నిట్‌ల్లో ఎమ్మెస్సీకి సీసీఎంఎన్ 2021 నోటిఫికేషన్.. వివరాలు తెలుసుకోండిలా..
ప్రస్తుతం సీపీఎంఎన్–2021 కౌన్సెలింగ్ ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో.. సంబంధిత వివరాలు..
సీసీఎంఎన్–2021..
సీసీఎంఎన్ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రతి ఏటా ఏదో ఒక ఎన్‌ఐటీ నిర్వహిస్తుంది. ప్రస్తుత ఏడాదికి జైపూర్ ఎన్‌ఐటీ.. కౌన్సెలింగ్ నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. ఇటీవల ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 22 ఇన్‌స్టిట్యూట్స్ ఇందులో పాల్గొంటున్నాయి. అందుబాటులో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 1889.
ప్రవేశాలు కల్పించే ఇన్‌స్టిట్యూట్స్..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) జలంధర్, జైపూర్, భోపాల్, అలహాబాద్, అగర్తలా, కాలికట్, దుర్గాపూర్, హమిర్‌పూర్, సూరత్‌కల్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కీం, జంషెడ్‌పూర్, మణిపూర్, రూర్కేలా, సిల్చర్, శ్రీనగర్, తిరుచిరాపల్లి, వరంగల్, నాగ్‌పూర్‌తోపాటు షిబర్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సంత్‌లోంగోవాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.. సీసీఎంఎన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
అందుబాటులో ఉన్న కోర్సులు..
- ఎమ్మెస్సీ ఇన్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ ఇన్ మ్యాథమెటిక్స్
- ఎమ్మెస్సీ ఇన్ ఫిజిక్స్
- ఎమ్మెస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్
- ఎమ్మెస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్
- ఎమ్మెస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్
- ఎమ్మెస్సీ ఇన్ అప్లయిడ్ జియాలజీ అండ్ జియోఇన్ఫర్మాటిక్స్
- ఎమ్మెస్సీ అప్లయిడ్ జియాలజీ, ఎమ్మెస్సీ ఇన్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్
- ఎమ్మెస్సీ ఇన్ అప్లయిడ్ కెమిస్ట్రీ
- ఎమ్మెస్సీ ఇన్ అనలిటికల్ కెమిస్ట్రీ
- ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ
- ఎమ్మెస్సీ అప్లయిడ్ మ్యాథమెటిక్స్
- ఎమ్మెస్సీ(టెక్) ఇంజనీరింగ్ ఫిజిక్స్
- ఎమ్మెస్సీ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ న్యూట్రిషన్ సైన్సెస్.
అర్హతలు..
సీసీఎంఎన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు జామ్–2021 స్కోర్‌ను కలిగి ఉండాలి. దాంతోపాటు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత డిగ్రీలో జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు కనీసం 6.5సీజీపీఏ (10 పాయింట్స్ స్కేల్) లేదా 60శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు కనీసం 55 శాతం మార్కులు సాధించాలి.
ఎంపిక విధానం..
సీసీఎంఎన్ 2021 కౌన్సెలింగ్ ప్రక్రియను మొత్తం మూడు రౌండ్లలో నిర్వహించనున్నారు. సీట్లు మిగిలిపోతే స్పెషల్ రౌండ్స్ ద్వారా భర్తీ చేస్తారు. సీసీఎంఎన్ ఎంపిక విధానాన్ని రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్, సీట్ అలాట్‌మెంట్, కౌన్సెలింగ్, కన్ఫర్మేషన్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ ద్వారా నిర్వహిస్తారు.
మూడు రౌండ్‌లు..
సీసీఎంఎన్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం మూడు రౌండ్లు, రెండు స్పెషల్ రౌండ్లలో జరుగుతుంది. అభ్యర్థులు ఆయా రౌండ్లకు నిర్దేశించిన తేదీల్లోనే తమకు లభించిన సీటు విషయంలో ఆమోదం తెలిపి, ఆన్‌లైన్‌లో యాక్సప్టెన్స్ ఫీజు చెల్లించాలి. అదే విధంగా.. ఫీజు చెల్లించే ముందే నిర్దేశిత డాక్యుమెంట్లు(అకడమిక్ సర్టిఫికెట్లు, జామ్ స్కోర్లు, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు) ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాలి. ఇలా అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్ చేస్తారు.
తదుపరి రౌండ్లకు ఇలా..
- సీసీఎంఎన్ కౌన్సెలింగ్‌లో మొదటి రౌండ్ నుంచి మూడో రౌండ్ వరకు తదుపరి రౌండ్లకు పాల్గొనేందుకు ఫ్లోట్, స్లైడ్, ఫ్రీజ్ అనే మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
- ఫ్లోట్ ఆప్షన్ ప్రకారం–మొదటి రౌండ్‌లో తమకు వచ్చిన సీటు లేదా ఇన్‌స్టిట్యూట్‌పై ఆసక్తి లేని విద్యార్థులు.. తదుపరి రౌండ్ కోసం ఫ్లోట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- స్లైడ్ ఆప్షన్ ప్రకారం– తమకు సీటు వచ్చిన ఇన్‌స్టిట్యూట్‌లోనే మరో మంచి స్పెషలైజేషన్‌లో సీటు కోరుకుంటూ.. తదుపరి రౌండ్ల కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలనుకునే విద్యార్థులు స్లైడ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఈ ఆప్షన్‌ను ఎంచుకున్న విద్యార్థులను ముందుగా వారికి సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్‌లోనే తదుపరి రౌండ్‌కు పరిగణనలోకి తీసుకుంటారు.
- ఫ్రీజ్ ఆప్షన్ ప్రకారం–తమకు లభించిన సీటు విషయంలో సంతృప్తి చెంది.. ఇతర రౌండ్లలో పాల్గొనే అవసరం లేదని భావించే విద్యార్థులు ఫ్రీజ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- యాక్సప్టెన్స్ ఫీజు చెల్లించిన వారికే ఫ్లోట్, స్లైడ్, ఫ్రీజ్ ఆప్షన్లు అందుబాటులో ఉంచుతారు.
- తొలి రౌండ్‌లో లభించిన సీటుకు యాక్సెప్టెన్స్ ఇవ్వకుండా, ఫీజు చెల్లించకుండా ఉంటే.. తదుపరి రౌండ్లకు దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి తదుపరి రౌండ్లకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా తొలి రౌండ్‌లో లభించిన సీటు /ఇన్‌స్టిట్యూట్‌కు ఆమోదం తెలిపి ఫీజు చెల్లించాలి.
- మొత్తం మూడు రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ఎంపికైన అభ్యర్థులు సంబంధిత ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం పొందడానికి ప్రొవిజినల్ అలాంట్‌మెంట్ లెటర్స్(పీఏఎల్) పొందవచ్చు.
- ఈ మూడు రౌండ్లలో సీటు లభించని అభ్యర్థులు మిగిలిపోయిన సీట్లుకు సంబంధించి.. స్పెషల్ రౌండ్స్ ద్వారా సీటు పొందే అవకాశం లభిస్తుంది.
సీసీఎంఎన్–2021– ముఖ్యమైన సమాచారం..
- రిజిస్ట్రేషన్: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: జూన్ 28, 2021
- ఫీజు చెల్లింపు చివరితేదీ: జూన్ 28, 2021
- ఛాయిస్ ఫిలింగ్, లాకింగ్ చివరి తేదీ: జూన్ 29, 2021
- ఫస్ట్ రౌండ్ సీటు కేటాయింపు: జులై 03, 2021
- మొదటి రౌండ్ సీటు యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడింగ్: 3–8 జులై 2021
- ఆన్‌లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్: జులై 4– జులై 9 వరకు.
- సెకండ్ రౌండ్ సీట్ అలాట్‌మెంట్: 14 జులై 2021
- సెకండ్ రౌండ్ సీటు యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడింగ్: 14–19 జులై 2021
- సెకండ్ రౌండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్: జులై 15–20 వరకూ
- థర్డ్ రౌండ్ సీట్ అలాట్‌మెంట్: 24 జులై 2021
- థర్డ్ రౌండ్ సీటు యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్ అప్‌లోడింగ్: 24–28 జులై 2021
- థర్డ్ రౌండ్ ఆన్‌లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్: జులై 25– జులై 29 వరకు
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ccmn.admissions.nic.in