నెస్ట్‌లో విజయం సాధించాలంటే.. ఇలా చదివితే మేలు..
Sakshi Education
నెస్ట్‌లో ఆయా విభాగాల నుంచి అడిగే ప్రశ్నలు సైన్స్ పట్ల అభ్యర్థుల ఆసక్తిని, పరిశోధన దృక్పథాన్ని, విశ్లేషణ సామర్థ్యాన్ని గుర్తించే విధంగా ఉంటాయి.
- జనరల్ ఆప్టిట్యూడ్ (సెక్షన్–1): ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు విద్యార్థుల్లో సైన్స్ కోర్సుల పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించే విధంగా ఉంటాయి. కాబట్టి ఇటీవల కాలంలో సైన్స్‌లో వస్తున్న మార్పుల గురించి తెలుసుకోవాలి.
- బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాలకు సంబంధించి అడిగే ప్రశ్నలు.. విద్యార్థుల్లోని విశ్లేషణాత్మక దృక్పథం, సంగ్రహణ సామర్థ్యం, తులనాత్మక విశ్లేషణను గుర్తించేలా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి కాన్సెప్ట్‌లపై పట్టు సాధించడంతోపాటు వాటిని వాస్తవ పరిస్థితుల్లో అన్వయించగలిగే నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఇందుకోసం చదువుతున్న అంశాలను ప్రాక్టీస్ చేయడం ఎంతో లాభిస్తుంది.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు..
నెస్ట్ ఎంట్రన్స్.. విభాగాల వారీగా సిలబస్‌కు సంబంధించి గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే.. ప్రశ్నలు సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగా అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు పది, పదకొండు, పన్నెండు తరగతుల సీబీఎస్‌ఈ పుస్తకాలను ఔపోసన పట్టడం మంచిది. ముఖ్యంగా కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి.
ఇంకా చదవండి: part 3: నెస్ట్‌లో మంచి ర్యాంకు సాధించి సీటు పొందితే ఉజ్వల భవిష్యత్తు..!
Published date : 25 Feb 2021 06:35PM