లాకు మరో మార్గం ఎల్‌శాట్.. దరఖాస్తుకు చివరి తేది ఇదే..
అలాగే ఆయా రాష్ట్రాల్లోని యూనివర్సిటీల పరిధిలోని లా కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం ప్రత్యేకంగా లా ఎంట్రెన్స్(లాసెట్) టెస్టులు నిర్వహిస్తున్నారు. వీటికి భిన్నంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లా స్కూల్స్‌లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పించేదే... ఎల్‌శాట్(లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్). ఈ ఏడాది జూలైలో జరగాల్సిన ఎల్‌శాట్ పరీక్ష కోవిడ్ నేపథ్యంలో అక్టోబర్‌కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో..
ఎల్‌శాట్ ఇండియా పరీక్ష వివరాలు..
అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (ఎల్‌ఎస్‌ఏసీ) ఆ దేశంలోని పలు లా స్కూల్స్‌లో ప్రవేశాలు కల్పించేందుకు వీలుగా ‘‘లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్’’(ఎల్‌శాట్)ను నిర్వహిస్తోంది. ఇందులో సాధించిన స్కోర్ ఆధారంగా అమెరికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖ లా స్కూల్స్‌లో ప్రవేశం పొందుతారు. ఈ పరీక్షను ‘ఎల్‌శాట్–ఇండియా’ పేరుతో మన దేశంలోనూ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 24 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. ఇందులో సాధించిన స్కోరుతో దేశంలోని పలు ప్రైవేటు యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు అడ్మిషన్ కల్పిస్తున్నాయి. వాస్తవానికి ఎల్‌శాట్ విదేశాల్లో ఏటా ఆరుసార్లు జరుగుతుండగా.. మన దేశంలో మాత్రం ‘ఎల్‌శాట్ ఇండియా’ పేరిట ఏడాదికి ఒక్కసారే నిర్వహిస్తున్నారు.
అర్హతలు..
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందాలంటే..10+2/ ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సు కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. రిజర్వేషన్ వర్గాలకు కనీస అర్హత మార్కుల్లో సడలింపు ఉంటుంది. ఎల్‌శాట్ ఇండియా ఎగ్జామ్ రాసేందుకు అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి నిబంధన లేదు.
పరీక్ష విధానం..
ఎల్‌శాట్–ఇండియా ఆన్‌లైన్‌లో, కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరుగు తుంది. ప్రధానంగా లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్‌ను పరీక్షిం చేలా ప్రశ్న పత్రం ఉంటుంది. సుమారు 92 నుంచి 100 వరకు మల్టిపు ల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. వీటిని 2.20 గంటల సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కుల విధానం లేదు. అనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్‌పై ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో సెక్షన్ కు సంబంధించి 22 నుంచి 24 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సెక్షన్‌కు 35 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది. ఆలోగా వాటిని పూర్తి చేయాలి. నిర్దిష్ట సమయంలో సదరువిభాగం ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తేనే తదుపరి విభాగానికి వెళ్లే అవకాశం ఉంటుంది.
మన దేశంలో విద్యా సంస్థలు..
ఎల్‌శాట్–ఇండియా పరీక్షకు హాజరైన అభ్యర్థుల స్కోరును పర్సంటైల్ విధానంలో ప్రకటిస్తారు. ఈ స్కోరు ఆధారంగా మన దేశంలోని పదుల సంఖ్యలో ప్రైవేటు యూనివర్సిటీలు, లా కాలేజీలు ప్రవేశాలు కల్పిస్తు న్నాయి. బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, బీకామ్ ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ వంటి న్యాయ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.discoverlaw.in/lsat-india