఆసియాæ పసిఫిక్‌ ప్రాంత దేశాల్లో జనాభా అధ్యయన శిక్షణ, పరిశోధన కోసం ప్రాంతీయ కేంద్రంగా పని చేస్తుంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌ 1985 నుంచి విద్యా కార్యకలాపాలను ప్రారంభించింది. దీనికి భారత ప్రభుత్వం ‘డీమ్డ్‌ యూనివర్శిటీ’గా గుర్తింపు ఇచ్చింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నియంత్రణలో పని చేసే ఐఐపీఎస్‌ అందించే కోర్సులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌ 2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐఐపీఎస్‌ అందించే కోర్సులు, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక కథనం.

మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సులు..
ఐఐపీఎస్‌ పాపులేషన్‌ స్టడీస్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్, డాక్టోరల్, పోస్ట్‌–డాక్టోరల్‌ కోర్సులు, ఫెలోషిప్స్‌ను సైతం అందిస్తోంది. ప్రధానంగా ఎంఏ/ఎంఎస్సీ ఇన్‌ పాపులేషన్‌ స్టడీస్, మాస్టర్‌ ఆఫ్‌ పాపులేషన్‌ స్టడీస్‌(ఎంపీఎస్‌), మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ బయో స్టాటిస్టిక్స్‌ అండ్‌ డెమోగ్రఫీ, పీహెచ్‌డీ, పార్ట్‌ టైమ్‌ పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ కోర్సులు అందిస్తోంది.

కోర్సులు, అర్హతలు..
  • ఎంఏ/ఎంఎస్సీ పాపులేషన్‌ స్టడీస్‌: గుర్తింపు పొందిన యూనివర్సిటీ, కాలేజీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీలో 55 శాతం మార్కులు సాధించి నవారు అర్హులు. వయసు 2021 జూన్‌ 30 నాటికి 25 ఏళ్ల లోపు ఉండాలి. ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు.
  • ఎంఎస్సీ బయో స్టాటిస్టిక్స్‌ అండ్‌ డెమోగ్రఫీ (ఎంబీడీ): గుర్తింపు పొందిన యూనివర్సిటీ, కాలేజీ నుంచి బీఏ/బీఎస్సీ ఇన్‌ బయోస్టాటిస్టిక్స్‌/ హెల్త్‌ స్టాటిస్టిక్స్‌/మ్యాథమెటిక్స్‌/స్టాటిస్టిక్స్‌ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. వయసు 2021 జూన్‌ 30 నాటికి 25 ఏళ్ల లోపు ఉండాలి. ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు.
  • మాస్టర్‌ ఆఫ్‌ పాపులేషన్‌ స్టడీస్‌(ఎంపీఎస్‌): బయోస్టాటిస్టిక్స్, డెవలప్‌మెంట్‌ స్టడీస్, ఎకనా మిక్స్, జాగ్రఫీ, హెల్త్‌ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, పాపులేషన్‌ స్టడీస్, పొలిటికల్‌ సైన్స్, పాపులేషన్‌ఎడ్యుకేషన్, సైకాలజీ, రూరల్‌ డెవల్‌మెంట్, సోషల్‌వర్క్, సోషియాలజీ, స్టాటిస్టిక్స్‌లో కనీసం 55శాతం మార్కులతో ఎంఏ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణుల వ్వాలి. వయసు 2021 జూన్‌ 30 నాటికి 28ఏళ్ల లోపు ఉండాలి. ఈ కోర్సు వ్యవధి ఒక సంవత్సరం.
  • పీహెచ్‌డీ ఇన్‌ పాపులేషన్‌ స్టడీస్‌/ బయోస్టాటిస్టిక్స్‌/డెమోగ్రఫీ: ఆయా కోర్సుల్లో 55 శాతం మార్కులతో ఎంఫిల్‌/ఎంఏ/ ఎమ్మెస్సీ/ఎంపీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 2021 జూన్‌ 30 నాటికి 30ఏళ్ల లోపు ఉండాలి. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు.


ఇంకా చ‌ద‌వండి
: part 2:  ఐఐపీఎస్‌ సీటు సాధిస్తే.. నెలకు రూ.31 వేల వరకు స్టయిపెండ్‌..

Published date : 13 Mar 2021 12:36PM

Photo Stories