Skip to main content

నెస్ట్‌–2020 పరీక్ష విధానంపై సమగ్ర సమాచారం...

నేషనల్‌ ఎంట్రెన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌. సైన్స్‌ విద్యార్థులకు సువర్ణావకాశం నెస్ట్‌. ఈ పరీక్షలో ప్రతిభ ద్వారా ఇంటర్‌తోనే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ కోర్సుల్లో (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) ప్రవేశం పొందొచ్చు. అదికూడా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన నైసర్, భువనేశ్వర్‌; యునివర్సిటీ ఆఫ్‌ ముంబయి–డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌లో! వీటిల్లో అడ్మిషన్‌ లభిస్తే.. ప్రతి ఏటా రూ.60వేల స్కాలర్‌షిప్‌ సైతం అందుకోవచ్చు.

నెస్ట్‌ 2020కు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో నెస్ట్‌తో ప్రయోజనాలు.. దరఖాస్తుకు అర్హతలు... పరీక్ష విధానంపై సమగ్ర సమాచారం...

కోర్సు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ).

సీట్ల సంఖ్య: నైసర్‌ భువనేశ్వర్‌లో 200, యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయిలో 57.

ఎంపిక ప్రక్రియ :
నెస్ట్‌ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెరిట్, రిజర్వేషన్, కటాఫ్‌లను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం కల్పిస్తారు.

ప్రయోజనాలు :
  • నెస్ట్‌లో ప్రతిభ ద్వారా నేషనల్‌∙ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(నైసర్‌), భువనేశ్వర్‌; యునివర్సిటీ ఆఫ్‌ ముంబయి–డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (సీఈబీఎస్‌)లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. 
  • వీటిల్లో చేరిన విద్యార్థులకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ నిర్వహించే దిశ కార్యక్రమం కింద ఏడాదికి రూ.60 వేల స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. అంతేకాకుండా సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ కోసం ఏడాదికి రూ.20,000 గ్రాంట్‌ కూడా పొందొచ్చు. 
  • కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ ఏర్పాటు చేసిన నైసర్‌ భువనేశ్వర్, సీఈబీఎస్‌ల ప్రధాన ఉద్దేశం దేశంలో కట్టింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీల్లో పరిశోధనలు జరిగేలా ప్రోత్సహించడం.
అర్హతలు :
  •    నెస్ట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌లో 10 + 2 / తత్సమాన విద్యలో సైన్స్‌ గ్రూప్‌లో 60 శాతం మార్కులతో 2018, 2019లోపు ఉత్తీర్ణులైనవారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల 55శాతం మార్కులు సాధించి ఉంటే సరిపోతుంది.
  •     2020లో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్య ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రాసేవారు కూడా అర్హులే.
పరీక్ష విధానం :
  • నెస్ట్‌ కంప్యూటర్‌ ఆధారితంగా ఆన్‌లైన్‌ విధానంలో(సీబీటీ) జరుగుతుంది. మొత్తం 230 మార్కులకు ఉండే ఈ పరీక్షను ఐదు సెక్షన్‌లుగా (సెక్షన్‌–1,2,3,4,5)గా నిర్వహిస్తారు. 
  • సెక్షన్‌ 1–జనరల్‌ సెక్షన్‌–30 మార్కులకు ఉంటుంది. సెక్ష¯Œ  2 బయాలజీ– 50; సెక్షన్‌ 3 కెమిస్ట్రీ–50, సెక్షన్‌ 4 మ్యాథమెటిక్స్‌–50, సెక్షన్‌ 5 ఫిజిక్స్‌–50 మార్కులకు... ఇలా అన్ని సెక్షన్‌లు కలిపి మొత్తం 230 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 3గంటల 30 నిమిషాలు. 
  • సెక్షన్‌(1) జనరల్‌ సెక్షన్‌కు సంబంధించి ఎటువంటి నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు.. సబ్జెక్ట్‌ సెక్షన్‌లకు సంబంధించి మాత్రం నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది.
  • నెస్ట్‌కు ప్రత్యేకించి సిలబస్‌ అంటూ ఏమిలేదు. 10 + 2 లేదా తత్సమాన కోర్సుల∙11, 12 తరగతుల్లోని సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
కెరీర్‌ :
ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పూర్తిచేసిన∙వారికి కెరీర్‌ పరంగా ఎటువంటి ఢోకా ఉండదు. సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ పూర్తిచేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైంటిస్టులుగా రాణించే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌లుగా పనిచేయచ్చు.

దరఖాస్తు ఫీజు :

జనరల్, ఓబీసీ, ఈడబ్యు్లఎస్‌ అభ్యర్థులు రూ. 1200, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.600 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.

ముఖ్యమైన సమాచారం:
దరఖాస్తు విధానం
: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రారంభతేదీ: జనవరి 07, 2020
దరఖాస్తులకు ముగింపు తేదీ: ఏప్రిల్‌ 03, 2020
పరీక్ష తేదీ: జూన్‌ 06, 2020
పరీక్ష ఫలితాలు: జూన్‌ 16, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌www.nestexam.in
Published date : 10 Jan 2020 06:28PM

Photo Stories