Skip to main content

మేనేజ్‌మెంట్ చదవాలనుకునే వారికి క్యాట్ కాకుండా మరో దారి.. ఎక్స్‌ఏటీ-2021.. సమాచారం ఇదిగో..

మేనేజ్‌మెంట్ మాస్టర్స్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే మరో ఎంట్రన్స్ టెస్ట్.. జేవియర్ అప్టిట్యూడ్ టెస్ట్(ఎక్స్‌ఏటీ).

తాజాగా ఎక్స్‌ఏటీ-2021కు నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ అర్హతతో ఎక్స్‌ఏటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఎక్స్‌ఏటీ ప్రత్యేకతలు, భాగస్వామ్య ఇన్‌స్టిట్యూట్‌లు, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం.. 

 కోర్సులు- కాల వ్యవధి..

 దీని ద్వారా ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐలో పీజీడీఎం బిజినెస్ మేనేజ్‌మెంట్; పీజీడీఎం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్. ఈ రెండు కోర్సుల కాల వ్యవధి: రెండేళ్లు. అలాగే మరో కోర్సు.. పీజీడీఎం-జనరల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్. దీని కాల వ్యవధి 15 నెలలు. దీంతోపాటు ఎఫ్‌పీఎం- నాలుగేళ్ల ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్‌లోనూ ప్రవేశం పొందొచ్చు. 

  భాగస్వామ్య ఇన్‌స్టిట్యూట్‌లు..

 దేశంలోని 78 ఇన్‌స్టిట్యూట్‌లు ఎక్స్‌ఏటీకి భాగస్వామ్యంగా ఉన్నాయి. వీటితోపాటు మరో 11 ఇన్‌స్టిట్యూట్‌లు ఎక్స్‌ఏఎమ్‌ఐ మెంబర్స్‌గా ఉన్నాయి. ఎక్స్‌ఏటీ ద్వారా ప్రవేశం కల్పిస్తున్న పలు ఇన్‌స్టిట్యూట్స్.. 

  1.     గ్జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్, ముంబై
  2.     సెయింట్ ఫ్రాన్సిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్, ముంబై
  3.     అమృత స్కూల్ ఆఫ్ బిజినెస్
  4.     ఏషియా పసిఫిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, న్యూఢిల్లీ
  5.     ఏషియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, భువనేశ్వర్
  6.     బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, గ్రేటర్ నోయిడా
  7.     బీఎంఎల్ ముంజల్ యూనివర్సిటీ, గుర్ గావ్
  8.     సీఎంఎస్ బిజినెస్ స్కూల్
  9.     ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, పుణె తదితరాలు. 

ఇంకా చ‌ద‌వండి: part 2: మేనేజ్‌మెంట్ కోర్సుల కోసం ఎక్స్‌ఏటీ-2021.. పరీక్ష విధానం ఇదిగో..

Published date : 30 Sep 2020 05:50PM

Photo Stories