మహారాష్ట్రలో లా చదవాలనుకునే వారి కోసం ఎంహెచ్ సెట్..
Sakshi Education
మహారాష్ట్ర డెరైక్టరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంహెచ్‌సెట్ లాను దేశవ్యాప్తంగా 50కిపైగా కేంద్రాల్లో నిర్వహిస్తోంది.
ఈ పరీక్ష ద్వారా మహారాష్ట్రలోని లా ఇన్‌స్టిట్యూట్స్‌లో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మూడేళ్ల కోర్సుకు డిగ్రీ, ఐదేళ్ల కోర్సుకు ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. రెండు కోర్సులకు 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రంలో లీగల్ ఆప్టిట్యూడ్ అండ్ లీగల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్(కరెంట్ అఫైర్స్), లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, ఇంగ్లిష్ విభాగాలు ఉంటాయి. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు సంబంధించి పై విభాగాలకు అదనంగా బేసిక్ మ్యాథ్స్ విభాగంలో 10 ప్రశ్నలు అడుగుతారు. ఫిబ్రవరిలో ఎంహెచ్‌సెట్ లా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://cetcell.mahacet.org/
ఇంకా చదవండి: part 6: విదేశాల్లో లా చదవాలనుకునే వారి కోసం ఎల్‌శాట్- ఇండియా..
Published date : 03 Feb 2021 06:59PM