నెస్ట్ ద్వారా సీటు పొందితే నెలకు రూ.5వేల వరకూ ఆర్థిక ప్రోత్సాహకం.. దరఖాస్తుకు చివరి తేది..
Sakshi Education
నెస్ట్ ఉత్తీర్ణతతో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులకు నెలకు రూ.5,000 స్కాలర్‌షిప్ అందుతుంది.
ఇన్‌స్పైర్ విజేతలకు ఈ స్కాలర్‌షిప్ నేరుగా లభిస్తుంది. ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్ లేని వారికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రవేశ పెట్టిన దిశ ప్రోగ్రామ్ ద్వారా నెలకు రూ.5000 స్కాలర్‌షిప్ లభిస్తుంది. దీనికి అదనంగా ఏటా సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేసేందుకు రూ.20 వేలు గ్రాంట్ మంజూరు చేస్తారు.
ప్రయోజనాలు..
- నైసర్–భువనేశ్వర్, యూనివర్సిటీ ఆఫ్ ముంబై –డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌తోపాటు.. ప్రస్తుతం దేశంలో పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు ఐదేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సైన్సెస్‌పై పరిపూర్ణ అవగాహన, నైపుణ్యాలు లభిస్తున్నాయి.
- ఇంటిగ్రేటెడ్ పీజీ పూర్తి చేసిన వారికి పీహెచ్‌డీ ప్రవేశాల్లోనూ ప్రాధాన్యత దక్కుతోంది. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి భవిష్యత్తులో రీసెర్చ్ ల్యాబ్స్‌లో, సంస్థల ఆర్ అండ్ డీ సెంటర్లలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అదే విధంగా ఈ అర్హతతో పీహెచ్‌డీలో ప్రవేశం పొంది.. దాన్ని పూర్తి చేస్తే యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీగా, ప్రముఖ రీసెర్చ్ సంస్థల్లో సైంటిస్ట్‌లుగా రూ.లక్షల వేతనంతో కెరీర్ సొంతం చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం..
- అర్హత: ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌ల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ/ఎస్టీలు, దివ్యాంగులు కనీసం 55 శాతం మార్కులు పొందాలి. 2021లో ఫైనల్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30,2021
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: మే 20,2021
- నెస్ట్ నిర్వహణ తేదీ: జూన్ 14 ,2021
- ఫలితాల వెల్లడి: జూన్ 30,021
- తెలుగు రాష్ట్రాలో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nestexam.in
ఇంకా చదవండి: part 1: పరిశోధనలకు బెస్ట్ అయిన నెస్ట్ 2021కు నోటిఫికేషన్ విడుదల.. వివరాలు ఇవే..
Published date : 25 Feb 2021 06:39PM