మేటి ఇన్స్టిట్యూట్స్ లో డ్యూయల్ డిగ్రీ కోసం జామ్.. సమాచారం ఇదిగో..
ఐఐఎస్సీ, ఐఐటీలు దేశం గర్వించదగ్గ విద్యాసంస్థలు. వీటిలో ఏ కోర్సు చదివినా కెరీర్‌లో ఉన్నత స్థాయికి వెళ్లడం ఖాయం. తాజాగా ఐఐటీలు, ఐఐఎస్సీలో ఎమ్మెస్సీ, జాయింట్ ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ
డ్యూయల్ డిగ్రీ, మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్, పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు వీలుకల్పించే జాయింట్ అడ్మిషన్ టెస్టు ఫర్ మాస్టర్స్ (జామ్)– 2021కు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో.. జామ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు, కోర్సులు, టెస్టు పేపర్లు, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం..
ఇన్‌స్టిట్యూట్‌లు..
- ఐఐఎస్సీ బెంగళూరు
- ఐఐటీ–భిలాయ్, భువనేశ్వర్, బాంబే, ఢిల్లీ, ధన్‌బాద్, గాంధీనగర్,గువహటి, హైదరాబాద్, ఇండోర్, జో«ద్‌పూర్, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, మండి, పాలక్కడ్, పట్నా, రూర్కీ, రోపార్, తిరుపతి, వారణాసి.
- వీటితోపాటు ఎన్‌ఐటీలు, ఐసర్‌లు, ఐఐఈఎస్‌టీ శిబ్‌పూర్, ఎస్‌ఎల్‌ఐఈటీ పంజాబ్‌లు జామ్ స్కోరును అంగీకరిస్తున్నాయి.
టెస్టు పేపర్లు..
జామ్‌ను ఏడు పేపర్లలో నిర్వహిస్తున్నారు. అవి..
- బయోటెక్నాలజీ
- కెమిస్ట్రీ
- ఎకనామిక్స్
- జియాలజీ
- మ్యాథమెటిక్స్
- మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్
- ఫిజిక్స్. అభ్యర్థి గరిష్టంగా రెండింటికి హాజరవ్వొచ్చు.
కోర్సులు..
- ఎమ్మెస్సీ(రెండేళ్లు)
- మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్(రెండేళ్లు)
- జాయింట్ ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ
- ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ
- పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్
- ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్.
అర్హత..
- సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా 5.5 సీజీపీఏ ఉండాలి.
పరీక్ష స్వరూపం..
- జామ్‌ను ఆన్‌లైన్‌లో మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. 100 మార్కులకు 60 ప్రశ్నలను అడుగుతారు. ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి.
- సెక్షన్ ఎ: 30 మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్(ఎంసీక్యూ)ఉంటాయి. ఇందులో 10 ఒక మార్కు, 20 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి.
- సెక్షన్ బి: 10 మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్(ఎంఎస్‌క్యూ) ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. వీటిలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి.
- సెక్షన్ సి: 20 న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 10 ప్రశ్నలకు 1 మార్కు, 10 ప్రశ్నలకు 2 మార్కులు కేటాయించారు.
- ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు.
ప్రవేశ విధానం..
జామ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే ప్రవేశాలకు పరిగణలోకి తీసుకుంటారు. ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థులు ముందుగా జామ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (జేఓఏపీఎస్)లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారంలు జేఓఏపీఎస్‌లో అందుబాటులో ఉంటాయి.
సిలబస్, ప్రిపరేషన్:
కెమిస్ట్రీ..
- ఫిజికల్ కెమిస్ట్రీ: బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్టులు, అటామిక్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, థియరీ ఆఫ్ గ్యాసెస్, సాలిడ్ స్టేట్, కెమికల్ థర్మోడైనమిక్స్, కెమికల్ అండ్ ఫేజ్ ఈక్విలిబ్రియా, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్, అబ్సార్ప›్షన్, స్పెక్ట్రోమెట్రి.
- ఆర్గానిక్ కెమిస్ట్రీ: ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ స్పెక్ట్రోమెట్రి బేసిక్ కాన్సెప్టులు, ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం, సింథటిక్ అప్లికేషన్స్, క్వాలిటేటివ్ ఆర్గానిక్ అనాలసిస్, నేచురల్ ప్రొడక్ట్స్ కెమిస్ట్రీ,ఆరోమాటిక్ అండ్ హెటిరోసైక్లిక్ కెమిస్ట్రీ.
- ఇనార్గానిక్ కెమిస్ట్రీ: పిరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, షేప్స్ ఆఫ్ కాంపౌండ్స్, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ మెటల్స్, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ.
బయోటెక్నాలజీ..
బయోటెక్నాలజీ పేపర్‌కు హాజరయ్యే అభ్యర్థులు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ను ప్రిపేరవ్వాల్సి ఉంటుంది. బయాలజీని టెన్త్, ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో ప్రిపేరవ్వాలి. జనరల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీ, బేసిక్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ, మైక్రోబయాలజీ చాప్టర్లను ప్రిపేర వ్వాలి. కెమిస్ట్రీ సంబంధించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పాఠ్యాంశాలను చదవాలి. మ్యాథ్స్, ఫిజి క్స్‌లను ఇంటర్ స్థాయిలో చదివితే సరిపోతుంది.
ఎకనామిక్స్..
మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్‌లను అధ్యయనం చేయాలి.
జియాలజీ..
ప్లానెట్ ఎర్త్, జియో మార్ఫాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, పాలియోంటాలజీ, స్టాటిగ్రఫీ, మినరాలజీ, పెట్రోలజీ, ఎకనామిక్ జియాలజీ, అప్లయిడ్ జియాలజీలను చదవాలి.
మ్యాథమెటిక్స్..
సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఆఫ్ రియల్ నంబర్స్, ఫంక్షన్స్ ఆఫ్ వన్/టూ/త్రీ రియల్ వేరియబుల్, ఇంటెగ్రల్ క్యాల్కులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ క్యాల్కులస్, గ్రూప్ థియరీ, లీనియర్ ఆల్‌జీబ్రా, రియల్ అనాలసిస్ పాఠ్యాంశాలను ప్రిపేరవ్వాలి.
మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్..
ఈ పేపర్‌లో మ్యాథ్స్‌కు 40 శాతం, స్టాటిస్టిక్స్‌కు 60 శాతం వెయిటేజీ ఉంటుంది. మ్యాథ్స్‌లో సీక్వెన్సెస్ అండ్ సిరీస్, డిఫరెన్షియల్ క్యాల్కులస్, ఇంటెగ్రల్ క్యాల్కులస్, మాట్రిసెస్ చాప్టర్లను అధ్యయనం చేయాలి. స్టాటిస్టిక్స్‌లో ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్, జాయింట్ డిస్ట్రిబ్యూషన్, సాంప్లింగ్ డిస్ట్రిబ్యూ షన్, లిమిట్ థీరమ్స్, ఎస్టిమేషన్, టెస్టింగ్ ఆఫ్ హైపో థీసిస్‌లను అధ్యయనం చేయాలి.
ఫిజిక్స్..
మ్యాథమెటికల్ మెథడ్స్, మెకానిక్స్ అండ్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్, ఆసిలేషన్స్, వేవ్స్ అండ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజం, కైనటిక్ థియరీ, థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, డివైజెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ పాఠ్యాంశాలను ప్రిపేరవ్వాలి.
జామ్ 2021 ముఖ్యసమాచారం:
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ఫీజు: ఒక పేపర్‌కు రూ.1500, రెండు పేపర్లకు రూ.2100, మహిళలు/ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1050
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబరు 10, 2020
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 15, 2020
- అడ్మిట్ కార్డుల జారీ: జనవరి 5, 2021
- పరీక్ష తేదీ: ఫిబ్రవరి 14, 2021
- ఫలితాల వెల్లడి: మార్చి 20, 2021
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://jam.iisc.ac.in