Skip to main content

నర్సింగ్‌.. సేవకు చిరునామా!!

చదువు పూర్తవుతూనే కొలువులు అందించే కోర్సుల్లో నర్సింగ్‌ ఒకటి. ఆరోగ్య రంగంలో వైద్యుల తర్వాత నర్సింగ్‌ సిబ్బందిదే కీలక పాత్ర. కొవిడ్‌ నేపథ్యంలో..దేశంలో, ప్రపంచంలో నర్సింగ్‌ సేవలకు డిమాండ్‌ మరింతగా పెరిగింది. భారతీయ నర్సులకు విదేశాల్లో ఉజ్వల అవకాశాలు లభిస్తున్నాయి. రాబోయే రోజుల్లో దేశ విదేశాల్లో లక్షల మంది నర్సుల కొరత ఉంటుందని అంచనా.

ఈ నేపథ్యంలో.. నర్సింగ్‌ కోర్సులు, అర్హతలు, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుందాం..

ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం నర్సుల కొరతను ఎదుర్కొంటోంది. కొవిడ్‌–19 కారణంగా నర్సులకు డిమాండ్‌ బాగా పెరిగింది. ముఖ్యంగా భారతీయ నర్సులకు విదేశాల్లో ఆకర్షణీయ వేతనాలు, ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. భారత్‌లోనే చూసుకుంటే.. వచ్చే నాలుగైదేళ్లలో దాదాపు 20లక్షల మంది నర్సుల అవసరం ఉంటుందని అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే రెండేళ్లలో ఏకంగా పదివేల నర్సు పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభమైందని అధికార వర్గాల సమాచారం.

కోర్సులు ఇవే..
నర్సింగ్‌లో ఏఎ¯Œన్‌ఎం/ఎంపీహెచ్‌డబ్ల్యూ, జీఎ¯Œన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నర్సింగ్‌ కోర్సులను అందిస్తున్నాయి. అలాగే జాతీయ స్థాయిలో పేరొందిన ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు విద్యా సంస్థలు సైతం నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.

ఏఎన్‌ఎం/ఎంపీహెచ్‌డబ్ల్యూ..
ఆగ్జిలరీ నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫరీ(ఏఎన్‌ఎం)/మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇంటర్మీడియెట్‌ అర్హతతో ప్రవేశం పొందొచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో వీరికి అవకాశాలు లభిస్తాయి. ఉన్నత చదువులపై ఆసక్తి ఉంటే.. జీఎన్‌ఎం, పోస్ట్‌ బేసిక్‌ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్‌ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు.

జీఎ¯Œన్‌ఎం..
జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ(జీఎ¯Œన్‌ఎం) కోర్సు వ్యవధి మూడేళ్లు. ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ ఇందులో ప్రవేశించొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పలు కళాశాలలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఇంటర్‌ మెరిట్‌తో కోర్సులో చేరే అవకాశం లభిస్తుంది. దీన్ని పూర్తిచేసుకున్నవారు రెండేళ్ల వ్యవధితో పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సును రెగ్యులర్‌ విధానంలో చదవొచ్చు. లేదా ఉద్యోగం చేస్తూనే దూరవిద్యలో ఇగ్నో నుంచి మూడేళ్ల వ్యవధితో డిస్టెన్స్‌ విధానంలో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సును పూర్తిచేయొచ్చు. బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన వారు ఎమ్మెస్సీ నర్సింగ్‌లో చేరే అవకాశం ఉంది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అవకాశాలు లభిస్తాయి.

బీఎస్సీ నర్సింగ్‌..
ఈ కోర్సుకు అత్యధిక డిమాండ్‌ ఉంది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్‌లో 45శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. జాతీయ సంస్థలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. బీఎస్సీ నర్సింగ్‌ గ్రాడ్యుయేట్లకు అన్ని హాస్పిటల్స్‌లో ఉద్యోగాలు లభిస్తాయి. బీఎస్సీ నర్సింగ్‌ అనంతరం ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులు సైతం చదివే అవకాశం ఉంటుంది.

పోస్టు బేసిక్‌ డిప్లొమా..
ఏదైనా విభాగంలో ప్రత్యేక సేవలు అందించాలనుకునేవారు బీఎస్సీ నర్సింగ్‌ తర్వాత ఏడాది వ్యవధిలోని పోస్టు బేసిక్‌ డిప్లొమా కోర్సులో చేరొచ్చు. కార్డియో థొరాసిక్, క్రిటికల్‌ కేర్, మిడ్‌ వైఫరీ, న్యూరో సై¯Œ్స, అంకాలజీ, ఆర్థోపెడిక్‌ అండ్‌ రిహాబిలిటేషన్, సైకియాట్రిక్, నియోనేటల్, ఆపరేష¯ŒS రూమ్, ఎమర్జెన్సీ అండ్‌ డిజాస్టర్, ఆప్తల్మాలిక్, టీబీ, లెప్రసీ తదితర స్పెషలైజేషన్స్‌ను ఎంచుకోవచ్చు.

ఎమ్మెస్సీ నర్సింగ్‌..
ఇందులో కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్, మెడికల్‌ సర్జికల్‌ నర్సింగ్, ఆబ్సెస్ట్రిక్స్‌ అండ్‌ గైనకాలాజికల్‌ నర్సింగ్, మెంటల్‌ హెల్త్‌ నర్సింగ్, చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్‌ స్పెషలైజేషన్లు ఉన్నాయి. కోర్సుS వ్యవధి రెండేళ్లు. బీఎస్సీ నర్సింగ్, పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఎమ్మెస్సీలో చేరవచ్చు. అనంతరం స్పెషాలిటీ విభాగాల్లో ప్రత్యేక సేవలు అందించవచ్చు. లేదా బోధన దిశగా అడుగులేయడానికి ఎంఫిల్, పీహెచ్‌డీ వైపు వెళ్లొచ్చు. బీఎస్సీ నర్సింగ్‌ తర్వాత ఆసక్తి ఉన్నవారు ఎంబీఏ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేష¯ŒS కోర్సును కూడా ఎంచుకోవచ్చు. లేదా కొన్ని సంస్థలు రెండేళ్ల వ్యవధితో అందిస్తోన్న నర్స్‌ ప్రాక్టీషనర్‌ క్రిటికల్‌ కేర్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాంలో చేరొచ్చు.

నైపుణ్యాలు..
నర్సింగ్‌ కెరీర్‌లో రాణించాలనుకునే వారు ఆయా కోర్సులు పూర్తిచేసుకోవడంతోపాటు సేవా భావం, సహనం, మృదుస్వభావం; సహానుభూతి; అంకితభావం వంటి లక్షణాలు పెంపొందించుకోవాలి.

భవిష్యత్‌ బంగారుమయమే..
కరోనా నేపథ్యంలో నర్సింగ్‌ సేవలకు ప్రాధాన్యం, డిమాండ్‌ రెండూ పెరిగాయి. నర్సింగ్‌ కోర్సులు పూర్తిచేసిన వారికి ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంలు, హెల్త్‌ సెంటర్లు, విద్యా సంస్థలు, ఓల్డేజ్‌ హోంలు, కార్పొరేట్‌ సంస్థల్లో అవకాశాలుంటాయి. బీఎస్సీ నర్సింగ్, జీఎ¯ŒSఎం కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలతో కొలువులు లభిస్తాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, హెల్త్‌ సెంటర్లు, సంక్షేమ వసతి గృహాల్లో సేవలు అందించడానికి నర్సింగ్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీరికి ప్రారంభ వేతనం రూ.25వేలకు పైగా లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర అలవెన్సులు అందుతాయి. బీఎస్సీ నర్సింగ్‌ అభ్యర్థులు.. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ప్రారంభంలో నెలకు రూ.20వేలకు పైగా వేతనం అందుకునే వీలుంది.

విదేశాల్లో డిమాండ్‌..
నర్సింగ్‌ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి విదేశాల్లోనూ ఉజ్వల అవకాశాలు లభిస్తున్నాయి. సేవాభావం, సబ్జెక్టుపై పట్టు, ఇంగ్లిష్‌ ప్రావీణ్యం ఉంటే యూకే, యూరప్‌ దేశాల్లో ప్రారంభంలోనే ఆకర్షణీయ వేతనం, వసతి, సౌకర్యాలు లభిస్తున్నాయి. దీంతోపాటు గల్ఫ్, యూఎస్, యూకే, కెనడా, సింగపూర్, మిడిల్‌ ఈస్ట్‌ల్లో భారతీయ నర్సులకు డిమాండ్‌ ఉంది.

అర్హత పరీక్షలు..
విదేశాల్లో ఉద్యోగాన్ని ఆశించేవారు ఆయా దేశాలు నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. యూఎస్‌ కోసం ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్టు(టోఫెల్‌ లేదా ఐఈఎల్‌టీఎస్‌)లో స్కోరు, నేషనల్‌ కౌన్సిల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జామినేష¯Œన్‌–రిజిస్టర్డ్‌ నర్స్‌ (ఎ¯Œన్‌సీఎల్‌ఈఎక్స్‌–ఆర్‌ఎ¯Œన్‌)లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. కెనడాలో స్థిరపడాలనుకొనే వారు కెనడియ¯Œన్‌ రిజిస్టర్డ్‌ నర్సెస్‌ ఎగ్జామ్‌(సీఆర్‌ఎ¯Œన్‌ఈ), దుబాయ్‌లో పనిచేయడానికి దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ నిర్వహించే పరీక్ష, సౌదీ అరేబియాకు ప్రొమెట్రిక్‌ పరీక్ష, ఖతార్‌కు సుప్రీం కౌన్సిల్‌ ఆఫ్‌ హెల్త్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. కొన్ని గల్ఫ్‌ దేశాలు రెండు మూడేళ్ల అనుభవం ఉన్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి.

Published date : 12 Nov 2020 03:58PM

Photo Stories