Skip to main content

నేషనల్ అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ అంటే.. ఎంటో తెలుసుకోండిలా..

యూజీసీ తాజాగా ప్రతిపాదించిన నేషనల్ అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ విధానం ప్రకారం-ఏదైనా కోర్సులో చేరిన విద్యార్థులు.. తాము ఆయా సబ్జెక్ట్‌లలో పొందిన క్రెడిట్స్‌ను ఒకేచోట నిక్షిప్తం చేసుకోవచ్చు.

ఇలా నిక్షిప్తం చేసే కేంద్రమే.. నేషనల్ అకడమిక్ క్రెడిట్ బ్యాంక్! దీన్ని యూజీసీ పర్యవేక్షిస్తుంది. విద్యార్థులు చేయాల్సిందల్లా తాము ఆయా కోర్సుల్లో పొందిన క్రెడిట్స్‌ను నేషనల్ అకడమిక్ క్రెడిట్ బ్యాంకులో నమోదు చేయడమే. ఇలా ఒకసారి క్రెడిట్స్ నమోదైన తర్వాత.. విద్యార్థి ఆయా కోర్సును మధ్యలో మానేసి.. వేరే కోర్సులో చేరినా.. అప్పటి వరకు పొందిన క్రెడిట్స్‌ను కొత్త కోర్సుకు బదిలీ చేస్తారు. ఇలా బదిలీ అయిన క్రెడిట్స్‌ను సదరు కొత్త కోర్సు పూర్తి చేయడానికి అవసరమైన నిర్ణీత క్రెడిట్స్‌కు కలుపుతారు. ఫలితంగా విద్యార్థులు కొత్త కోర్సులోని అన్ని సబ్జెక్ట్‌లను మళ్లీ చదవాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది.

  1. ఉదాహరణకు.. ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థి.. తాను మొదటి సంవత్సరంలో పొందిన క్రెడిట్స్‌ను.. క్రెడిట్ బ్యాంక్‌లో నమోదు చేసుకొని.. ఆ తర్వాత రెండో ఏడాది బీఎస్సీ కోర్సులో చేరితే.. ఇంజనీరింగ్‌లో పొందిన క్రెడిట్స్‌ను బీఎస్సీ కోర్సుకు కలుపుతారు.

పవేశం, నిష్ర్కమణం..
యూజీసీ అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ విధానం ప్రకారం-ఉన్నత విద్య విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏ కోర్సులోనైనా, ఎప్పుడైనా చేరొచ్చు. ఎప్పుడైనా మానేయొచ్చు. మళ్లీ ఆ కోర్సును చదవాలనుకుంటే.. తమకు దగ్గరిలోని గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లో చేరొచ్చు. ఉదాహరణకు ఒక యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలో బీకాంలో చేరిన అభ్యర్థి.. మొదటి సంవత్సరం పూర్తయ్యాక కోర్సు మానేసి.. మళ్లీ రెండేళ్ల తర్వాత అదే కోర్సులో చేరాలనుకుంటే నిస్సందేహంగా చేరొచ్చు. విద్యార్థి తాను మొదట బీకాంలో ప్రవేశించిన ఇన్‌స్టిట్యూట్‌లోనే చదవాలనే నిబంధన కూడా లేదు. వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా తనకు సమీపంలోని, లేదా అనుకూలమైన మరో గుర్తింపు పొందిన కాలేజీలో రెండో సంవత్సరంలో చేరొచ్చు. అంతకుముందు పొందిన క్రెడిట్స్‌ను కూడా కొత్త ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సులో కలిపేస్తారు.

ఇంకా చదవండి: part 3: మూక్స్ విధానంలో సాధించిన క్రెడిట్స్ సైతం బదిలీకి అవకాశం..

Published date : 17 Feb 2021 01:55PM

Photo Stories