నేర్చుకోవడంపైనే దృష్టి పెట్టండి : మోదీ
Sakshi Education
న్యూఢిల్లీ: మొదలుపెట్టిన ఏ పనినీ మధ్యలోనే వదిలిపెట్టవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులకు సూచించారు.
ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో జరిగిన ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని పాఠశాలలో విద్యార్థులు చూసే విధంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేరే ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు కూడా ప్రధానిని ప్రశ్నలు అడిగే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల ఒత్తిడిని అధిగమించడంపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మోదీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మీరంతా ఈ రోజు దేశ ప్రధానితో మాట్లాడడం లేదు. మీ స్నేహితుడితో మాట్లాడుతున్నారు. ఈ రోజు నేనో విద్యార్థిని. మీరు నా ఎగ్జామినర్లు. అయితే మీరు 10 మార్కులకుగాను నాకు ఎన్ని మార్కులు వేస్తారో చెప్పండి! అంటూ మొదటి మాటతోనే విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు.
పరీక్షల సీజన్ వచ్చేస్తోంది. దీంతో అవి రాసే విద్యార్థుల్లోనేకాదు.. వారి తల్లిదండ్రుల్లోనూ ఏదో ఆందోళన. పిల్లల్ని ఓ కంట కనిపెట్టడం, వారి ఆరోగ్యం బాగుండేలా జాగ్రత్తగా చూసుకోవడం, ఎటువంటి డిస్ట్రబెన్‌స లేకుండా చదువుకునే వాతావరణాన్ని కల్పించడం వంటివి తల్లిదండ్రులకు పరీక్షే. అయితే తమకున్న అనుభవంతో తల్లిదండ్రులు ఎలాగోలా గట్టెక్కుతారు. మరి పిల్లల పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నకు దేశ ప్రధానే స్వయంగా సమాధానమిచ్చారు. అదేంటో ఓసారి చదివేద్దామా..
పరీక్షల భయం పోవాలంటే..?
చదువుల తల్లిగా సరస్వతిని కొలుస్తాం. పరీక్షలు వచ్చేసరికి హనుమంతుడిని తలుచుకుంటాం. ఎందుకో తెలుసా.. పరీక్షలంటే మనకు భయం. పరీక్ష కంటే ముందు మనమంతా భయాన్ని జయించాలి. అందుకు ఆత్మవిశ్వాసం అవసరం. అది మీలో ఉంటే ఎటువంటి కష్టం వచ్చినా సులభంగా అధిగమిస్తారు.
ఏకాగ్రతగా చదవాలంటే..?
ఏదైనా ఒకే పనిమీద మనసును కేంద్రీకరించడమే ఏకాగ్రత. ఇది ఎక్కడో నేర్చుకుంటే రాదు. ఇందుకు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. అందుకు మనముందున్న మంచి మార్గం యోగా. దీనినే వ్యాయామం అని కూడా అంటారు. ఆరోగ్యంగా ఉండేవారు ఏదైనా సాధిస్తారు.
స్ట్రెస్‌ను అధిగమించాలంటే..?
పరీక్షలంటేనే పోటీ..! అయితే మీ పోటీ ఇతరులతో ఉండకూడదు. మీతో మీరే పోటీ పడాలి. ఒకవేళ ఇతరులతో పోటీ పడాల్సి వస్తే ప్రత్యర్థుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. చదువు కోసం ఎన్ని గంటలు కేటాయిస్తారో నిర్ణయించుకొని, క్రమంగా గంటలు పెంచుకుంటూ వెళ్తే... ఒత్తిడి దానంతట అదే దూరమవుతుంది.
పేరెంట్స్ నుంచి ఎదురయ్యే ఒత్తిడిని ఎలా అధిగమించాలి?
తల్లిదండ్రులు అనే మాటలను తప్పుగా భావించవద్దు. వారు మీకోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనం మంచిస్థాయిలో ఉంటే చూడాలనుకుంటారు. అందుకే వారు అన్న మాటలను పాజిటివ్‌గా తీసుకోండి. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇతరులతో పోల్చవద్దు. ర్యాంకులను స్టేటస్‌గా చూడొద్దు. ఇది పేరెంట్స్‌కు నేను చేస్తున్న ప్రత్యేక విజ్ఞప్తి.
దినచర్యను మార్చుకోవాలా?
పరీక్షల సమయంలో ఇష్టాలన్నింటినీ పక్కన పెట్టేస్తారు. ఇది సరికాదు. అలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయనుకోవడం భ్రమే. ఏది చేస్తే బాగుంటుందో అదే చేయండి. మీ ఐక్యూని, ఈక్యూని సమపాళ్లలో ఉండేలా చూసుకోండి. ఐక్యూ మీరు విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది. ఈక్యూ సాహసాలను స్వాగతించేందుకు ఉపయోగపడుతుంది.
టైమ్ మేనేజ్‌మెంట్ గురించి చెప్పండి..
ఇన్నిరోజులపాటు దేనిమీద మన ఫోకస్ ఉందో దాన్ని మళ్లించడం కాస్త కష్టమే. అయితే డీఫోకస్ కూడా తెలిసుండాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకున్నా చాలా మంది వల్ల సాధ్యం కాదు. దానికి కూడా సమయం కేటాయిస్తూనే చదువుకు సమయం ఎక్కువగా కేటాయించేందుకు ప్రయత్నిస్తే సరిపోతుంది.
వీలైనంత ఎక్కువగా మీలోని బలాల్ని మెరుగుపర్చుకోండి..
‘చదవడం, నేర్చుకోవడం నిరంతరం కొనసాగిస్తూ ఉండాలని నేను నమ్ముతాను. మీ మొత్తం దృష్టి నేర్చుకోవడంపై పెట్టాలి. వీలైనంత ఎక్కువగా మీలోని బలాల్ని మెరుగుపర్చుకోవాలి, దీనినే జీవిత ధర్మంగా పాటిస్తూ ముందుకు సాగాలి. ఫలితాలు, మార్కులు అనేవి అనుబంధ ఉత్పత్తులుగా ఉండాలి.

Published date : 17 Feb 2018 02:11PM