మెనేజ్మెంట్ కోర్సుల చేరాలనుకునేవారి కోసం క్యాట్.. సక్సెస్ మంత్ర ఇదిగో..!
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లు. ఇవి దేశంలోని ప్రతిష్టాత్మక బీస్కూల్స్!! వీటిల్లో మేనేజ్‌మెంట్ పీజీ పూర్తి చేసుకుంటే.. కార్పొరేట్ కంపెనీలు ఎర్రతివాచీ పరుస్తాయి! ప్రారంభ వేతనం రూ.లక్షల్లోనే ఉంటుంది! అలాంటి ఐఐఎంల్లో ప్రవేశానికి.. తొలి మెట్టు.. కామన్ అడ్మిషన్ టెస్ట్.. సంక్షిప్తంగా క్యాట్! సంప్రదాయ డిగ్రీల నుంచి ప్రొఫెషనల్ కోర్సుల వరకు.. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ.. క్యాట్‌కు అర్హులే. ఇందులో సాధించిన పర్సంటైల్ ఆధారంగా.. ఐఐఎంలు తదుపరి ఎంపిక ప్రక్రియ చేపట్టి ప్రవేశాలు ఖరారు చేస్తాయి. తాజాగా క్యాట్–2020 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో. .క్యాట్ విధి విధానాలు, ఐఐఎంల ప్రవేశ ప్రక్రియ, విజయానికి మార్గాలను తెలుసుకుందాం...
ఆన్‌లైన్ విధానం..
కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)ను ఆన్‌లైన్ విధానంలో మూడు సెక్షన్లలో నిర్వహిస్తారు. అవి..
ఎంసీక్యూ, నాన్–ఎంసీక్యూస్..
క్యాట్–2020లో ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతోపాటు, నాన్–ఎంసీక్యూలను కూడా అడగాలని నిర్ణయించారు. ఎంసీక్యూలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. నాన్–ఎంసీక్యూ ప్రశ్నల విషయంలో మాత్రం నెగెటివ్ మార్కుల విధానం లేదు.
విభాగాల వారీగా..
ఐఐఎంలు క్యాట్ స్కోర్ ఆధారంగా తదుపరి దశ ప్రవేశ ప్రక్రియ నిర్వíßహిస్తాయి. అందుకోసం ప్రతి సెక్షన్‌లోనూ నిర్ణీత కటాఫ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. కాబట్టి పరీక్షలో ప్రతి విభాగంలోనూ మంచి పర్సంటైల్ సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ 70 నుంచి 90 పర్సంటైల్.. మొత్తం మూడు సెక్షన్లు కలిపి 85కు పైగా పర్సంటైల్ సాధించేందుకు ప్రయత్నించడం ద్వారా మలి దశకు మార్గం సుగమం చేసుకోవచ్చు.
వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్..
ఇది అభ్యర్థుల ఇంగ్లిష్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్ నాలెడ్జ్‌ను పరీక్షించే విభాగం. ఇందులో రాణించాలంటే.. యాంటానిమ్స్, సినానిమ్స్, బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా ఫ్యాక్ట్స్, ఇన్ఫరెన్సెస్, జంబుల్డ్ పారాగ్రాఫ్స్‌లను ప్రాక్టీస్ చేయడం మేలు చేస్తుంది. రీడింగ్ కాంప్రహెన్షన్‌కు సంబంధించి ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మంచి మార్కులు సాధించాలంటే.. అసెంప్షన్, స్టేట్‌మెంట్స్‌పై పట్టు సాధించాలి.
డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్..
ఈ విభాగంలో అభ్యర్థుల్లోని తార్కిక విశ్లేషణ నైపుణ్యాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మెరుగైన స్కోర్ సాధించాలంటే.. టేబుల్స్, గ్రాఫ్స్, చార్ట్స్ ఆధారిత ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. లాజికల్ రీజనింగ్ విషయంలో.. క్యూబ్స్, క్లాక్స్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, సీటింగ్ అరేంజ్‌మెంట్ వంటి అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్..
ఇది పూర్తిగా అభ్యర్థుల్లోని మ్యాథమెటికల్, అర్థమెటికల్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ఉంటుంది. ఇందులో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలంటే.. అర్థమెటిక్‌కు సంబంధించిన పర్సంటేజెస్, రేషియోస్, డిస్టెన్స్ అండ్ టైం వంటి అంశాలపై పట్టు సాధించాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి అల్‌జీబ్రా, మోడ్రన్ మ్యాథ్స్, జామెట్రీలపై అవగాహన పెంచుకోవాలి.
కాన్సెప్ట్స్, ప్రాక్టీస్..
క్యాట్‌లో మెరుగైన స్కోర్, పర్సంటైల్ సాధించేందుకు ప్రతి సెక్షన్ కీలకమే. కాబట్టి అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ముందుగా సిలబస్‌ను పరిశీలించి.. వాటికి సంబంధించిన కాన్సెప్ట్‌లపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత ప్రామాణిక మెటీరియల్ ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి. దీంతోపాటు ప్రతి టాపిక్ పూర్తయిన తర్వాత ప్రాక్టీస్ చేయడం ఎంతో మేలు చేస్తుంది.
మాక్‌టెస్టులు, మోడల్ టెస్ట్‌లు..
క్యాట్ సన్నద్ధతలో అభ్యర్థులు మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం మేలు చేస్తుంది. కనీసం ఆరు మాక్ టెస్ట్‌లు రాసేలా ప్లాన్ చేసుకోవాలి. ఆయా మాక్ టెస్ట్‌ల ఫలితాలను విశ్లేషించుకొని..ఇంకా పట్టు సాధించాల్సిన అంశాలను గుర్తించి.. వాటిపై మరింత ఎక్కువ దృష్టి సారించాలి.
మలిదశ కీలకం..
ఐఐఎంలు క్యాట్ స్కోర్ ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి.. అర్హులైన అభ్యర్థులకు మలి దశలో గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వూలను నిర్వహిస్తున్నాయి. వీటికి నిర్దిష్ట వెయిటేజీ కేటాయించే విధానాన్ని అనుసరిస్తున్నాయి. గత ప్రవేశ విధానాలను పరిశీలిస్తే.. క్యాట్ స్కోర్‌కు 50 నుంచి 70శాతం, జీడీ/పీఐలకు 30 నుంచి 50 శాతం మధ్యలో వెయిటేజీ లభిస్తోంది. కాబట్టి అభ్యర్థులు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వూ, రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లలో రాణించేందుకు గట్టిగా కృషి చేయాలి.
జీడీ, పీఐలు... ఇలా
ఐఐఎంలు మలి దశలో నిర్వహించే గ్రూప్ డిస్కషన్‌లో భాగంగా అభ్యర్థులను నిర్దిష్ట సంఖ్యలో బృందాలుగా విభజించి.. ఒక్కో బృందానికి ఏదైనా టాపిక్ ఇచ్చి దానిపై మాట్లాడమంటారు. ఒక్కో బృందంలో ఎనిమిది నుంచి పది మంది అభ్యర్థులు ఉంటున్నారు. జీడీ సమయంలోనే కొన్ని ఐఐఎంలు రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌ను నిర్వహిస్తున్నాయి. ఏదైనా ఒక అంశాన్ని లేదా అంతకుముందు గ్రూప్ డిస్కషన్‌లో పేర్కొన్న టాపిక్‌పై తమ అభిప్రాయాలను నిర్దిష్ట పద పరిమితితో రాయాలని అడుగుతున్నాయి. ఈ రెండూ పూర్తయిన తర్వాత చివరగా నిర్వహించే ప్రక్రియ..పర్సనల్ ఇంటర్వూ్య. ఇందులో అభ్యర్థులు మేనేజ్‌మెంట్ విద్యను ఎందుకు అభ్యసించాలనుకుంటున్నారు.. ఐఐఎంలనే ఎంచుకోవడానికి కారణం.. భవిష్యత్తు లక్ష్యాలు, ఆసక్తులు.. తదితర ప్రశ్నలు అడుగుతున్నారు. వీటన్నింటినీ విజయవంతంగా పూర్తిచేసుకొని తుది జాబితాలో నిలిస్తే ఐఐఎంల్లో ప్రవేశం లభిస్తుంది.
20 ఐఐఎంలు.. అయిదు వేల సీట్లు
ప్రస్తుతం క్యాట్–2020 ద్వారా దేశంలోని మొత్తం 20 ఐఐఎంలలో పీజీ స్థాయిలో 4,951 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇన్‌స్టిట్యూట్‌ల వారీగా సీట్లు..
క్యాట్–2020 ముఖ్య సమాచారం..
పర్సంటైల్ నిర్ధారణకు పకడ్బందీ విధానం..
క్యాట్‌ను రెండు సెషన్లలో నిర్వహిస్తున్న నేపథ్యంలో.. సులభంగా ప్రశ్నలు వచ్చిన సెషన్ అభ్యర్థులు మంచి పర్సంటైల్ సాధిస్తారనే అభిప్రాయాల్లో వాస్తవం లేదు. స్కోర్ నార్మలైజేషన్ విధానాన్ని అనుసరిస్తున్నాం. దీనివల్ల ఒకవేళ ఒక సెషన్‌లో ప్రశ్నలు సులభంగా వచ్చినా.. ఈ నార్మలైజేషన్ విధానం వల్ల రెండు సెషన్ల అభ్యర్థులకూ పర్సంటైల్ విషయంలో ఎలాంటి వ్యత్యాసం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. బేసిక్ మ్యాథ్స్, ఇంగ్లిష్‌పై అవగాహన ఉన్న వారెవరైనా క్యాట్‌లో మెరుగైన ప్రతిభ చూపే అవకాశం ఉంది.
– ప్రొఫెసర్ హర్షాల్ లొవలేకర్, క్యాట్–2020 కన్వీనర్
దేశవ్యాప్తంగా ఉన్న 20 ఐఐఎంల్లో పీజీ, పీహెచ్‌డీ/ఫెలోప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు వీలు కల్పించే పరీక్ష.. క్యాట్. ఇది క్లిష్టమైన ఎంట్రన్స్ టెస్ట్‌లలో ఒకటిగా పేరొందిన పరీక్ష. కారణం.. ఈ పరీక్ష విధానం.. అడిగే ప్రశ్నలే శైలే!
ఆన్‌లైన్ విధానం..
కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)ను ఆన్‌లైన్ విధానంలో మూడు సెక్షన్లలో నిర్వహిస్తారు. అవి..
- వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్– 34 ప్రశ్నలు
- డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్–32 ప్రశ్నలు
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్–32 ప్రశ్నలు
- మొత్తం ప్రశ్నల సంఖ్య– 100
- ప్రతి సెక్షన్‌కు గంట చొప్పున మొత్తం మూడు గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది.
ఎంసీక్యూ, నాన్–ఎంసీక్యూస్..
క్యాట్–2020లో ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతోపాటు, నాన్–ఎంసీక్యూలను కూడా అడగాలని నిర్ణయించారు. ఎంసీక్యూలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. నాన్–ఎంసీక్యూ ప్రశ్నల విషయంలో మాత్రం నెగెటివ్ మార్కుల విధానం లేదు.
విభాగాల వారీగా..
ఐఐఎంలు క్యాట్ స్కోర్ ఆధారంగా తదుపరి దశ ప్రవేశ ప్రక్రియ నిర్వíßహిస్తాయి. అందుకోసం ప్రతి సెక్షన్‌లోనూ నిర్ణీత కటాఫ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. కాబట్టి పరీక్షలో ప్రతి విభాగంలోనూ మంచి పర్సంటైల్ సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ 70 నుంచి 90 పర్సంటైల్.. మొత్తం మూడు సెక్షన్లు కలిపి 85కు పైగా పర్సంటైల్ సాధించేందుకు ప్రయత్నించడం ద్వారా మలి దశకు మార్గం సుగమం చేసుకోవచ్చు.
వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్..
ఇది అభ్యర్థుల ఇంగ్లిష్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్ నాలెడ్జ్‌ను పరీక్షించే విభాగం. ఇందులో రాణించాలంటే.. యాంటానిమ్స్, సినానిమ్స్, బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా ఫ్యాక్ట్స్, ఇన్ఫరెన్సెస్, జంబుల్డ్ పారాగ్రాఫ్స్‌లను ప్రాక్టీస్ చేయడం మేలు చేస్తుంది. రీడింగ్ కాంప్రహెన్షన్‌కు సంబంధించి ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మంచి మార్కులు సాధించాలంటే.. అసెంప్షన్, స్టేట్‌మెంట్స్‌పై పట్టు సాధించాలి.
డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్..
ఈ విభాగంలో అభ్యర్థుల్లోని తార్కిక విశ్లేషణ నైపుణ్యాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మెరుగైన స్కోర్ సాధించాలంటే.. టేబుల్స్, గ్రాఫ్స్, చార్ట్స్ ఆధారిత ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. లాజికల్ రీజనింగ్ విషయంలో.. క్యూబ్స్, క్లాక్స్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, సీటింగ్ అరేంజ్‌మెంట్ వంటి అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్..
ఇది పూర్తిగా అభ్యర్థుల్లోని మ్యాథమెటికల్, అర్థమెటికల్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ఉంటుంది. ఇందులో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలంటే.. అర్థమెటిక్‌కు సంబంధించిన పర్సంటేజెస్, రేషియోస్, డిస్టెన్స్ అండ్ టైం వంటి అంశాలపై పట్టు సాధించాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి అల్‌జీబ్రా, మోడ్రన్ మ్యాథ్స్, జామెట్రీలపై అవగాహన పెంచుకోవాలి.
కాన్సెప్ట్స్, ప్రాక్టీస్..
క్యాట్‌లో మెరుగైన స్కోర్, పర్సంటైల్ సాధించేందుకు ప్రతి సెక్షన్ కీలకమే. కాబట్టి అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ముందుగా సిలబస్‌ను పరిశీలించి.. వాటికి సంబంధించిన కాన్సెప్ట్‌లపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత ప్రామాణిక మెటీరియల్ ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి. దీంతోపాటు ప్రతి టాపిక్ పూర్తయిన తర్వాత ప్రాక్టీస్ చేయడం ఎంతో మేలు చేస్తుంది.
మాక్‌టెస్టులు, మోడల్ టెస్ట్‌లు..
క్యాట్ సన్నద్ధతలో అభ్యర్థులు మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం మేలు చేస్తుంది. కనీసం ఆరు మాక్ టెస్ట్‌లు రాసేలా ప్లాన్ చేసుకోవాలి. ఆయా మాక్ టెస్ట్‌ల ఫలితాలను విశ్లేషించుకొని..ఇంకా పట్టు సాధించాల్సిన అంశాలను గుర్తించి.. వాటిపై మరింత ఎక్కువ దృష్టి సారించాలి.
మలిదశ కీలకం..
ఐఐఎంలు క్యాట్ స్కోర్ ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి.. అర్హులైన అభ్యర్థులకు మలి దశలో గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వూలను నిర్వహిస్తున్నాయి. వీటికి నిర్దిష్ట వెయిటేజీ కేటాయించే విధానాన్ని అనుసరిస్తున్నాయి. గత ప్రవేశ విధానాలను పరిశీలిస్తే.. క్యాట్ స్కోర్‌కు 50 నుంచి 70శాతం, జీడీ/పీఐలకు 30 నుంచి 50 శాతం మధ్యలో వెయిటేజీ లభిస్తోంది. కాబట్టి అభ్యర్థులు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వూ, రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లలో రాణించేందుకు గట్టిగా కృషి చేయాలి.
జీడీ, పీఐలు... ఇలా
ఐఐఎంలు మలి దశలో నిర్వహించే గ్రూప్ డిస్కషన్‌లో భాగంగా అభ్యర్థులను నిర్దిష్ట సంఖ్యలో బృందాలుగా విభజించి.. ఒక్కో బృందానికి ఏదైనా టాపిక్ ఇచ్చి దానిపై మాట్లాడమంటారు. ఒక్కో బృందంలో ఎనిమిది నుంచి పది మంది అభ్యర్థులు ఉంటున్నారు. జీడీ సమయంలోనే కొన్ని ఐఐఎంలు రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌ను నిర్వహిస్తున్నాయి. ఏదైనా ఒక అంశాన్ని లేదా అంతకుముందు గ్రూప్ డిస్కషన్‌లో పేర్కొన్న టాపిక్‌పై తమ అభిప్రాయాలను నిర్దిష్ట పద పరిమితితో రాయాలని అడుగుతున్నాయి. ఈ రెండూ పూర్తయిన తర్వాత చివరగా నిర్వహించే ప్రక్రియ..పర్సనల్ ఇంటర్వూ్య. ఇందులో అభ్యర్థులు మేనేజ్‌మెంట్ విద్యను ఎందుకు అభ్యసించాలనుకుంటున్నారు.. ఐఐఎంలనే ఎంచుకోవడానికి కారణం.. భవిష్యత్తు లక్ష్యాలు, ఆసక్తులు.. తదితర ప్రశ్నలు అడుగుతున్నారు. వీటన్నింటినీ విజయవంతంగా పూర్తిచేసుకొని తుది జాబితాలో నిలిస్తే ఐఐఎంల్లో ప్రవేశం లభిస్తుంది.
20 ఐఐఎంలు.. అయిదు వేల సీట్లు
ప్రస్తుతం క్యాట్–2020 ద్వారా దేశంలోని మొత్తం 20 ఐఐఎంలలో పీజీ స్థాయిలో 4,951 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇన్‌స్టిట్యూట్‌ల వారీగా సీట్లు..
- అహ్మదాబాద్–395
- బెంగళూరు–400
- కోల్‌కత–460
- లక్నో–500
- ఇండోర్–450
- నాగ్‌పూర్–130
- ఉదయ్‌పూర్–325
- త్రిచీ–240
- కాశీపూర్–240
- కోజికోడ్–480
- బో«ద్‌గయ–120
- రోహ్‌తక్–264
- రాంచీ–185
- సిౖర్మౌర్–120
- అమృత్‌సర్–160
- షిల్లాంగ్–92
- రాయ్‌పూర్–90
- జమ్ము–90
- సంబల్‌పూర్–90
- విశాఖపట్నం–120.
క్యాట్–2020 ముఖ్య సమాచారం..
- అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత).
- బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 16, 2020
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: అక్టోబర్ 28–నవంబర్ 29
- క్యాట్ 2020 పరీక్ష తేదీ: నవంబర్ 29, 2020 (రెండు సెషన్లలో జరుగుతుంది. అభ్యర్థులు తమకు కేటాయించిన సెషన్‌కు మాత్రమే హాజరు కావాలి.)
- ఫలితాల వెల్లడి: జనవరి 2021 చివరి వారం
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.iimcat.ac.in
పర్సంటైల్ నిర్ధారణకు పకడ్బందీ విధానం..
క్యాట్‌ను రెండు సెషన్లలో నిర్వహిస్తున్న నేపథ్యంలో.. సులభంగా ప్రశ్నలు వచ్చిన సెషన్ అభ్యర్థులు మంచి పర్సంటైల్ సాధిస్తారనే అభిప్రాయాల్లో వాస్తవం లేదు. స్కోర్ నార్మలైజేషన్ విధానాన్ని అనుసరిస్తున్నాం. దీనివల్ల ఒకవేళ ఒక సెషన్‌లో ప్రశ్నలు సులభంగా వచ్చినా.. ఈ నార్మలైజేషన్ విధానం వల్ల రెండు సెషన్ల అభ్యర్థులకూ పర్సంటైల్ విషయంలో ఎలాంటి వ్యత్యాసం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. బేసిక్ మ్యాథ్స్, ఇంగ్లిష్‌పై అవగాహన ఉన్న వారెవరైనా క్యాట్‌లో మెరుగైన ప్రతిభ చూపే అవకాశం ఉంది.
– ప్రొఫెసర్ హర్షాల్ లొవలేకర్, క్యాట్–2020 కన్వీనర్
Published date : 25 Aug 2020 11:39AM