నీట్ నేషనల్ పూల్‌లో.. తెలుగు రాష్ట్రాలు
Sakshi Education
ఎంబీబీఎస్.. తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య చాలా పరిమితం. కాని మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి ఏటా దాదాపు లక్ష మందికిపైగానే పోటీ పడతారు. ఇలాంటి పరిస్థితుల్లో.. నేషనల్ పూల్‌లో అడుగుపెట్టాలని తెలుగు రాష్ట్రాలు నిర్ణయించాయి. వచ్చే ఏడాది నుంచే నేషనల్ పూల్‌లో మన విద్యార్థులకు ప్రవేశాలు ఖరారు అయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో... అసలు నేషనల్ పూల్ అంటే ఏమిటి? నేషనల్ పూల్‌లో చేరడం వల్ల విద్యార్థులకు కలిగే లాభ నష్టాలపై విశ్లేషణ...
నేషనల్ పూల్ అంటే ?
నేషనల్ పూల్ అంటే.. జాతీయ స్థాయిలో ఉన్న మెడికల్ కళాశాలల జాబితాలో చేరడం! దీని ఫలితంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ మెడికల్ సీట్లలో 15 శాతం, ప్రైవేటు కళాశాలల్లోని ‘ఏ’ కేటగిరీ సీట్లలో 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. ఫలితంగా ఇతర రాష్ట్రాలోని సీట్లకు పోటీ పడే అర్హత లభిస్తుంది. ఉదాహరణకు మహారాష్ట్రను పరిగణనలోకి తీసుకుంటే.. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లోని మొత్తం సీట్లలో 15 శాతం, అలాగే ప్రైవేటు కళాశాలల్లో ‘ఏ’ కేటగిరీలోని 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఫలితంగా ఇతర రాష్ట్రాలోని 15 శాతం సీట్లకు మహారాష్ట్ర విద్యార్థులు పోటీ పడే వీలు కలుగుతుంది.
ఈ మూడు రాష్ట్రాలు దూరంగా...
నేషనల్ పూల్ పరంగా ప్రస్తుతం దేశంలోని మూడు రాష్ట్రాలు దూరంగా ఉన్నాయి. అవి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్ముకాశ్మీర్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విషయంలో.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు∙అమల్లోకి తెచ్చిన ఆర్టికల్ 371డి, ఆరు సూత్రాల పథకం కారణంగా ఇవి ఇప్పటివరకు నేషనల్ పూల్‌లో చేరలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లోని సీట్లకు పోటీ పడే అవకాశం లభించడం లేదు.
పరీక్ష జాతీయం... ప్రవేశాలు స్థానికం :
గతేడాది నుంచి మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్–యూజీ పేరుతో జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. కారణం.. రాష్ట్రాల స్థాయిలోనే తెలంగాణ హెల్త్ యూనివర్సిటీ, ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీలు స్థానికంగానే కౌన్సెలింగ్ నిర్వహించి ఈ రాష్ట్రాల్లో ఉన్న సీట్లనే భర్తీ చేశాయి. కానీ ఇతర రాష్ట్రాలు నేషనల్ పూల్‌లో ఉండటం వల్ల.. జాతీయ స్థాయిలో 15 శాతం సీట్లకు పోటీ పడి.. కౌన్సెలింగ్‌కు హాజరై సీట్లు పొందే అవకాశం లభించింది.
నేషనల్ పూల్‌కు సమ్మతి :
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ సీట్ల సంఖ్య మూడు వేల లోపే. ప్రైవేటు ‘ఏ’ కేటగిరీ సీట్లు కూడా రెండు వేలకు మించవు. మరోవైపు నేషనల్ పూల్‌లో కూడా లేకపోవడం వల్ల.. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించినా.. ఇతర రాష్ట్రాల్లో ప్రవేశం పొందే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితిపై నిరసనలు వ్యక్తమవడంతో.. రెండు రాష్ట్రాలు కలిసి తాము నేషనల్ పూల్‌లోకి చేరేందుకు ఆమోదం తెలుపుతూ ఇటీవలే లేఖను ఇచ్చాయి.
వచ్చే ఏడాది నుంచే...
నేషనల్ పూల్‌కు రెండు తెలుగు రాష్ట్రాలు సమ్మతి తెలిపిన నేపథ్యంలో... వచ్చే విద్యా సంవత్సరం(2018–19) నుంచే మన విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల్లోని ఏ కేటగిరీ సీట్లలో 15 శాతం సీట్లకు పోటీ పడే అవకాశం లభించనుంది. దీంతో మన అభ్యర్థులకు లభించే సీట్ల సంఖ్య దాదాపు రెట్టింపు కానుంది. జాతీయ స్థాయిలో అదనంగా సుమారు నాలుగున్నర వేల సీట్లకు పోటీ పడే అవకాశం అందుబాటులోకి రానుంది. నేషనల్ పూల్‌లోకి వెళితే కేవలం ఎంబీబీఎస్ సీట్లకే కాకుండా.. జాతీయ స్థాయిలో బీడీఎస్ కోర్సులో ఉన్న ప్రభుత్వ సీట్లలో 15 శాతం సీట్లకు పోటీ పడేందుకు మార్గం ఏర్పడుతుంది.
మన సీట్లలో 15 శాతం కోత :
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నేషనల్ పూల్‌లోకి వెళితే.. ఈ రాష్ట్రాల్లోని ప్రభుత్వ కళాశాలలు, ప్రయివేట్ ఏ కేటగిరీలోని 15శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్‌లో 285 ప్రభుత్వ సీట్లు, ప్రైవేటు ఏ కేటగిరీలో 157 సీట్లను ఇతర రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణలో 165 ప్రభుత్వ సీట్లు, ప్రయివేటు ఏ కేటగిరీ సీట్లు 157 ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించాలి.
ఆ స్థాయి ప్రతిభ అవసరం...
నేషనల్ పూల్‌లోకి వెళ్లడం మన విద్యార్థులకు ఉపయుక్తమే. అయితే జాతీయ స్థాయిలో జరిగే నీట్–యూజీ పరీక్షలో మరింత ప్రతిభ చూపాల్సి ఉంటుంది. గత ఏడాది తొలిసారిగా నిర్వహించిన నీట్–యూజీలో మన విద్యార్థులు కొంత తడబడ్డారు. వాస్తవానికి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల విద్యార్థులకు అందుబాటులో ఉండే 15 శాతం సీట్లకు లక్షల సంఖ్యలో పోటీపడతారు. కాబట్టి మన విద్యార్థులు పోటీని పరిగనణలోకి తీసుకొని సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా లోతైన ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది.
విద్యార్థులకు ప్రయోజనం..
నేషనల్ పూల్‌లోకి వెళ్లడం వల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. మనం 15శాతం సీట్లను వదులుకున్నప్పటికీ.. మనకున్న మొత్తం సీట్లకు రెట్టింపు సంఖ్యలో సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే దీనిపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు లేఖ రాశాయి. వచ్చే ఏడాది నుంచే మన విద్యార్థులు నేషనల్ పూల్‌లోని 15 శాతం సీట్లకు పోటీపడొచ్చు. వీరు నీట్ ర్యాంకు ఆధారంగా.. డీజీహెచ్‌ఎస్ ఆధ్వర్యంలోని ఎంసీసీ నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
– డాక్టర్.బి.కరుణాకర్ రెడ్డి
వైస్ ఛాన్స్‌లర్, కె.ఎన్.ఆర్.యు.హెచ్.ఎస్.
(తెలంగాణ హెల్త్ యూనివర్సిటీ)

Published date : 06 Dec 2017 04:14PM