Skip to main content

నాన్-ఐటీ జాబ్స్ సాధించాలంటే ఇవి ఎంతో ముఖ్యం..

నాన్-ఐటీ రంగాల్లో ఐటీ కొలువులను దక్కించుకునే క్రమంలో విద్యార్థులు ఆధునిక నైపుణ్యాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా స్కిల్స్ నేర్చుకునేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో చేరుతున్న వారి సంఖ్య ఏటేటా వృద్ధి చెందుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
ఉదాహరణకు మూక్స్ సంస్థల్లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 30శాతం నుంచి 40శాతం మేర పెరిగింది. అదే విధంగా ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయిలో ఐఐటీలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్న ఏఐ,ఎంఎల్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. మేనేజ్‌మెంట్ విద్యార్థులు సైతం డేటా అనలిటిక్స్, బిగ్‌డేటా, బ్లాక్‌చైన్ టెక్నాలజీ వంటివి నేర్చుకునేందుకు ముందుకు వస్తున్నారు.

అందుబాటులో శిక్షణ వేదికలు..
నాన్-ఐటీ సెక్టార్‌లో నియామకాలు జరుగుతున్న క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏఐఎంల్, ఐఓటీ, రోబోటిక్స్, 3-డి డిజైన్ ప్రింటింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాలు అందిపుచ్చుకోవడానికి ఇప్పు డు పలు శిక్షణ వేదికలు అందుబాటులోకి వస్తున్నా యి. అకడమిక్‌గా బీటెక్, ఎంటెక్ స్థాయిలో ఇప్పుడి ప్పుడే ఈ కోర్సులను ప్రవేశ పెడుతున్నారు. కాని మూక్స్ విధానంలో ఎన్‌పీటీఈఎల్, స్వయం, ఎడె క్స్, ఉడెమీ వంటి వాటి ద్వారా అవగాహన పెంచు కోవచ్చు. వీటితోపాటు ఐబీఎం, సిస్కో, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, బ్లాక్‌చైన్ కౌన్సిల్ వంటి సంస్థలు సైతం ఆన్‌లైన్‌లో స్వల్పకాలిక కోర్సులు అందిస్తున్నాయి.

ఇంకా చదవండి: part 5: నాన్-ఐటీలో ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర వీటిదే..
Published date : 20 Nov 2020 04:19PM

Photo Stories