నాణ్యమైన సంస్థలతోనే ఒప్పందం.. నీట్ పోర్టల్‌లో లభించే అంశాలివే..
Sakshi Education
ప్రస్తుతం దేశంలో వందల సంఖ్యలో ఎడ్‌టెక్ సంస్థలు.. వేలకొద్దీ ఆన్‌లైన్ కోర్సులు. వాటిలో చేరాలంటే ఎంతో కొంత ఫీజు చెల్లించాల్సిందే. ఐటీ, లేటెస్ట్ టెక్నాలజీ వంటి కోర్సులకు ఫీజు రూ.వేలల్లోనే ఉంటోంది.
దీంతో విద్యార్థులు అంతమొత్తం చెల్లించుకోలేకపోతున్నారు. ఫలితంగా ఎంతోమంది కొత్త నైపుణ్యాలకు దూరమవుతున్నారు. దీనికి పరిష్కారంగా తెచ్చిన విధానమే.. నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ(నీట్)!!
- ఈ–కంటెంట్
- సర్టిఫికేషన్ కోర్సులు
- అసెస్‌మెంట్ టెస్ట్‌లు
- సైకోమెట్రిక్ టెస్ట్‌లు/ మైయర్స్–బ్రిగ్స్ టైప్ ఇండికేటర్ టెస్ట్‌లు
- లేబొరేటరీ టూల్స్
- కోడింగ్ స్కిల్స్, టెస్టింగ్ స్కిల్స్
- లెర్నింగ్ గేమ్స్
- కెరీర్ కౌన్సెలింగ్
- ఇంటర్న్‌షిప్ సహకారం
- ప్లేస్‌మెంట్ అవకాశం
- ఆప్టిట్యూడ్ టెస్ట్స్
- కాగ్నిటివ్ స్కిల్స్
- మ్యాథమెటికల్ స్కిల్స్
- మేనేజ్‌మెంట్ స్కిల్స్
- అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్
- ప్రొఫెషనల్ కోర్సులకు అనుబంధంగా ఉండే ఇతర కోర్సులను నేర్చుకునే వీలుంది.
నేషనల్ ఎడ్యుకేషన్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ (నీట్).. ముఖ్యాంశాలు
- కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో కొత్త ఆన్‌లైన్ లెర్నింగ్ పోర్టల్‌గా నీట్.
- పీపీపీ విధానంలో ఎడ్ టెక్ సంస్థలతో ఒప్పందం.
- గత ఏడాది జనవరిలో నీట్ 1.0కు శ్రీకారం.
- తాజాగా కొద్ది రోజుల క్రితం నీట్ 2.0కు రూపకల్పన.
- ఒప్పందం నుంచి మధ్యలో వెనుదిరిగే అవకాశం లేకుండా సెక్యూరిటీ డిపాజిట్.
- ఎడ్‌టెక్ సంస్థలు నీట్ పోర్టల్ ద్వారా ఈ–లెర్నింగ్ అవకాశాలు కల్పిస్తాయి.
- ఇప్పటి వరకు అరవైకు పైగా సంస్థలతో కుదిరిన ఒప్పందం.
- తొలి దశలో రెండు లక్షలకు పైగా విద్యార్థులకు ప్రయోజనం.
- లాక్‌డౌన్ సమయంలో 58 వేల మంది విద్యార్థుల నమోదు.
- ఏఐ, ఎంఎల్ వంటి అధునాత విభాగాల్లో సర్టిఫికేషన్ కోర్సులు.
- ట్రెడిషనల్ కోర్సుల అభ్యసనానికీ అవకాశం.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.neat-aicte.org
నాణ్యమైన సంస్థలతోనే ఒప్పందం..
నీట్ పోర్టల్ ద్వారా పీపీపీ విధానంలో నాణ్యమైన ఎడ్ టెక్ సంస్థలæ ఆన్‌లైన్ కోర్సులను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నాం. ఆయా సంస్థల స్థాయికి అనుగుణంగా సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత మొత్తం ముందుగానే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఫలితంగా నాణ్యమైన సంస్థలు, మార్కెట్లో ఇప్పటికే ఆదరణ పొంది.. బీటుసీ విభాగంలో ముందంజలో ఉన్న సంస్థలే సంప్రదిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన బోధన లభిస్తుంది. మెరుగైన నైపుణ్యాలు సొంతమవుతాయి.
– బుద్ధా చంద్రశేఖర్, చీఫ్ కో–ఆర్డినేటింగ్ ఆఫీసర్, నీట్ (NEAT)

Published date : 02 Mar 2021 03:32PM