క్యాట్‌తో ఐఐఎంలో సీటు రావాలంటే.. ఇంటర్వూ ప్రిపరేషన్ ఇలా..
Sakshi Education
క్యాట్ స్కోరుకు ఒక్కో ఐఐఎం ఒక్కోవిధమైన వెయిటేజీ ఇస్తుంది. తుది ఎంపికలో క్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూతో పాటు రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పదోతరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ మార్కులు, పని అనుభవానికి కూడా వెయిటేజీ ఉంటుంది.
కీ చూసుకొని.. క్యాట్ ఆన్‌లైన్ టెస్ట్‌లో మంచి స్కోర్ వస్తుందని ఆశించే అభ్యర్థులు.. తదుపరి దశ కోసం సన్నద్ధత ప్రారం భించడం మేలు. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ కోసం నిత్యం ఏదైనా ప్రామాణిక దినపత్రి కతోపాటు బిజినెస్ న్యూస్ ఛానల్స్, పత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలి. కరెంట్ అఫై ర్స్‌పై పట్టు సాధించాలి. దాంతోపాటు ముఖ్యమైన తాజా పరిణామాలపై విశ్లేషణాత్మక దృక్పథం అలవరచుకోవాలి. ఏదైనా ఒక అంశంపై అభ్యర్థి తన ఆలోచనలను క్రమపద్ధతిలో అమర్చేలా రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుండాలి. ప్రస్తుతం ప్రముఖ బీస్కూల్స్ అన్నీ అనుభవానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. అలాంటి అభ్యర్థులకు అదనపు పాయింట్లు కేటాయిస్తున్నాయి. అంటే.. క్యాట్ స్కోరుతోపాటు అనుభవం కూడా తోడైతే వారికి ప్రాధాన్యం దక్కుతోంది.
ఇంకా చదవండి: part 4: క్యాట్‌తో ఐఐఎంలో సీటు రాకుంటే.. ఏం చేయాలో తెలుసా?
ఇంకా చదవండి: part 4: క్యాట్‌తో ఐఐఎంలో సీటు రాకుంటే.. ఏం చేయాలో తెలుసా?
Published date : 17 Dec 2020 02:40PM